5, ఏప్రిల్ 2024, శుక్రవారం

ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యం

నూతనజిల్లా ఎస్పీ  వి.ఎన్. మణికంఠ చందోలు


ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా నూతనజిల్లా ఎస్పీ  వి.ఎన్. మణికంఠ చందోలు స్పష్టం చేశారు. అలాగే పోలీసుల్లో వృత్తి నైపుణ్యతను పెంచి, కమ్యూనిటీ పోలీసింగ్ ను బలపరుస్తామన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నూతన ఎస్పిగా వి.ఎన్. మణికంఠ చందోలును నియమించిన విషయం తెలిసిందే. అయన శుక్రవారం చిత్తూరు జిల్లా 67 వ ఎస్పీ గా జిల్లా పోలీసు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. వి.ఎన్. మణికంఠ చందోలు  2018 వ బ్యాచ్ కు చెందిన ఐపి ఎస్ ఆఫీసర్. గతంలో గ్రేహెండ్స్   విభాగంలో అసాల్ట్ కమాండెంట్ గా, నర్సీపట్నం ఏ.ఎస్.పి గా, శ్రీకాకుళం జిల్లా ఎస్ ఇ బి అదనపు ఎస్పీగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం విశాఖపట్నం సిటీ శాంతి భద్రతల విభాగ డిప్యూటీ కమిషనర్ - I గా విధులు నిర్వహిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లాలో ఎస్పీ గా బాధ్యతలు చేపట్టారు. అయన ఎస్పీ గా భాధ్యతలు చేపట్టిన  మొదటి జిల్లా చిత్తూరు. పదవీ భాద్యతలు తీసుకున్న అనంతరం ఎస్పీ మణికంఠ చందోలు  మాట్లాడుతూ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ స్వేచ్ఛగా, ప్రశాంతంగా జరిపించేలా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు కూడా స్వేచ్చగా తమ ఓటు హక్కును వినియోగించుకునేల ప్రణాలికలు సిద్దం చేస్తామన్నారు.  జిల్లా పోలీసుల యందు వృత్తి నైపుణ్యత పెంచే విధంగా ప్రణాళికలు రూపొందిస్తామని, ప్రజల పట్ల పోలీసులపై నమ్మకాన్ని పెంచుతూ ప్రజలకు దగ్గర అయ్యేలా చేస్తామని, కమ్యూనిటీ పోలీసింగ్ ను బలపరుస్తామని వివరించారు. పక్క రాష్ట్రాల నుండి మద్యం రాకుండా చెక్ పోస్టులను పటిష్టం చేస్తామని, దొంగ దారులలో కూడా నిఘా ఉంటుందన్నారు. వేసవి అయినా, 24 గంటలు వాహనాల తనిఖి ఉంటుందన్నారు. ప్రజలు 50 వేలకు మించి నగదుతో ప్రయాణం చేయకుదదన్నారు. జిల్లాలో అల్లర్లు జరగకుండా, గట్టి పొలిసు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. ఎక్కడన్నా, సమస్య వస్తే, వెంటనే పరిష్కరించడానికి చర్యలు చేపడుతామని వివరించారు. ఆదాయపన్ను శాఖ, ఎన్ ఫోర్సుమెంట్ లతో, ఇతర ప్రభుత్వ విభాగాలతో సమన్యయం చేసుకొని ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సజావుగా జరగడానికి తనవంతు కృషి చేస్తానన్నారు. రాజకీయాలకు అతీతంగా విధులను నిర్వహిస్తామని మణికంఠ చందోలు స్పష్టం చేశారు. అనంతరం జిల్లా అధికారులందరూ ఎస్పీని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తరువాత జిల్లా కలెక్టర్ సగిలి షన్మోహన్ ను మర్యాద పూర్వకంగా కలిసి, పుష్ప గుచ్చం అందచేశారు.  

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *