4, ఏప్రిల్ 2024, గురువారం

చిత్తూరు జిల్లా నూతన ఎస్పిగా విజయ్ నాగ మణికంఠ చండోలు



జాతీయ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా ఎస్పీగా విజయ్ నాగ మణికంఠ చండోలు నియమితులయ్యారు. అయన  శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. చిత్తూరు జిల్లా ఎస్పిగా ఉండిన జాషువాను ఎన్నికల సంఘం మంగళవారం అకస్మాత్తుగా బదిలీ చేసిన విషయం పాటకులకు విదితమే. ఆయనను ఎన్నికలకు సంబంధంలేని విభాగానికి బదిలీ చేయల్చిందిగా ఆదేశించింది. ఉన్నఫలంగా బాధ్యతలను తదుపరి అధికారికి అప్పగించి రిలీవ్ కావాల్సిందిగా ఆదేశాలలో పేర్కొంది. జిల్లా ఎస్పీగా పనిచేయడానికి ప్యానెల్ ను రూపొందించి పంపాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ కోరింది. ఆదేశాహాలు వెలువడిన వెంటనే జాషువా అదనపు ఎస్పి అరిఫుల్లాకు భాధ్యతలు అప్పగించి రిలీవ్ అయ్యారు. అనంతరం చిత్తూరు జిల్లా ఎస్పీగా వి.హర్షవర్ధన్ రాజు, వి.ఎన్.మణికంఠ చండోలు, కె.ఎస్.ఎస్.వి.సుబ్బారెడ్డితో కూడా ఫ్యానల్ ఎన్నికల కమిషన్ కు పంపింది. ముగ్గరిలో వి.ఎన్.మణికంఠ చండోలును ఎన్నికల కమిషన్ ఎంపిక చేసింది. మణికంఠ చండోలు ప్రస్తుతం విజయవాడ సిటీ శాంతి భద్రతల విభాగ డిప్యూటీ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రకాశం జిల్లా మర్తురుకు చెందిన ఈ అధికారి 2018 బ్యాచ్ చెందిన ఐపీఎస్ అధికారి. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో బి. టెక్ చేస్తూ, పోటి పరీక్షలకు సిద్దం అయ్యారు. గతంలో గ్రేహాండ్ లో  విభాగంలో అసాల్ట్ కమాండెంట్ గా, శ్రీకాకుళం జిల్లా స్పెషల్ ఎన్ ఫోర్సుమెంట్ బ్యూరో  అదనపు ఎస్పీగా విధులు నిర్వహించారు. విజయ్ నాగ మణికంఠ  ఇండియా పోస్ట్‌లో సార్టింగ్ అసిస్టెంట్‌గా 16 నెలలు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌గా 3.5 సంవత్సరాలు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ ట్రైనీగా 9 నెలలు పనిచేశారు.  ఆగస్టు 2018లో ఐ పి ఎస్ అధికారిగా చేరారు. మణికంఠ చండోలు సతీమణి హర్షిత వైజాగ్ ఈస్ట్ జోన్ ఏ సి పి గా పనిచేస్తున్నారు. ఇద్దరు పోలీసు అధికారులే. మొదటిసారిగా జిల్లా ఎస్పీగా ఎన్నికల కమిషన్ నేరుగా ఆయనను నియమించింది. మొదటి ఎస్పీ పోస్టింగ్ కావడంతో ఈ యంగ్ ఆఫీసర్ తనదైన శైలిలో మార్కును వేయమన్నారు. 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *