ఇంటర్ ఫలితాల్లో చిత్తూరు జిల్లా అట్టర్ ఫ్లాఫ్
చిట్ట చివరి స్థానానికి పడిపోయిన ఫలితాలు
బాలుర కంటే బాలికలే నయం
ఇంటర్ విద్య శాఖ ఘోర వైఫల్యం
ప్రభ న్యూస్ బ్యూరో , చిత్తూరు.
ఇంటర్ విద్యా ఫలితాలలో చిత్తూరు జిల్లా అట్టర్ ఫ్లాప్ అయింది. రాష్ట్రంలో అన్ని జిల్లాలతో పోల్చుకుంటే అట్టడుగునా నిలిచింది చిత్తూరు జిల్లాలో గతంలో పది, ఇంటర్ పరీక్షలలో గణనీయమైన ఫలితాలు సాధిస్తుండగా ఈ పర్యాయం ఇంటర్ ఫలితాలలో చిత్తూరు జిల్లా బోర్ల పడింది. చివరి స్థానంలో నిలువడతో జిల్లా పరువు గంగలో కలిచినట్లయ్యింది. శుక్రవారం చేసిన ఇంటర్ పరీక్షల ఫలితాల్లో ఎప్పటిలాగా కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలు నిలిచాయి. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 84 శాతంతో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఇక 81 శాతంతో గుంటూరు రెండో స్థానం, 79 శాతంతో ఎన్టీఆర్ జిల్లా మూడో స్థానంలో నిలిచాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా 48 శాతం ఉత్తీర్ణతతో ఆఖరి స్థానంలో ఉంది. అదేవిధంగా ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 90 శాతంతో కృష్ణా జిల్లా మొదటి స్థానం సాధించగా.. 87 శాతంతో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలు రెండో స్థానంలో నిలిచాయి. 84 శాతంతో విశాఖ జిల్లా మూడో స్థానం దక్కించుకుంది. 63 శాతంతో చిత్తూరు జిల్లా ఆఖరి స్థానంలో నిలిచింది.
చిత్తూరు జిల్లాలో 31 ప్ర్తభుత్య జూనియర్ కళాశాలలు, 125 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఉన్నాయి. జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం 13,224 మంది విద్యార్థులు పరిక్షలు రాయగా, ఇందులో 6566 మంది మాత్రం పాసయ్యారు.ఇంటర్ రెండవ సంవత్సరం 10,882 మంది విద్యార్థులు హాజరు కాగా 6,817 మంది పాసయ్యారు. ఇంటర్ ఒకేషనల్ కోర్సులలో 1839 మంది హాజరు కాగా 941 మంది పాసయ్యారు. అలాగే ఒకేషనల్ రెండవ సంవత్సరం ఫలితాలలో 1610 మంది విద్యార్థులు హాజరు కాగా, 1008 మంది పాసయ్యారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 50 శాతం, రెండవ సంవత్సరంలో 63 పాసయ్యారు. ఒకేషనల్ కోర్సులలో ఇంటర్ మొదటి సంవత్సరం 51 శాతం, రెండవ సంవత్సరం 63 శాతం ఫలితాలను చిత్తూరు జిల్లా సాధించింది. ఇంటర్ ఫలితాలలో ఒక రకంగా బాలికలు ఎక్కువ శాతం మంది పాసయ్యారు. ఇంటర్ మొదటి సంవత్సరం బాలురు 6523 మంది హాజరు కాగా 2,719 మంది అంటే 42 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 6701 మంది హాజరు కాగా 3847 మంది 57% ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ సెకండియర్ లో 5297 మంది బాలురు హాజరు కాగా 297 మంది పాసై 57 శాతం ఉత్తీర్ణత సాధించారు. 5297 బాలురు హాజరు కాకా, 2997 మంది పాసై 57 శాతం సాధించారు. బాలికలలో 5585 మంది హాజరుకాగా 3820 మంది కాసై 68 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఒకేషనల్ కోర్సులలో మొదటి సంవత్సరం 1055 మంది బాలుర హాజరు కాగా, 426 మంది ఉత్తీర్ణత సాధించి 40 శాతం నమోదు చేశారు. బాలికలు 784 మంది హాజరుకాగా 515 మంది 66 శాతం నమోదు చేశారు. ఇంటర్ సెకండ్ ఇయర్ లో బాలురు 910 మంది హాజరై 463 మంది పాసయ్యారు 51 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 700 మంది హాజరై, 545 మంది ఉత్తీర్ణులై 78 శాతం సాధించారు. జిల్లాలో బాలుర కంటే బాలికలే ఎక్కువ శాతం సత్తా చాటారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 50 శాతం, రెండవ సంవత్సరం 63, ఒకేషనల్ కోర్సులలో మొదటి సంవత్సరం 51 శాతం, రెండవ సంవత్సరం 63 శాతం ఉత్తీర్ణత సాధించారు.
గతంలో తిరుపతి, చిత్తూరు కలిసి ఉండేది. తిరుపతిలో ప్రైవేటు కళాశాలలు ఉండటంతో జిల్లా ఉత్తీర్ణత శాతం ఎక్కువ ఉండేది. ఈ సారి తిరుపతి విడిపోవడంతో చిత్తూరు జిల్లా ఫలితాలు పడిపోయింది. పరీక్షల నిర్వహణలో చూపిన శ్రద్ద సమీక్షలలో చూపలేదని విమర్శలు ఉన్నాయి. అర్థ సంవత్సర పరీక్షలు, ప్రీ ఫైనల్, యూనిట్ టెస్టులు సక్రమంగా జరగలేదని తెలుస్తుంది. వాటి మీద సమీక్షలు చేసి, జిల్లా అధికారులు సరిగ్గా సూచనలు ఇచ్చి ఉంటే, ఫలితాలు మెరుగయ్యే అవకాశం ఉండేది. ఈ సంవత్సరం ఎక్కువ పని దినాలలో కాంట్రాక్టు అధ్యాపకుల రేగులరైజేషన్ సంభందించి అందోళనలు, దరఖాస్తులు, ధ్రువ పత్రాల సమర్పణ, పరిశీలన పనులలో ఎక్కువ దృష్టిని కేంద్రీకరించారు. దీంతో బోధన మీద శ్రద్ద తగ్గింది. రెగ్యులర్ ప్రిన్సిపల్స్, అధ్యాపకులు లేకపోవడం కూడా ఒక లోపంగా చెప్పవచ్చు. మొత్తం మీద పర్యవేక్షణ లోపం కారణంగా ఫలితాలు తగ్గినట్లు తెలుస్తుంది.