త్వరలో చిత్తూరు మీదుగా వందేభారత్ రైలు
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
త్వరలో చిత్తూరు మీదుగా వందేభారత్ రైలు ప్రయాణం చేయనుంది. ఈ రైలు విజయవాడ నుంచి బయలుదేరి తిరుపతి మీదుగా బెంగళూరు చేరుకుంటుంది. దీనిలో 8 భోగీలో ఉంటాయి. వారంలో మంగళవారం మిగిలిన ఆరు రోజులు పాటు వందేమాతరం రైలు నడుస్తుంది. వందేమాతరం రైలు సాయంకాలం 5:15 నిమిషాలకు విజయవాడ నుంచి బయలుదేరి 5. 40 కి తెనాలి చేరుతుంది.6.30కి ఒంగోలు, 7:45కు నెల్లూరు, 8:30 కి గూడూరుకు వస్తుంది. 9:45కు తిరుపతి చేరుకుని 10 27 కు చిత్తూరుకు వస్తుంది. 11:15 కు కాట్పాడి, 12.10కి జోలార్ పేట, 1.40 కి కృష్ణరాజపురం మీదుగా 2:15 కు ఎస్ వి ఎం టి బెంగళూరు చేర్తుంది. పార్లమెంట్‌లో జరగిన బడ్జెట్ సమావేశాల్లో కొత్తగా ప్రవేశపెట్టనున్న వందేభారత్ సర్వీసుపైన చర్చించారు. ఈ మేరకు ఏపీ మంత్రుల ప్రతిపాదనపైన స్పందించిన రైల్వే మంత్రి విజయవాడ - బెంగళూరు మధ్య వందేభారత్ రైలుపై స్పష్టమైన హామీని ఇచ్చారు. ఏపీలోని తిరుపతి రైల్వే స్టేషన్ పనులు వేగం పుంజుకున్నాయని, వీలైనంత తొందరలోనే ఆ స్టేషన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ముఖ్యంగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న వందేభారత్ రైళ్లకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ ఉన్న నేపథ్యంలో కొత్త వందేభారత్‌కూ అదే తరహా ఆదరణ ఉంటుందని పలువురు భావిస్తున్నారు. ప్రస్తుతం విజయవాడ నుంచి చెన్నైకు, కాచిగూడ నుంచి యశ్వంత్ పూర్‌కు వందేభారత్ అందుబాటులో ఉండగా ఏపీ నుంచి నేరుగా బెంగళూరుకు వందేభారత్ కేటాయించాని ఎంపీలు విన్నవించారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వందేభారత్ రైళ్లకు మంచి ఆదరణ ఉంది. ఈ రైళ్లలో ప్రయాణించి సమయాన్ని ఆదా చేసుకునేందుకు ప్రయణికులు క్యూ కడుతున్నారు. పలు రైల్వే స్టేషన్‌ల ఆదునికీకరణ పనులు సైతం వేగం పుంజుకుంటుండడంతో రవాణా వ్యవస్థలో రైల్వే శాఖ అగ్రగామిగా నిలువనుంది. ఇటీవల కాలంలో రైలు ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మరీ ముఖ్యంగా సికింద్రాబాద్ - విశాఖ, సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ రైళ్లలో ప్రయాణించేవారు అధికమయ్యారు. అలాగే, విజయవాడ - చెన్నై మద్య నడుస్తున్న వందేభారత్ సైతం నిత్యం రద్దీగా ఉంటోంది. ఈ కారణంగానే కొత్తగా విజయవాడ - బెంగళూరు మధ్య కొత్తగా వందేభారత్ ప్రతిపాదనను ఎంపీలు తెర మీదకు తీసుకువచ్చారు. ఇటివల టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి విజయవాడ నుంచి బెంగళూరకు వందేభారత్ రైలు ప్రారంభించాలని కోరారు. ఈ రైలుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే రాజధాని అమరావతి ప్రాంతం నుంచి బెంగళూరుకు కనెక్టివిటీ పెరుగుతుందని తెలిపారు. వినతిపత్రం సమర్పించారు. విజయవాడ-బెంగళూరు మధ్య వందేభారత్ రైలు ప్రారంభించాలని రైల్వే మంత్రిని కోరారు. విజయవాడ, గుంటూరులను బెంగళూరుతో అనుసంధానించడానికి ఎక్స్‌ప్రెస్‌వే వంటి రోడ్డు వ్యవస్థ లేదన్నారు. ప్రస్తుతం ఉన్న రోడ్డు మార్గాన్ని బట్టి చూస్తే విజయవాడ, గుంటూరు నుంచి బెంగళూరు వెళ్లాలంటే దాదాపు 16 గంటల సమయం పడుతోంది అన్నారు. అందుకే విజయవాడ, గుంటూరు నుంచి ప్రయాణభారాన్ని తగ్గించడానికి విజయవాడ-బెంగళూరు మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించాలని రైల్వేమంత్రిని కోరారు దేవరాయలు. ఈ రైలు ప్రారంభిస్తే ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, వ్యాపారులు, పర్యాటకులు, విద్యార్థులతోపాటు, సాంకేతిక నిపుణులు, సాధారణ ప్రయాణికులకు ఎంతో మేలు జరుగుతుంది అన్నారు. ఈ వందేభారత్‌తో విజయవాడ, గుంటూరు ప్రాంతం నుంచి బెంగళూరుకు ప్రయాణ సమయం భారీగా తగ్గుతుంది. అలాగే కొత్త వందేభారత్ రైలును ఏ, ఏ స్టేషన్‌లలో ఆపితే బావుంటుందో కూడా వినతిపత్రంలో ప్రస్తావించారు. ఈ రైలు విజయవాడలో ప్రారంభమై గుంటూరు, నరసరావుపేట, వినుకొండ, మార్కాపురం రోడ్డు, గిద్దలూరు, నంద్యాల, డోన్, గుంతకల్లు, అనంతపురం, హిందూపురం, యలహంకల్లో ఆపాలని దేవరాయలు కోరారు. ఈ కొత్త రైలు ప్రారంభంపై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఇది అందుబాటులోకి వస్తే రెండు తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం చేరువ అవుతుందనడంలో సందేహమే లేదు. ఎప్పటి నుండి ప్రారంభం అయ్యేది ఇంక తెలియలేదు.
గంగ 3 వందేభారత్ రైలు

