11, మే 2025, ఆదివారం

కనిపించే దైవం, కని పెంచిన దైవం అమ్మ.

నేడు ప్రపంచ  మాతృ దినోత్సవం

ఆంధ్రప్ర్తభ బ్యూరో, చిత్తూరు.

 మనకు కనిపించే దైవం, మనలను కని పెంచిన దైవం అమ్మ. సృష్టిలో తల్లి ప్రేమను  మించిన  ప్రేమ ఉండదు. సృష్టిలో   అమృతం ఉందో లేదో తెలియదు, అదే ఆయుషు పోస్తుందో లేదో తెలియదు. కానీ అమ్మ మాత్రం తన ఆయుష్షును బిడ్డలకు పోస్తుంది. బిడ్డలుగా నిండు నూరేళ్లు  ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటుంది. మన బంగారు భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిస్తుంది. జీవితాంతం పిల్లలే తన సర్వస్యంగా భావించి, ఎన్నో కష్టాలను భరిస్తుంది. అమ్మ ప్రేమను మించిన ప్రేమ ప్రపంచంలో మరొకటి లేదు. మనమల్ని కని, పెంచి పెద్ద చేసిన వాళ్లను చేసి, మనకు మంచి భవిష్యత్తు ఇచ్చిన అమ్మకు ఏమి ఇచ్చినా, రుణం తీర్చుకోలేము. బిడ్డల ఆనందమే తల్లికి వెలకట్టలేని సంతోషంగా జీవితాంతం అమ్మ సర్వస్వాన్ని బిడ్డల కోసం అర్పిస్తుంది. అందుకే తల్లిని మించిన దైవం మరొకటి మరొకరు లేదంటారు. నవ మోసాలు మోసి కనిపించిన అమ్మ  ముఖంలో సంతోషం ఉండేలా చూసుకుంటే, కొంతైనా అమ్మ రుణం తీర్చుకున్న వారం అవుతాం.

 దీనిని ప్రతి సంవత్సరం మే నెల  రెండో ఆదివారంను మాతృ దినోత్సవంగా జరుపుకుంటారు. పిల్లలు పుట్టినప్పట్నుంచీ వారి పెంపకం, వారి బంగారు భవిష్యత్ కోసం తల్లి కష్టపడుతుంది. ఆమె పిల్లలపై చూపించే ప్రేమ, ఆప్యాయత, త్యాగానికి ప్రతీకగానే ప్రతీ సంవత్సరం  మాతృ దినోత్సవంను జరుపుకుంటారు. ఈ రోజున పిల్లలు తల్లులని  ప్రత్యేకంగా గౌరవిస్తారు.  మొదట్లో అమెరికాలో మదర్ డేను  సెలబ్రేట్ చేసుకున్నారు. అన్నా జార్విస్ అనే మహిళ తన తల్లిని ఎక్కువగా ఇష్టపడేది. ఆమెని కంటికి రెప్పలా చూసుకునేందుకు పెళ్ళి కూడా చేసుకోలేదు. కానీ, కాలక్రమేణా తన తల్లి చనిపోయింది. దీంతో ఆమె తన తల్లిని మిస్ అయింది. అన్నా తల్లి మేలో మరణించింది. కాబట్టి, ఆ నెలలోనే ఈ మదర్స్ డేని సెలబ్రేట్ చేసుకోవడం ప్రారంభించింది. పిల్లల కోసం జీవితాన్నంతా త్యాగం చేసే తల్లులకి ఈ రోజున ప్రశంసలు దక్కాలనుకుని ఇలా  అన్నా సెలబ్రేట్ చేసేది. తన తల్లి మరణం తర్వాత జీవితాన్నంతా ఇతరుల సేవకి అంకితం చేసిన అన్నా.. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో గాయపడిన అమెరికన్ సైనికులకి తల్లిలా సేవ చేసింది. ఆమె సేవకి గుర్తుగా అప్పటి యూఎస్ అధ్యక్షుడు వుడ్రో విల్సన్ ఆమె గౌరవార్థం ఓ చట్టాన్ని ఆమోదిస్తూ మదర్స్ డే సెలబ్రేట్ చేసుకోవాలన్నారు. యూఎస్ పార్లమెంట్‌లో చట్టాన్ని ఆమెదించడంతో మే నెల రెండోవ ఆదివారం ఈ రోజుని సెలబ్రేట్ చేసుకోవాలని మే 9, 1914న అధికారికంగా ఆదేశించారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం మే రెండో ఆదివరం మదర్స్‌డేని సెలబ్రేట్ చేసుకునేవారు. అప్పట్లో కేవలం అమెరికాలోనే ఈ రోజుని సెలబ్రేట్ చేసుకునేవారు. కానీ, రాను రాను ఐరోపా, భారతదేశం మొదలైన ఇతర దేశాల్లోనూ ఈ రోజుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.  మాతృ  దినోత్సవాన్ని జరుపుకోవడం వెనుక పురాతన చరిత్ర కూడా ఉందని చెబుతారు. గ్రీకులు, రోమన్స్ వారి మాతృ దేవతలు రియా, సైబెలేలని గౌరవిస్తూ పండుగలు చేసుకునే వారట. ఆ దినోత్సవమే ఇప్పుడు మాతృదినోత్సవంగా జరుపుకుంటారని చెపుతారు.  మాతృ దినోత్సవం రోజున తల్లిని గౌరవిస్తూ వారికి బహుమతులు  ఇవ్వడం, వారిని ఆనందంగా ఉంచడం, వారి త్యాగాన్ని స్మరించుకుంటారు. నిజానికీ తల్లి చేసిన త్యాగాల ముందు మనం ఏమిచ్చినా ఆ రుణం తీర్చుకోలేం. అందుకే, వారికి పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఇచ్చినా, ఇవ్వకపోయినా ఉన్నన్నీ రోజులు వారిని ఆనందంగా, హ్యాపీగా ఏడవకుండా చూసుకోవడమే తల్లికి మనం ఇచ్చే విలువైన బహుమతి. అందుకే, తల్లులను  గౌరవించండి. వారి మాటకి విలువనివ్వండి. నేటి కాలంలో చాలా మంది తమకే అన్నీ తెలుసు అన్నట్లుగా తల్లీదండ్రుల మాట పెడచెవిన పెడుతున్నారు. అలా కాకుండా వారు ఏమనుకుంటున్నారో వారి సలహాలు తీసుకోండి. మీరేమనుకుంటున్నారో వారికి అర్థమయ్యేలా చెప్పి వారి అంగీకారంతో పనులు చేయండి. అదే తల్లికి మనం ఇచ్చే అరుదైన గౌరవం. 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *