26, ఏప్రిల్ 2024, శుక్రవారం

ఆకట్టుకుంటున్న టిడిపి ఎంపి అభ్యర్థి దగ్గుమళ్ళ ఎన్నికల ప్రణాళిక



ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.

చిత్తూరు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి దగ్గిమల్ల ప్రసాదరావు ఎన్నికల ప్రణాళిక జిల్లా ప్రజలను విశేషంగా ఆకర్షిస్తోంది. ప్రణాళికలో అన్ని వర్గాలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. అయన  చిత్తూరు జిల్లాలో  విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆయన నియోజకవర్గంలోని అందరు అభ్యర్థులతో కలిసి ప్రచార కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తున్నారు. రాజకీయాల్లోకి ఎందుకు వచ్చింది, గెలిపిస్తే జిల్లాలో చేయనున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తున్నారు. ఇన్కమ్ టాక్స్ అధికారిగా హైదరాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, ఔరంగాబాద్, ఉస్మానాబాద్, నాందేడ్, బెంగళూరు, గుల్బర్గా వంటి ప్రాంతాల్లో పని చేశారు.  దగ్గుమల్ల ప్రసాదరావుకు ఉన్న ఆసక్తిని గమనించి నారా చంద్రబాబు నాయుడు ఆయనతోనే జిల్లాలో అభివృద్ధి సాధ్యపడుతుందని, ప్రత్యేకంగా చిత్తూరు ఎంపీ స్థానానికి పోటీ చేపిస్తున్నారు. తనను ఎంపీగా గెలిస్తే చిత్తూరు ప్రజల సమస్యలను పార్లమెంటులో ప్రస్తావిస్తానని, చిత్తూరు సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నారు. కేంద్రమైన చిత్తూరులో విద్య ప్రమాణాలను పెంచేందుకు యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని, మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి ఏర్పాటుకు కృషి చేస్తామని అంటున్నారు. చిత్తూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి చేసి చిత్తూరు మీదుగా వెళ్లే అన్ని ఎక్స్ప్రెస్ రైళ్ళు చిత్తూరు ఆగే విధంగా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డ్రామా కేర్ యూనిట్న ఏర్పాటు చేసి, వైద్య సౌకర్యాలు మెరుగుపరుస్తామని, వైద్యం కోసం ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు  వెళ్లే అవకాశం లేకుండా చేస్తున్నారు. నగిరిలో చేనేత కార్మికుల కోసం చేనేత టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటు చేసి, భూగర్భజలాలు కలుషితం కాకుండా  చర్యలు తీసుకుంటామని ఇస్తున్న హామీ ఆకట్టుకుంటుంది. అలాగే చిత్తూరు జిల్లాలో విస్తృతంగా ఏనుగుల దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడులను నివారించడానికి కుప్పం నుండి సోలార్ కంచె ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంటున్నారు. సిల్క్ ఫామ్ ఆధునికరణకు చర్యలు చేపడతామని, ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో వేద పాఠశాలతో పాటు అత్యధిక ఆధునిక సదుపాయలతో ఆసుపత్రిని నిర్మిస్తామని హామీ ఇస్తున్నారు. దగ్గుమల్ల ప్రసాదరావు ఇస్తున్న హామీలు ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. విద్యావేత్త ప్రసాదరావు గెలిస్తే తమ సమస్యలు తీరుతుందని ప్రజలు కూడా భావిస్తున్నారు. గతంలో ఎంపీలుగా పని చేసిన వారెవరు చిత్తూరు సమస్యలను పార్లమెంటులో  ప్రస్తావించకపోవడంతో, జిల్లా ప్రజలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. విద్యావేత్త కావడంతో తమ సమస్యలను తీరుతాయని జిల్లా ప్రజలు ఆశాభావంతో ఉన్నారు. దగ్గుమల్ల ప్రసాదరావు విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోకు జిల్లా ప్రజలు ఆకర్షితులయ్యారు.  ఈ మేనిఫెస్టో గురించి పలువురు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. దగ్గుమళ్ల వెంకటేశ్వరరావుతోనే చిత్తూరు జిల్లా అభివృద్ధి సాధ్యమని భావిస్తున్నారు. ఆర్థికంగా స్థిరపడిన దగ్గు మల్ల ప్రసాదరావు ప్రజాసేవే ధ్యేయంగా రాజకీయాలలోకి అడుగుతున్నారు. ఆయన సేవ భావాన్ని ప్రజలు క్రమంగా అర్థం చేసుకుంటున్నారు. చంద్రబాబు దూర దృష్టతో దగ్గుమళ్లను ఎం పి అభ్యర్థిగా ఎంపిక చేశారని క్రమంగా ప్రజలకు అర్థమవుతుంది. దీంతో చిత్తూరు నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం పార్టీ గెలిపించడానికి సమాయత్తమవుతున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *