కాంగ్రెస్ లో చేరిన పూతలపట్టు వైసిపి ఎమ్మెల్యే బాబు
కాంగెస్ పార్టీ తరపున పోటీ చేసే అవకాశం
మారుతున్న పూతలపట్టు రాజకీయం
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు
వైసిపిలో ఉంటూనే రాష్ట్ర ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు శనివారం కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో నియోజకవర్గ రాజకీయం మలుపుతిరిగే అవకాశం ఉంది. కడప జిల్లా పర్యటనలో ఉన్న పి సి సి అధ్యక్షురాలు షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె బాబుకు కాంగ్రెస్ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. తొందరలోనే అయన అనుచరులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ పర్యాయం అయన పూతలపట్టు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటి చేసే అవకాశం ఉంది. పూతలపట్టు ఎమ్మెల్యేగా ఎన్నికైన తనకు మరో సరి వైసిపిలో టిక్కెట్టు ఎవ్వకపోవడం మీద ఎం ఎస్ బాబు ముఖ్యమంత్రి జగన్ మీద తీవ్ర స్థాయిలో విరచుకపడ్డారు. దళిత నియోజకవర్గాల్లో జరుగుతున్న మార్పులు, చేర్పులపై విమర్శల వర్షం కురిపించారు. తనకు టిక్కెట్టు నిరాకరించడం మీద స్పందిస్తూ.. తాను చేసిన తప్పేంటో సీఎం జగన్ చెప్పాలన్నారు. దళితులు ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాల్లోనే మార్పులు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్‌ను కలిసినప్పుడు తనపై వ్యతిరేకత ఉందని చెప్పారని, ఓడిపోయే చోట కూడా ఓసీలను అలాగే ఉంచుతున్నారన్నారు. మంత్రులు, పార్టీ పెద్దలు చెప్పినట్లు పనిచేశానని.. జగన్ చెప్పింది చేశాను.. ఇప్పుడు తన తప్పు అంటే ఎలా అని సూటిగా ప్రశ్నించారు. ఐదేళ్లలో ఎప్పుడైనా సీఎం జగన్ పిలిచి మాట్లాడారా అని ఎంఎస్ బాబు ప్రశ్నించారు . దళితులకు జగన్ ఏం న్యాయం చేశారని, దళిత ఎమ్మెల్యేలు అంటే చిన్నాచూపా అని నిలతీశారు. ఇప్పుడు తనపై వ్యతిరేకత వచ్చిందంటే ఎవరిది బాధ్యత అని ప్రశ్నించారు. ఐప్యాక్ వాళ్లకు డబ్బులు ఇస్తే సర్వే రిపోర్టు మార్చేస్తున్నారని, జగన్ చెప్పకముందే తాను గడప గడపకు తిరిగానన్నారు. ఐప్యా క్ సర్వేలో తనకు అనుకూలంగా లేదని ఈసారి పూతలపట్టు టికెట్ ఆశించవద్దని సీఎం జగన్ చెప్పడం తగదన్నారు. తిరుపతి, చిత్తూరు జిల్లా ఓసీ ఎమ్మెల్యేలపై వ్యతిరేక ఉన్న ఎందుకు మార్చలేదనీ నిలతీశారు. డబ్బులు ఇస్తే ఐప్యాక్ వాళ్ళు సర్వే ఫలితాలు ఎలాగైనా మారుస్తారన్నారనీ, గత ఎన్నికలలో ఐప్యాక్ సర్వే ఇస్తేనే తనకు టికెట్ ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. పార్టీలో టికెట్ల విషయంలో దళితులకు అన్యాయం జరుగుతోందని, ఇప్పటికీ వైఎస్సార్‌సీపీ నమ్మకం ఉందన్నారు. పార్టీ వీడే ప్రసక్తే లేదని.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై గౌరవం ఉందని.. ఆయన న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను అనీ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఎం ఎస్ బాబు కు అధికార పక్షం నుండి సరైన సమాధానం రాలేదు. పైగా అవమానాలు, అవహేళనలు ఎదురయ్యాయి. నియోజకవర్గంలో తనకంటూ ఒక వర్గం ఉంది. అలాగే నియోజకవర్గంలో బాబును వ్యతిరేకించే బలమైన వర్గం కూడా ఉంది. బాబుకు వ్యతిరేక వర్గం బహిరంగంగా పతికలకు ఎక్కారు. బాబు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆయనకు టిక్కెట్టు ఇస్తే పార్టీకి పనిచేసేది లేదని తేల్చి చెప్పారు. దీంతో అధిష్టానం ఎం ఎస్ బాబును పక్కన పెట్టి, పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు టిక్కెట్టు ఇచ్చింది. ఈ నేపధ్యంలో బాబు కాంగ్రెస్ లో చేరుతారని నెల రోజులకు ముండు నుంచే సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ బాబు శనివారం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. రానున్న ఎన్నికలలో బాబు పోటి చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.