చిత్తూరు, ఏప్రిల్ 15 (ప్రభ న్యూస్ బ్యూరో) చిత్తూరుకు చెందిన ఎంకిటిల సురేంద్ర కుమార్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రదినిధిగా నియమితులయ్యారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చంనాయుడు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. 1986 నుంచి సురేంద్ర కుమార్ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. అయన తొలుత ఉమ్మడి జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడిగా టిడిపిలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం జిల్లా పార్టీ ప్రచార కార్యదర్శిగా, జిల్లా అధికార పార్టీ ప్రతినిధిగా, జిల్లా పార్టీ కార్యాలయ సమన్వయ కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా పనిచేస్తూ రాష్ట్ర అధికార పార్టీ అధికార ప్రతినిధిగా పదోన్నతి పొందారు. అయన సత్యవేడు నియోజకవర్గ పార్టీ పరిశీలకుడిగా కూడా పనిచేస్తున్నారు. జిల్లా సహకార బ్యాంక్ డైరెక్టర్ గా పనిచేశారు. చిత్తూరు జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా మూడు పర్యాయాలు ఎన్నికయ్యారు. సురేంద్ర కుమార్ ను రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించడం పట్ల జిల్లా పార్టీ అధ్యక్షుడు సిఆర్ రాజన్, కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్ హర్షం వ్యక్తం చేశారు.