22, ఏప్రిల్ 2024, సోమవారం

వైసిపిలో చేరనున్నమాజీ మంత్రి అమరనాధ రెడ్డి మరదలు అనీషా రెడ్డి, తమ్ముడు శ్రీనాధ రెడ్డి

40 సంవత్సరాల తెదేపా అనుబంధం కట్   

26న పులివెందులలో జగన్ సమక్షంలో చేరే అవకాశం 

టిడిపిలో అవమానాలు భరించలేక ఈ నిర్ణయం

రాజకీయ భవిషత్తుకు మంత్రి  పెద్దిరెడ్డి ఎంపి మిధున్ రెడ్డి హామీ  

ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.

జిల్లాలో, పుంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగలనుంది. టిడిపి రాష్ట్ర కార్యదర్శి, మాజీ మంత్రి అమరనాధ రెడ్డి మరదలు అనీషా, సోదరుడు శ్రీనాధ రెడ్డిలు  పార్టీ మారనున్నారు. తెలుగు దేశం పార్టీలో చంద్రబాబుకు సమకాళీకుడు అయిన మాజీ ఎంపి, మాజీ ఎం ఎల్ ఏ నూతనకాల్వ రామకృష్ణా రెడ్డి కుమారుడు, కోడలు టిడిపిని వదలి వైసిపిలో చేరనున్నారు. తెలుగుదేశం పార్టీతో 40 సంవత్సరాలుగా ఉన్న అనుబంధాన్ని తెచ్చుకోవడానికి నూతన కాలువ కుటుంబ సభ్యులైన అనీషా రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి సిద్ధమయ్యారు. వారు ఈ వారంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి లాంచనంగా పార్టీలో చేరనున్నట్లు సమాచారం.  అనిషారెడ్డి గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున  పుంగనూరు నియోజకవర్గ నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేశారు. నూతన కాలువ శ్రీనాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. దంపతులు ఇరువురు తెలుగుదేశం పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆదివారం మదనపల్లెలోని అనీషా, శ్రీనాథ్ రెడ్డిల నివాసానికి జిల్లా మంత్రి పెద్దిరెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డిలు చేరుకొని గంటకు పైగా చర్చలు తెలిపారు. తెలుగుదేశం పార్టీలో వీడి వైసీపీలో చేరాల్సిందిగా లాంచనంగా ఆహ్వానించారు. ఈ విషయమై జగన్ రెడ్డి పలుమార్లు తనతో సంప్రదించాలని, తాను కూడా గత రెండు సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నా, స్పందించడం లేదని పెద్దిరెడ్డి అన్నారు. తప్పకుండా మళ్లీ రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం వస్తుందని, తగిన విధంగా గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చారు. దీంతో దంపతులు అనీషా రెడ్డి, శ్రీనాథ్ రెడ్డిలు తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. సోమవారం పుంగనూరులో జరిగిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి కూడా వీరు హాజరు కాలేదు.


అనిషా రెడ్డి నూతనకాల్వ రామకృష్ణా రెడ్డికి కోడలు కాగా, శ్రీనాధ రెడ్డి కుమారుడు. అలాగే మాజీ మంత్రి, తెదేపా రాష్ట్ర కార్యదర్శి అమరనాధ రెడ్డికి అనిషా రెడ్డి మరదలు కాగా, శ్రీనాధ రెడ్డి సోదరుడు.  నూతనకాల్వ అనిషా రెడ్డి 2019 ఎన్నికలలో తెదేపా అభ్యర్థిగా పోటి చేసి, 43 వేల ఓట్ల తేడాతో పెద్దిరెడ్డి చేతిలో ఓడిపోయారు. మొదటి నుండి పుంగనూరు నియోజకవర్గం నూతనకాల్వ కుటుంబానికి కంచుకోటగా ఉండేది. అయితే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత పుంగనూరు నియోజకవర్గం వైసిపి చేతిలోకి వెళ్ళింది. పుంగనూరు నియోజకవర్గం నుంచి అనిషారెడ్డి మామ నూతనకాల్వ రామకృష్ణారెడ్డి 1985 ఎన్నికల నుండి వరసగా మూడు పర్యాయాలు తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన 1996లో  పార్లమెంట్ సభ్యులుగా ఎంపిక కావడంతో పుంగనూరుకు ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఉప ఎన్నికల్లో అమర్నాథరెడ్డి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా మొదటిసారి గెలుపొందారు. 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీధర్ రెడ్డి చేతిలో అమర్నాథరెడ్డి ఓడిపోయినా, 2004 ఎన్నికల్లో తిరిగి పుంగనూరు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో పలమనేరు నియోజకవర్గం నుంచి వైసిపి ఎమ్మెల్యేగా ఎన్నికైన అమన్నాథరెడ్డి, తెలుగుదేశం పార్టీలో చేరి, ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. రామకృష్ణారెడ్డి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా, మరో  మూడు పర్యాయాలు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికై రికార్డు సృష్టించారు. అయన కుమారుడు అమరనాధ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా  మూడు సార్లు ఎన్నికయ్యారు. రాజకీయ నేపథ్యం ఉన్న అనీషారెడ్డి కూడా మళ్ళి పార్టీ తనకు అవకాశం ఇస్తే, పోటి చేయడానికి సిద్దం అయ్యారు. 2019 ఎన్నికల తరువాత అనీషా రెడ్డి గత కొంతకాలంగా జిల్లాలో క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు.  నిజం గెలవాలి యాత్ర ద్వారా మళ్లీ  క్రియాశీలకం అయ్యారు. ఆమెనారా భువనేశ్వరితో కలిసి  కుప్పం, పుంగనూరు నియోజకవర్గంలో జరిగిన నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొన్నారు. గత ఎన్నికల్లో నూతనకాల్వ అనీషారెడ్డి పుంగనూరు నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతులో ఓడిపోయారు. దీంతో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ఇన్చార్జిగా ఆమెను తప్పించి, పులిచర్లకు చెందిన చల్లా బాబుకు బాధ్యతలు అప్పగించారు. అప్పుడు కూడా అనిషా రెడ్డి తనను ఎందుకు నియోజకవర్గ భాద్యతల నుండి తప్పిస్తున్నారని చంద్రబాబును అడిగారు. తన వాళ్ళ ఏమైనా, తప్పు, పొరబాటు జరిగిందా అని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు ఎలాంటిది ఏది లేదంటూ, మళ్ళి తప్పక అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారు. ఆనాటి నుంచి చల్లా బాబు నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తుండడంతో అనీషా రెడ్డి క్రియాశీలక రాజకీయాలకు ముఖం చాటేశారు. ఆమెకు పార్టీలో ఎలాంటి పదవి లేకపోవడంతో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు, సభలు, సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. అంతకు ముందు జైలు నుండి చంద్రబాబు విడుదలై, తిరుమలకు వచ్చినపుడు, అనీషా రెడ్డి భర్త, మాజీ మంత్రి అమరనాధ రెడ్డి సోదరుడు శ్రీనాధ రెడ్డి కలిశారు. చంద్రబాబు చాలా ఆప్యాయంగా, ఆలింగనం చేసుకొని ముచ్చటించారు. ఒక సారి పార్టీ కార్యాలయంలో కలువల్చిందిగా సూచించారు. మల్లీ చంద్రబాబు సంక్రాంతి సందర్భంగా నారావారి పల్లికి వచ్చినపుడు శ్రీనాధ రెడ్డి, అనీషా రెడ్డి ఇద్దరు వెళ్లి కలిశారు. అరగంట పాటు చంద్రబాబు వాళ్ళతో మాట్లాడారు. తిరిగి క్రియాశీలకం కావాలని చెప్పారు. భువనేశ్వరి కుప్పం పర్యటన సందర్భంగా 15 నిమిషాల పాటు బస్సులో ఏకాంతంగా అనీషా రెడ్డితో చర్చించారు. ఆ విషయాలు బయటికి పొక్కకున్నా, రాజకీయంగా మళ్లీ క్రియాశీలకం కావాలని అనీషా రెడ్డిని కోలినట్లు తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారాన్ని చేపడుతుందని, ఇందుకు తన వంతు సహాయ సహకారాలను కోరినట్టు తెలుస్తోంది. రాజకీయాలలో మహిళలకు మంచి భవిష్యత్తు ఉంటుందని, మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు జరిగితే మహిళలదే రాజ్యాధికారమని పేర్కొన్నట్లు సమాచారం. అనిషా రెడ్డి, శ్రీనాధ రెడ్డిలు పార్టీ అధినేత చంద్రబాబును కలిసినా, సరైన స్పందన లేదు. గత ఎన్నికల్లో సుమారు రూ. 25 కోట్లు వ్యయం చేసినా అకారణంగా పక్కన పెట్టారు. చల్లా రామచంద్రా రెడ్డిని అబ్యర్థిగా ప్రకటించే సమయంలో, బి ఫారం ఇచ్చేటప్పుడు కనీసం సంపదించడం కూడా చేయలేదు. చల్లా రామచంద్రా రెడ్డి నియోజకవర్గ భాధ్యతలు చేపట్టిన నాటి నుండి అనీషా రెడ్డి, శ్రీనాధ రెడ్డిలను కలిసి సహకరించాలని కోరలేదు. నామినేషన్ కూడా ఆహ్వానించలేదు. దీంతో అసంతృప్తిగా ఉన్న అనీషా రెడ్డిని పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, మిధున్ రెడ్డిలు కలువడంతో వైసిపిలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు, 26వ తేదిన పులివెందులలో జగన్ నామినేషన్ సందర్భంగా పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి.



అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *