17, ఏప్రిల్ 2024, బుధవారం

తెదేపా అభ్యర్థి గురుజాల విజయానికి ప్రచారం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే సికే బాబు

ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు. 

చిత్తూరు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాలుగు పర్యాయాలు శాసనసభ్యుడిగా గెలుపొందిన సికే జయచంద్రా రెడ్ది (సికే బాబు) ఈ పర్యాయం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురుజాల జగన్ మోహన్ నాయుడు గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. టిడిపి నాయకులతో కలిసి ప్రతి రోజు ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. తెదేపా ప్రచార కార్యక్రమంలో సికే బాబు ప్రత్యేక ఆకర్షణగా నిలచారు. అభ్యర్థి గురుజాల, ఇతర నాయకులతో కలిసి సికే బాబు చిత్తూరు మునిసిపాలిటి, గుడిపాల మండలంలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. తెదేపా అభ్యర్థి జగన్మోహన్ నాయుడును గెలిపించాలని కోరుతున్నారు. సికే బాబు తెదేపా అభ్యర్థి గురుజాల జగన్మోహన్ కు మద్దతు ప్రకటించి, ప్రచార కార్యక్రమాలలో పాల్గొనడంతో పార్టీకి ఊపు వచ్చింది. పార్టీ విజయావకాశాలు మెరుగయ్యాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.


చిత్తూరు రాజకీయాలలో సీకే బాబు ఒక సూపర్ స్టార్. ఒక తిరుగులేని నేత. చిత్తూరు కింగ్ గా చలామణి అయ్యారు. అభిమానులందరూ చిత్తూరు టైగర్ గా పిలుచుకుంటారు. ఒకనాడు సికే బాబు అంటే చిత్తూరు, చిత్తూరు అంటే సీకే బాబు. చిత్తూరు జిల్లా రాజకీయ రంగంలో చక్రము తిప్పిన ధీరుడు  సికే బాబు. చిత్తూరు మాత్రమే  కాకుండా వేపంజేరి, చంద్రగిరి, పలమనేరు నియోజకవర్గం ఆయనకు ప్రాభల్యం ఉంది. ఆయనకు అనుచరుగణం ఉంది. ఆయన రాజకీయాలకు కొంత విరామం ఇచ్చినా, ఇప్పటికీ ఆయనకు పలు నియోజకవర్గాలలో అభిమానులు, అనుచరులు, కార్యకర్తలు ఉన్నారు. సీకే బాబు వస్తున్నారంటే ఆయనను చూడడానికి ఒక సినిమా స్టార్ లాగా జనం ఎగబడతారు. ఆయనతో  కరచాలనం చేయడానికి, ఫోటోలు దిగడానికి పోటీలు పడతారు. ఆయన దృష్టిలో పడడానికి శ్రమిస్తారు. పీకే బాబు చిత్తూరు రాజకీయాల్లో ఒక క్రేజీ నాయకుడు. చిత్తూరు కౌన్సిలర్ గా సీకే బాబు తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. మున్సిపల్ ఉపాధ్యక్షుడుగా ఉంటూ తనకంటూ ఒక వర్గాన్ని  ఏర్పాటు చేసుకున్నారు. నియోజకవర్గంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు. చిత్తూరులో ఈ రికార్డు ఏ నాయకుడికి లేదు. 1989 ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. కాంగ్రెస్ తరపున గోపీనాథ్, టిడిపి తరఫున హరిప్రసాద్ లను ఓడించి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలుపొందారు, 1994, 1999 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టిడిపి అభ్యర్థి ఏఎస్ మనోహర్ మీద విజయం సాధించారు. 2004 ఎన్నికలలో ఏఎస్ మనోహర్ చేత ఓటమిపాలయ్యారు. తిరిగి 2009 ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి జంగాలపల్లి శ్రీనివాసులు, టిడిపి అభ్యర్థి బాలాజీ నాయుడు మీద విజయం సాధించారు. 2014 తారీఖున వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో జగన్ ఆహ్వానం మేరకు ఆయన చేరారు. పార్టీలో చేరినా, ఆ సంవత్సరం జరిగిన ఎన్నికలలో  సికే బాబుకు రాలేదు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జంగాలపల్లి  శ్రీనివాసులు విజయానికి  సికే బాబు కృషి చేశారు. వైయస్సార్ పార్టీలో కొంతకాలం కొనసాగారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రస్తుత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, సీకే బాబుకు రాజకీయ వైరం ఉంది. చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర ఇరు వర్గాలు కర్రలతో దాడులకు దిగారు. పాత కక్ష్యల కారణంగా   సీకే బాబుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వైసిపి అధిష్టానం చేత  ప్రకటన ఇప్పించారు. అనంతరం 2017 నవంబర్ మూడవ తేదీన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్యర్యంలో  బెంగళూరులో బిజెపిలో చేరారు. బిజేపి నేత పురందేశ్వరి సహకరించారు. కొద్ది నెలలు పార్టీలో ఉన్నారు. బిజేపి ముస్లిం వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆ పార్టీ నుండి వెలుపలికి వస్తున్నట్లు ప్రకటించారు. కొత్త విరామం తరువాత  2019 మార్చి 22వ తారీఖున టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో  తెలుగుదేశం పార్టీలో చేరారు. ప్రస్తుతం దేశం పార్టీలో కొనసాగుతున్న పార్టీ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరిన సీకే బాబు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ పోస్టు ఆశించారు. అలాగే  టికెట్ ఖరారు చేస్తూ నియోజకవర్గ ఇన్చార్జి పదవి ఇవ్వాలని కోరారు. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే కే బాబు మృత్యుంజయుడు. సుమారు 7 పర్యాయాలకు పైగా ఆయన మీద హత్యాయత్నాలు జరిగాయి. వాటన్నిటి నుంచి సీకే బాబు విజయవంతంగా బయటపడ్డారు. టిడిపి నేత కటారి మోహన్ తో రాజకీయ వైరం కారణంగా 2007 సంవత్సరంలో ఎం ఎస్ ఆర్ కూడలి సమీపంలోని  క్లబ్ లో తుపాకులతో బీహార్ గ్యాంగ్ ఆయన మీద దాడి చేశారు. ఈ కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. అనంతరం కట్టమంచిలోని సాయిబాబా గుడి ఎదురుగా బాంబును పేల్చి సీకే బాబును హత్య చేయాలని ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో గన్ మెన్ చనిపోయారు. ఇలా ఏడుసార్లు పైగా పీకే బాబు మృత్యుంజయడయ్యారు. సీకే బాబు 1989 నుంచి వరుసగా మూడుసార్లు శాసనసభ్యుడిగా హ్యాట్రిక్ సాధించారు. చిత్తూరు జిల్లాలో 1994 ఎన్నికల్లో 14 స్థానాల్లోనూ టిడిపి అభ్యర్థులు గెలువగా, చిత్తూరులో మాత్రం సీకే బాబు గెలుపొందారు. అయన ఆర్ టి సి ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు. సీకే బాబుకు బలమైన అనుచర గణం, బలమైన ఓటు బ్యాంకు ఉంది. ఆయన కనుసన్నలలో పని చేసే నాయకులూ, కార్యకర్తలు ఉన్నారు. సికే బాబు ప్రచారం తేదేపాకు ప్లస్ అవుతుందని, గెలుపు అవకాశాలు మెరుగవుతాయని పలువురు భావిస్తున్నారు. 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *