రెండవ రోజు జిల్లాలో 16 నామినేషన్లు
పార్లమెంటుకు 3, శాసనసభకు 13 నామినేషన్లు
కుప్పం నుండి చంద్రబాబు తరపున భుననేస్వరి
పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి
నగరిలో మరో మంత్రి ఆర్కే రోజా
పలమనేరులో మాజీ మంత్రి అమరనాధ రెడ్డి
చిత్తూరు ఎం పి గా రెడ్డెప్ప
పలమనేరుకు ఎమ్మెల్యే ఎన్ వెంకటే గౌడ
పూతలపట్టు అభ్యర్థిగా సునీల్ కుమార్
పుతలపత్తి టిడిపి అభ్యర్థిగా మురళీమోహన్
జీడి నెల్లూరు అభ్యర్థిగా కృపాలక్ష్మి
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
సాధారణ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం చిత్తూరు జిల్లాలో పార్లమెంటుకు మూడు, అసెంబ్లీకి 13 మంది నామినేషన్న్లు దాఖలు అయ్యాయి. పార్లమెంటుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇద్దరూ, జాతీయ జనసేన పార్టీ తరఫున ఒకరు నామినేషన్ దాఖలు చేశారు. శాసనసభ అభ్యర్థులుగా 13 మంది నామినేషన్ దాఖలు చేయగా, అందులో ఏడు మంది వైసీపీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు. తెలుగుదేశం పార్టీ తరఫున నలుగురు, సమాజ్వాదీ పార్టీ తరఫున ఒకరు, ఇండిపెండెంట్ గా మరొకరు నామినేషన్లు దాఖలు చేశారు.
చిత్తూరు పార్లమెంటుకు వైసిపి తరపున ఎం పి రెడ్డెప్ప. ఎన్. రెడ్డెమ్మ, జాతీయ జనసేన పార్టీ తరఫున దుగ్గిరాళ్ళ నాగేశ్వర్ రావు నామినేషన్లు దాఖలు చేశారు. చిత్తూరు ఎం పి రెడ్డెప్ప నామినేషన్ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ గోవింద శ్రీనివాసులు కూడా పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ తరఫుచిత్తూరు జిల్లాలోన ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తారఫున అయన సతీమణి నారా భువనేశ్వరి కుప్పంలో నామినేషన్ దాఖలు చేశారు. పలమనేరు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, ఆయన సతీమణి రేణుక రెడ్డిలు నామినేషన్ దాఖలు చేశారు. పూతలపట్టు నియోజకవర్గం టిడిపి అభ్యర్థిగా కలికిరి మురళి మోహన్ నామినేషన్ దాఖలు చేశారు.
వైసిపి పార్టీ తరఫున పుంగనూరుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సతీమణి స్వర్ణలతలు నామినేషన్ దాఖలు చేశారు. నగరి నియోజకవర్గం నుంచి మంత్రి ఆర్కే రోజా నామినేషన్ దాఖలు చేశారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి కళత్తూరు కృపా లక్ష్మి నామినేషన్ దాఖలు చేయగా, పూతలపట్టు నియోజకవర్గం నుంచి డాక్టర్ ఎం సునీల్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. పలమనేరు నియోజకవర్గం నుంచి పలమనేరు ఎమ్మెల్యే ఎన్ వెంకటే గౌడ, ఆయన సతీమణి పావని మరో మారు నామినేషన్లు దాఖలు చేశారు.
సమాజ్వాది పార్టీ తరఫున గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి పల్లిపట్టు గుణశేఖర్ నామినేషన్ దాఖలు చేయగా, ఇండిపెండెంట్గా నగిరి నియోజకవర్గానికి కే. దనశేఖర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.