9, ఏప్రిల్ 2024, మంగళవారం

జిల్లాలో మండిపోతున్న ఎండలు- బెంబేలేత్తిపోతున్న ప్రజలు





చిత్తూరు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. బానుడి ఉగ్రరూపానికి సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఉన్నఫలంగా ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు తట్టుకోలేక, అస్వస్థతకు గురవుతున్నారు. జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఏప్రిల్ మొదటి వారంలోని ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండ వేడిమికి తట్టుకోలేక చిన్నపిల్లలు, వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, గర్భిణులు అల్లాడిపోతున్నారు. సామాన్య ప్రజలు కూడా ఎండ వేడిమిని భరించలేక ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో ఉదయం 9 గంటల దాటితే బయటికి రావడానికి ప్రజలు భయపడుతున్నారు. సాయంకాలం అయిదు అవుతున్న భానుడి ప్రతాపం తగ్గకపోవడంతో చిత్తూరు పట్టణ ప్రధాన విధులన్నీ వెలవెలబోతున్నాయి. వ్యాపారాలు లేక వ్యాపారస్తులు కూడా ఆందోళన చెందుతున్నారు.

ఆదివారం తవణంపల్లి మండలం పైపల్లెలో 44.5 సెంటిగ్రేడ్ల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. ఇంత ఎండ వేడిమి తవణంపల్లి మండలంలో నమోదు కావడం ఇదే ప్రధమం. నిండ్ర మండలంలో 43.8, గుడిపాల మండలం రామాపురంలో 42, గంగాధర నెల్లూరు మండలంలో  41, ఎస్ఆర్ పురం మండలం కొత్తపల్లిలో 43.4, గంగాధర నెల్లూరు మండలం వేపంజేరిలో 40.5, చిత్తూరు మండలం ఎన్ ఆర్ పేటలో 40.8, కార్వేటి నగరం మండలం కత్తెరపల్లెలో 41.2, కుప్పం మండలం మల్లనూరులో 40.2, బంగారుపాలెం మండలం రాగిమానుపెంటలో 41.3, శాంతిపురం మండలంలో 40.5, పెద్ద పంజాణి మండలం రాయలపేటలో 41.3, గంగవరం మండలంలో 40.5, తవనంపల్లి మండలం  కట్టకిందపల్లెలో 41.4 సెంటీగ్రేడ్ల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

సోమవారం తవనంపల్లి మండలం పై పల్లెలో 41.41,నిండ్ర మండలంలో 41.19, చిత్తూరు మండలం రెడ్డిగుంటలో 41.03, పుంగనూరులో 40.36, విజయపురం మండలంలో 40.22, గంగాధర నెల్లూరులో 39.29, సదం మండలం నడిగడ్డలో 39.2, తవణంపల్లి మండలం కట్టకిందపల్లిలో 39.16, పాలసముద్రం మండలంలో 39.02, గంగాధర నెల్లూరు మండలం వేపంజేరిలో 38.84 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత నమోదయింది.

ఆది, సోమవారాలతో పోలిస్తే మంగళవారం జిల్లాలో ఉష్ణోగ్రతలు చాలావరకు తగ్గాయి. సదం మండలం నడిగడ్డలో 36.5, సోమలలో 35.31, తవనంపల్లి మండలం పైపల్లెలో 35.31, పాలసముద్రం మండలం 35.2, చిత్తూరు మండలం ఎం ఆర్ పేటలో 35.03, గంగాధర నెల్లూరు మండలం 35.01 గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

జిల్లాలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరగడంతో జిల్లా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఉదయము 9 గంటల నుండే తర్వాత భానుడు విశ్వరూపం చూపిస్తున్నారు. మండే ఎండలకు పిల్లలు, పెద్దలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. ప్రజలు శీతల పానీయాలు పట్ల ఆసక్తిని చూపుతున్నారు. జిల్లాలో శీతల పానీయాల వ్యాపారం జోరుగా సాగుతోంది. తాజా పండ్ల రసం వ్యాపారం కూడా ఊపందుకుంది. ఎండ వేడిమిని తట్టుకోలేక ప్రజలు నిమ్మకాయ రసం, మజ్జిగను తరచుగా తాగుతున్నారు. ఎండ వేడిమి కారణంగా ప్రధాన పట్టణాల్లో ప్రధాన వీధులన్నీ వెలవెల పోతున్నాయి. వ్యాపార సముదాయాలు సైతం ప్రజలు లేకుండా బోదిపోతున్నాయి. బజారులలో మధ్యాహ్నం జన సంచారం పూర్తిగా తగ్గిపోయింది. జిల్లాలో అన్ని వ్యాపారాలు తగ్గు ముఖం పట్టాయి. ఈ ఎండలకు ప్రజలు ప్రయాణం చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆర్టీసీకి ఆదాయం కూడా గణనీయంగా ఇంకా తగ్గే పరిస్థితి కనిపిస్తుంది. ఎండ వేడిమి కారణంగా వ్యవసాయ కూలీలు చాలా ఇబ్బంది పడుతున్నారు. భానుడి ప్రతాపానికి తట్టుకొని పనిచేయడం కష్టతరం అవుతోంది. ఎండలు పెరుగుతున్నా, జిల్లాలో ప్రకటిత విద్యుత్ కొరత కొనసాగుతోంది. మధ్యాహ్నం పూట అనధికారికంగా విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్తు  నిలుపుదల చేస్తున్నారు. ఇందుకు లోడ్ లేదని, లైన్ ట్రిప్ అవుతుందని వంకలు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను  ఆగిపోవాదంతో వేడికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వ్యవసాయ రంగానికి కూడా విద్యుత్ కోతలను అమలు చేస్తున్నారు. గతంలో వ్యవసాయ రంగానికి 9 గంటల పాటు విద్యుత్తు సరఫరా చేస్తుండగా దానిని ఏడు గంటలకు కుదించారు. అది కూడా రెండు మూడు దఫాలుగా ఇస్తున్నారు. అధికారికంగా ఏడు గంటల విద్యుత్ సరఫరా అంటున్నా, వాస్తవానికి ఐదారు గంటలు కూడా విద్యుత్ రావడం లేదు. దీంతో పంటలు చాలా వరకు దెబ్బతింటున్నాయి. భూగర్భ జలాలు కూడా అడుగంటాయి. గత ఏడాది అనుకున్న విధంగా వర్షాలు కురవక పోవడంతో చెరువులు, కుంటలు ఎండిపోయాయి. ఈ ప్రభావంతో భూగర్భ జలాలు అడుగంటడం, విద్యుత్ కోతలతో పంటలకు నీటి సరఫరా చేయలేక అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *