రెడ్డెప్ప పార్లమెంట్లో ఏరోజైనా నోరు తెరిచి మాట్లాడావా?
రెడ్డెప్ప పార్లమెంట్లో ఏరోజైనా నోరు తెరిచి మాట్లాడావా?
చిత్తూరు ఎంపి రెడ్దేప్పకు టిడిపి అధికార ప్రతినిధి సూటి ప్రశ్న.
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
చిత్తూరు జిల్లా సమస్యల మీద పార్లమెంట్లో ఏ రోజైనా నోరు తెరిచి మాట్లాడావా? అని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సప్తగిరి ప్రసాద్ చిత్తూరు ఎంపి రెడ్డెప్పను సూటిగా నిలతీశారు. అయన టిడిపి పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమళ్ళ ప్రసాదరావు తరపున విసృతంగా ప్రచారం చేస్తున్నారు. పూతలపట్టు నియోజకవర్గంలో ముమ్మరంగా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సప్తగిరి ప్రసాద్ మాట్లడుతూ..ఇప్పటి వరకు జిల్లా సమస్యల గురించి పార్లమెంటులో ప్రస్తావించని రెడ్డెప్ప మనకు అవసరమా అని ప్రశ్నించారు. రెడ్డప్పని ఇంటికి పంపాలని కోరారు. దగ్గుమళ్ళ ప్రసాదరావు వంటి విధ్యవేత్తను పార్లమెంటు పంపాలని విజ్ఞప్తి చేశారు. దళిత జాతికి పట్టిన చీరపురుగు రెడ్డప్ప అని అగ్రహం వ్యక్తం చేశారు. రెడ్డప్పని గ్రామాల్లో చేర్చవద్దని పిలుపునిచ్చారు. ముఖ్యంగా దళితవాడలో వెలివేయాలని అన్నారు. ఈసారి దగ్గు మళ్ల ప్రసాదరావును చిత్తూరు ఎంపీగా గెలిపిస్తే ఆ పార్లమెంటును మన పల్లెటూరి తీసుకొస్తారన్నారు. చిత్తూరు పార్లమెంటు అభివృద్ధి దగ్గుమళ్ళ ప్రసాదరావుతోనే సాధ్యమవుతుందని సప్తగిరి ప్రసాద్ ఆశాభవాన్ని వ్యక్తం చేశారు. ఎంతో ఆలోచించి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా దగ్గుమళ్ళ ప్రసాదరావును ఎంపిక చేశారని వివరించారు. దగ్గుమళ్ళను గెలిపిస్తే చిత్తూరు జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందన్నారు. చిత్తూరు పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడానికి దగ్గుమళ్ల కట్టుబడి ఉన్నారని తెలిపారు. జిల్లా కేంద్రమైన చిత్తూరు నగరంలో విద్యా ప్రమాణాలను పెంచేందుకు, యూనివర్సిటీ ఏర్పాటుకు దగ్గుమళ్ళ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. మామిడి రైతులకు మద్దతు ధర కల్పించేందుకు, మ్యాంగో బోర్డును ఏర్పాటు చేసేందుకు పార్లమెంటులో తన వాణిని వినిపిస్తారని పేర్కొన్నారు. చిత్తూరు రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేసి, చిత్తూరు రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లే అన్ని ఎక్స్ప్రెస్ రైళ్ళు చిత్తూరు రైల్వే స్టేషన్ లో ఆగే విధంగా దగ్గుమళ్ళ ప్రయత్నం చేస్తారని వివరించారు. ఏనుగుల దాడి నుండి రక్షణ కల్పించడానికి బంగారుపాళ్యం నుండి కుప్పం వరకు సోలార్ కంచె ఏర్పాటుకు దగ్గుమళ్ళ కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ఏర్పాటు చేస్తారని తెలిపారు. అంతర్జాతీయ సంస్థల ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి, జిల్లాలో యువతకు, మహిళలకు ఉపాధి కల్పించడానికి చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. చిత్తూరు పార్లమెంటులోని ప్రతి నియోజకవర్గంలో వెనుకబడిన వర్గాలకు కమ్యూనిటీ హళ్లను నిర్మించడానికి దగ్గుమళ్ళ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దగ్గుమళ్ళ ప్రసాదరావు ఆర్థికంగా పరిపుష్టి కలిగిన నేత అని, ఆయన డబ్బు సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు. ప్రజాసేవ ధ్యేయంగా ఆయన రాజకీయాల్లోకి అడుగు పెట్టారని, ఎంతో ఆచితూచి చంద్రబాబు నాయుడు చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థిగా దగ్గుమళ్ళ ప్రసాదరావును ఎంపిక చేశారన్నారు. దగ్గుమళ్ళను గెలిపించి జిల్లా అభివృద్ధికి సహకరించాల్సిందిగా చిత్తూరు పార్లమెంటు ఓటర్లకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో తవణంపల్లి మండల ప్రధాన కార్యదర్శి మధు యాదవ్, ప్రమోద్ కుమార్, సతీష్ , రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

