2, ఏప్రిల్ 2024, మంగళవారం

సిద్దం సభకు సర్వం సిద్దం

భారీగా సభ ఏర్పాట్లు 
ఏర్పాట్లు పరిశీలించిన ముఖ్య నాయకులు
200 బస్సుల ఏర్పాట్లు
సదం, పులిచర్ల, పాకాల, ఐరాల, పూతలపట్టు మండలాల్లో బస్సు యాత్ర 

ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు 

పూతలపట్టు మండలం గోపాలపురం బస్టాప్ వద్ద బుధవారం సాయంకాలం జరగనున్నసిద్దం సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైయస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొని ఎన్నికల ప్రచారం చేయనున్నారు. గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు మూడు నియోజకవర్గాలకు సంబంధించిన వేదిక యుద్ధం సభ ఈ సభను విజయవంతం చేయడానికి మూడు నియోజకవర్గాల వైసిపి అభ్యర్థులు సునీల్, విజయానంద రెడ్డి, కృపాలక్ష్మిలు కృషి చేస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత జిల్లాలో జరుగుతున్న సమావేశాన్నిమ అయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఇంఎందుకు భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సులను పంపి డ్వాక్రా మహిళలతోపాటు వైసీపీ కార్యకర్తలను తరలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే జిల్లాలోని ఆర్టీసీ బస్సులను తీసుకున్నారు. అలాగే ప్రైవేటు కళాశాల, పాఠశాల బస్సులను ఇతర వాహనాలను కూడా తీసుకొని సిద్ధం సభను విజయవంతం చేసి, తమ సత్తా చార్టానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మూడు నియోజకవర్గాల నుంచి జన సమీకరణ ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. మంగళవారం ఈ సభ వేదికను పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే సునీల్, చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి విజయానంద రెడ్డి, ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప రెడ్డి, పూతలపట్టు నియిజక వర్గ నేత తలపలపల్లి బాబు రెడ్డి, రాష్ట్ర పాల ఏకరి కార్పొరేషన్ చైర్మన్ కుమార్ రాజా, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పాలేరు రామచంద్రారెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు మోహన్ రెడ్డి, వైస్ ఎంపీపీ శిరీష్ రెడ్డి, సింగల్ విండో చైర్మన్ దత్తాత్రేయ రెడ్డి, రాష్ట్ర నాయకులు ప్రవీణ్ రెడ్డి, రాష్ట్ర నాయకులు ప్రవీణ్ రెడ్డి, జిల్లా సేవాదల్ అధ్యక్షులు కిషోర్ కుమార్ రెడ్డి. వైసిపి చిత్తూరు ఐరాల మండల పార్టీ అధ్యక్షుడు బుజ్జిరెడ్డి తదితరులు పాల్గొని ఏర్పాట్లను పరిశీలించారు. సిద్ధం సభను విజయవంతం చేయడానికి 200 బస్సులను చేశారు. ఉదయమే వైసిపి శ్రేణులను తీసుకురానున్నాయి. వీరికి భోజన ఏర్పాట్లు, తగు నీటి ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సదుం మండలంలోని అమ్మగారిపల్లెలో ఉదయం బస్సు యాత్రను ప్రారంభిస్తారు. ఆయన సదం మండలం గోండ్లవారిపల్లి, శ్రీనివాసపురం మీదుగా పులిచెర్ల మండలం కల్లూరు, గుడ్లగట్టపల్లి చేరుకుంటారు. అక్కడి నుండి పాకాల మండలం దామలచెరువు, పత్తిపాటివారిపల్లి మీదుగా ఐరాల మండలం గుండ్లపల్లి, చౌటపల్లి మీదుగా బస్సు యాత్ర సాగుతోంది. అనంతరం పూసలపట్టు మండలంలోకి ప్రవేశించి పొలకల సంత గేటు, పాటూరు తలుపుల పల్లె మీదుగా తేనేపల్లి చేరుకుని మధ్యాహ్నం భోజనం చేస్తారు. భోజన విరామం అనంతరం పూతలపట్టు మీదుగా జాతీయ రహదారి మీద ఉన్న గోపాలపురం బస్ స్టాప్ దగ్గరికి చేరుకొని సిద్ధం సభలో ప్రసంగిస్తారు. అనంతరం రంగంపేట క్రాస్, గొల్లపల్లి, పి కొత్తకోట, కోనపరెడ్డిపల్లి మీదుగా గాదంకి, పనభాకం, కొత్త ఇండ్లు, కొంగరవారి పల్లి, మామండూరు, ఐతే పల్లి, తిరుపతి బైపాస్ రోడ్డు మీదుగా రేణిగుంట చేరుకుంటారు. రేణిగుంటలో ముఖ్యమంత్రి రాత్రికి బస్సు చేస్తారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *