8, ఏప్రిల్ 2024, సోమవారం

పూతలపట్టు మేమంతా సిద్ధం సభ విజయవంతం

జగన్ కు ప్రజల అపూర్వ స్వాగతం

దారిపొడవునా నీరాజనాలు

జగన్ ను చూడటానికి తరలివచ్చిన జనం 

గజ మాలలు, మంగళ హారతులతో స్వాగతం

మిద్దెలు, మేడలు మీద ఎక్కిన అభిమానులు

సభ విజయవంతంతో వైసీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు

ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు 

పూతలపట్టు మండలం గోపాలపురం బస్టాప్ వద్ద బుధవారం సాయంకాలం జరిగిన మేమంతా సిద్ధం సభ విజయవంతం అయ్యింది. ఈ సభకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. సభ రెండున్నర గంటల ఆలస్యంగా ప్రారంభం అయినా, ప్రజలు ఓపిగ్గా ఎదురు చూశారు. జగన్ మాట్లాడుతుండగా హర్షధ్వానాలు చేశారు. జగన్ ఆడిన ప్రశ్నలకు కేరింతలు కొడుతూ సమాధానం ఇచ్చారు. జగన్ ఉపన్యాసం చివరివరకు యువత ఎంతో ఉత్సాహంగా కనిపించారు. చంద్రబాబును విమర్శించిన ప్రతి సారీ ఈలలు వేశారు. మూడున్నర గంటలకు సభ ప్రారంభం కావాల్చి ఉండగా జగన్ రెండున్న గంట ఆలస్యంగా సభాస్థలికి చేరుకున్నారు. 10 నిమిషాల పాటు రాంప్ మీద తిరుగుతూ ప్రజలకు రెండు చేతులు ఎత్తి అభివాదం చేశారు. తిరిగి వచ్చేటప్పుడు వెనుకకు అడుగులు వేస్తూ, అభివాదం చేస్తూ వేదిక వద్దకు చేరుకున్నారు. వచ్చిన జనాన్ని చూసిన జగన్ మాట్లాడుతూ పూతలపట్టులో మన చిత్తూరు జిల్లాలో ఈ రోజు ఒక మహా జనసముద్రం కనిపిస్తుంది. ఇది ప్రజల సముద్రం. జరగబోతున్న మహాసంగ్రామంలో మంచి వైపు నిలబడి యుద్ధం చేయటానికి సిద్ధం అంటున్న ఒక మహా ప్రజా సముద్రమిది అని వర్ణించారు. తాము అమలు చేస్తున్న పధకాల గురించి చెప్పడానికి ఎక్కువ సమయం కేటాయించారు. చంద్రబాబు లక్ష్యంగా పలు ప్రశ్నలు సంధించారు. ప్రజలకు మోసం చేయటమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు, ప్రజల పక్షాన ఉన్న జగన్ కు మధ్య జరుగుతున్న యుద్ధంగా వర్ణించారు.
ఈ యుద్దంలో పచ్చమీడియా, దత్తపుత్రుడు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలంతా చంద్రబాబులు ఒక్కటై  మీ బిడ్డపై యుద్ధానికి వస్తున్నారని అన్నారు. ఇన్ని జెండాలు, పార్టీలు ఏకమవుతున్నాయి, కుతంత్రాలు, కుట్రలు జరుగుతున్నాయని ప్రజలకు వివరించారు. 
14 ఏళ్ల చంద్రబాబు పాలనలో మీకు, మీ ఇంటికి ఎం చేశాడో ఆలోచన చేయండి. మీ బ్యాంక్ ఖాతాలను గమనించండి. ఆయన పేరు చెబితే ఒక్కటైన స్కీం గుర్తవస్తుందా.. కనీసం మీ ఖాతాలో జమ చేసినట్లు ఒక్క రూపాయి కనిపిస్తుందా.. అదే మీ జగన్,.. మీ ఇంటికి, మీ గ్రామానికి ఏం చేశాడో చూసేందుకు ఏ గ్రామానికి వెళ్లిన కనిపిస్తాయని వివరించారు. 2014లో ఇదే కూటమి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోదీ ఫోటోలతో ముఖ్యమైన హామీలంటు ప్రతి ఇంటికి పంపించారు. ఇందులో చెప్పిన హామిల్లోని మొదటిది రైతుల రుణమాఫీ పై సంతకం చేస్తా అన్నాడు, చేశాడా? రెండవది పొదుపు సంఘాల రుణమాఫీ చేస్తామని చెప్పాడు, చేశాడా? ఆడుబిడ్డ పుట్టిన వెంటనే రూ. 25వేల బ్యాంకులో డిపాజిట్ చేస్తాని అన్నాడు, చేశాడా? నిరుద్యోగ భృత్తి ఇస్తానని అన్నాడు.. చేశాడా? సింగపూర్ కి మించి చేస్తా అన్నాడు.. చేశాడా? ప్రత్యేక హోదా ఇచ్చారా?  ఏ ఒక్క హామీ నేరవేర్చకపోయారు. కొత్తకొత్త మోసాలతో వీరి ముగ్గురు వస్తున్నారు?సూపర్ సీక్స్ అంటూ మరోసారి మోసం చేసేందుకు వస్తున్నారు.నమ్మవచ్చా అని ప్రశ్నించారు. 
చంద్రబాబు ఎంతగా దిగజారిపోయాడంటే, ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చే లోపు శెలవు దినమైన అవ్వతాతలో ముఖ్లం చిరునవ్వులు చూస్తు, వాళ్ల చేతిలో పింఛన పెట్టే వాలంటీర్ల పై చంద్రబాబు కుట్ర పన్నాడు. చంద్రబాబు మనిషి నిమ్మగడ్డ ఇచ్చిన ఫిర్యాదుతో వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసిన పరిస్థితులు కల్పించారు. అవ్వతాతలు పింఛన్ అందుకునేందుకు నడవలేక పడుతున్న ఆగచాట్లు చూసినప్పుడు ఈ చంద్రబాబు మనిషా. శ్యాడిస్టా? అంటూ విరుచుకుపడ్డారు.
ఇలాంటి వ్యక్తికి మనం ఒటు వేయటం ధర్మమేనా, పేదవారి భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధంలో మీరంతా సిద్ధమేనా! అని అడిగితే జగన్ కు అనుకూలంగా యువత స్పందించారు. జగనన్నే మళ్లీ వస్తే వాలంటీర్ మళ్లీ ఇంటికి వస్తాడని  స్టార్ క్యాంపెయినర్లను బయటకి తీసుకువచ్చి.. మరో వంద మందికి మంచి గురించి చెప్పి, రెండు బటన్లు ఫ్యాన్ మీద ఒటు వేసి, లక లక అనే చంద్రముఖిని పెట్టేలో బంధించి,మళ్లీ రక్తం తాగేందుకు రాకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత మీదే అంటూ యువతను ఎన్నికలకు సంసిద్దం చేశారు.


  ఈ సభకు గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు మూడు నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలు తరలివచ్చారు.  మూడు నియోజకవర్గాల వైసిపి అభ్యర్థులు సునీల్, విజయానంద రెడ్డి, కృపాలక్ష్మిలు జనసమీకరణకు  కృషి చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత జిల్లాలో జరుగుతున్న సమావేశాన్నిమ అయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సులను పంపి డ్వాక్రా మహిళలతోపాటు వైసీపీ కార్యకర్తలను తరలించారు.  జిల్లాలోని ఆర్టీసీ బస్సులను తీసుకున్నారు. అలాగే ప్రైవేటు కళాశాల, పాఠశాల బస్సులను ఇతర వాహనాలను 200 వరకు తీసుకున్నారు. మూడు నియోజకవర్గాల నుంచి భారీగా జనం తరలివచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సదుం మండలంలోని అమ్మగారిపల్లెలో ఉదయం బస్సు యాత్ర ప్రారంభమయ్యింది. సదం మండలం గోండ్లవారిపల్లి, శ్రీనివాసపురం మీదుగా పులిచెర్ల మండలం కల్లూరు, గుడ్లగట్టపల్లి   పాకాల మండలం దామలచెరువు, పత్తిపాటివారిపల్లి మీదుగా ఐరాల మండలం గుండ్లపల్లి, చౌటపల్లి మీదుగా బస్సు యాత్ర సాసింది. పూతలపట్టు మండలం పొలకల సంత గేటు, పాటూరు తలుపుల పల్లె మీదుగా తేనేపల్లి చేరుకున్నారు.  అనంతరం పూతలపట్టు మీదుగా జాతీయ రహదారి మీద ఉన్న గోపాలపురం సిద్ధం సభాస్థలికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో 
చిత్తూరు ఎంపీ అభ్యర్థి రెడ్డప్ప, పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్, చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి రోహిత్ రెడ్డి,  గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్షి, చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి విజయానంద రెడ్డి, కుప్పం ఎమ్మెల్యే అభ్యర్థి భరత్, పలమనేరు ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటే గౌడలను సభకు పరిచయం చేశారు. పలువురు అభ్యర్థులు జగన్ కు పాదాభివందనం చేశారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన భరత్ ను కుప్పంలో గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రి పెద్దిరెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి కూడా పాల్గొన్నారు.
 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *