10, ఏప్రిల్ 2024, బుధవారం

గందరగోళంగా జూ. కళాశాలల ప్రిన్సిపల్స్ పదోన్నతులు !

డైరెక్ట్ రిక్రూటిలకు మాత్రమే ప్రమోషన్లు 
లైబ్రేరియన్, వ్యాయమ ఉపాధ్యాయులకు అనుకూలంగా సిగిల్ జడ్జి తీర్పు 
పదోన్నతులకై కోర్టుకెక్కిన ప్రమోటిలు
పదోన్నతుల జీ ఓ ను కొట్టేసిన ధర్మాసనం 

ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు 

జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్ పదోన్నతి వ్యవహారం గందరగోళంగా, వివాదాస్పదంగా మారింది. కంబైన్డ్ సీనియారిటీ లిస్టును పక్కనపెట్టి, డైరెక్టర్ రిక్రూటీలకు మాత్రమే పదోన్నతులు కల్పించడంతో అర్హత కలిగిన పలువురు లెక్చరర్లుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో ఇప్పటికే పలువురు లెక్చరర్లు కోర్టు తలుపు తట్టారు. మరి కొంతమంది కోర్టుకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. 

చిత్తూరు జిల్లాలో సుమారుగా 30 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో 150 మంది రెగ్యులర్ లెక్చరర్లు, 400 మంది కాంట్రాక్టు లెక్చరర్లు పనిచేస్తున్నారు. రెగ్యులర్ లెక్చరర్లకు గత ఐదు సంవత్సరాలుగా పదోన్నతి కల్పించలేదు. పదోన్నతి కల్పించడంలో డైరెక్టుగా ఏపీపీఎస్సీ ద్వారా రిక్రూట్ అయిన వారికి మాత్రమే కల్పించాలని ఒక వర్గం డిమాండ్ చేస్తుంది. జిల్లా పరిషత్ పాఠశాలల నుంచి, ప్రభుత్వ పాఠశాలల నుంచి,  స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి నాన్ టీచింగ్ స్టాఫ్ నుండి పదోన్నతి పొందిన వారికి కూడా ప్రమోషన్లు ఇవ్వాలని మరో వర్గం పట్టుబడుతుంది. ఈ వివాదం కారణంగా ఐదు సంవత్సరాలుగా జూనియర్ కళాశాల లెక్చరర్లకు పదోన్నతులు లేవు. అయితే అందరికీ కలిపి ఉమ్మడి సీనియారిటీ జాబితాను రూపొందించి, ప్రమోషన్లు కల్పించాలని ప్రభుత్వం భావించింది. ఇందుకు అగుణంగా ఉమ్మడి సీనియారిటీ జాబితాను తయారుచేసింది. పదోన్నతుల విషయంలో చర్చించడానికి ఇరు వర్గాలను ఉన్నత విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో 50% డైరెక్టర్ రిక్రూటీలకు, మరో 50% ప్రమోషన్లు ప్రమోషన్ మీద వచ్చిన వారికి కల్పించాలని మంత్రి ప్రతిపాదించారు. అయితే ఇందుకు ఒక నాయకుడు అంగీకరించలేదు. దీంతో ఎన్నికల నోటిఫికేషన్ కు ఒకరోజు ముందుగా సాయంకాలం 6 గంటలకు డైరెక్ట్ రిక్రూట్టీలకు పదోన్నతి కల్పిస్తూ జిల్లాలోని 17 మంది లెక్చరర్లకు పోస్టింగ్స్ ఇచ్చారు.  అదే రోజునపదోన్నతి పొందిన లెక్చరర్లు ప్రధానోపాధ్యాయులుగా పదవి బాధ్యతలు స్వీకరించారు. చిత్తూరు జిల్లాలో ఒక్కరు, అన్నమయ్య జిల్లాలో మరొకరు మాత్రం చార్జి తీసుకోలేదు. దీంతో ఈ వ్యవహారాన్ని లైబ్రేరియన్, వ్యాయమ  ఉపాధ్యాయులు కోర్టుకు వెళ్లారు. పదోన్నతులలో తమకు కూడా అవకాశం కల్పించాలని కోరారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పదోన్నతులను సింగిల్ జుద్జి కోర్టు జీవోను  కొట్టివేసింది. వ్యాయామ,లైబ్రేరియన్ సినియారిటిని కూడా పరిగణలోకి  తీసుకోవాలని కోరింది. దీంతో ప్రమోషన్ మీద వచ్చిన  లెక్చరర్లు  హైకోర్టు ధర్మాసనంలో మరో కేసును దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పదోన్నతులను, సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేశారు. దీంతో ధర్మాసనం కూడా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పదోన్నతులను జీ.ఓ ను నిరుదల చేసింది. స్టేటస్ కో విధించింది. అయితే అప్పటికే డ్యూటీలో జాయిన్ అయిన వారి గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వారు విధుల్లోనే కొనసాగుతున్నారు. ప్రభుత్వ జీవోను సస్పెండ్ చేస్తూ, విద్యాశాఖ ఉన్నతాధికారులు నేరుగా కోర్టుకు వచ్చి సమాధానం చెప్పాల్సిందిగా కోరింది. దీంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు తప్పనిసరిగా కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది.  ఇప్పటికే ఒక వాయిదా జరిగింది. ఆ వాయిదాలో తాము చేసిన పనిని రాష్ట్ర ప్రభుత్వం బలంగా సమర్ధించుకుంది. తాము ప్రమోషన్లు ఇవ్వడం కరెక్టు అని వాదించింది. ఈ విషయమై కోర్టు తుది తీర్పు ఇవ్వాల్సి ఉంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *