ట్యూనా చేపలతో గుండె భద్రం
నేడు ప్రపంచ ట్యూనా చేపల దినోత్సవం.
ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.
ట్యూనా చేపల మాంసం మానవ గుండెకు ఎంతో బలాన్ని చేకూరుస్తాయి. గుండె దమనులలో పేరుకు పోయిన చెడు కొలెస్ట్రాల్ ను కలిగిస్తాయి. గుండెపోటు రాకుండా సహాయం చేస్తుంది. అందుకే
మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ట్రూ నా చేపలను ఆహారంగా ఉపయోగిస్తారు. ఇది ఒక ఉప్పు నీటి చేప. దీనిని కేరా చేప లేదా చూర అని కూడా పిలుస్తారు. తున్నస్ ఆల్బకేర్ అనేది దీని యొక్క శాస్త్రీయమైన పేరు. తున్నస్ అనే పదం ప్రాచీన గ్రీకు నుండి ఉద్భవించింది. దీని అర్థం త్వరగా పరిగెత్తడం, వెంట దూసుకుపోవడం.
చేపలను అతిగా వేటాడడం. ట్యూనా చేపలను రక్షించి భావితరాలకు అందించడం వంటి లక్ష్యాలతో ప్రపంచవ్యాప్తంగా మే రెండవ తేదీన ట్యూనా చేపల దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి సూచనల మేరకు జరుపుకొంటారు.
ఫిలిప్పీన్స్ లోని జనరల్ శాంతోస్ అనే పట్టణంలో ప్రధానంగా ట్యూనా ఫెస్టివల్ జరుగుతుంది. అందులో భాగంగా వంటల పోటీలు, వీధి కవాతులు, నృత్య ప్రదర్శనలు వంటివి జరుగుతాయి. సముద్రపు ఆహారపు గొలుసులో ట్యూనా ఒక ప్రధానమైన పాత్ర వహించే జీవి. ఇది సముద్రంలో ఇతర జీవుల జనాభాను అదుపులో ఉంచుతుంది. గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ క్రీస్తుపూర్వం 350లో రాసిన అనిమల్ హిస్టరీ అనే పుస్తకంలో ట్యూనా చేపలను ప్రస్తావించారని చరిత్రకారులు గుర్తించారు. ట్యూనా చేపలను అధికంగా ఆహారంగా ఉపయోగిస్తారు. కాబట్టి దీనిని చికెన్ ఆఫ్ ది సి అని కూడా పిలుస్తారు. ట్యూనా చేపల మాంసం మృదువుగా, తేమగా, ముదురు గులాబీ రంగులో ఉంటుంది. ఇది ఒకే ఒక్క ఎముక కలిగిన కండగల చేప. సుమారు ఒకటిన్నర కిలోల నుండి ఒక గుర్రం బరువు గల పరిమాణం వరకు పెరగగలదు. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ఇది ప్రసిద్ధమైన రుచికరమైన మాంసముగా పరిగణించబడుతున్నది. ట్యూనా చేప మాంసములో అధిక పరిమాణంలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి గుండె ధమనులలో పేరుకుపోయిన ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు, ఎల్ డి ఎల్ వంటి చెడు కొలెస్ట్రాల్ లను తగ్గిస్తాయి. ఒమేగా త్రీ కొవ్వులను తినడం వల్ల గుండెపోటుతో సహా హృదయ సంబంధ వ్యాధులు తగ్గుముఖం పడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ట్యూనా చేపల మాంసం మంచి పోషక విలువలను కలిగి ఉంటుంది. సముద్రం అందించే ఆహారంలో ట్యూనా ఉత్తమమైనది. అందువల్ల చాలామంది దీనిని సముద్ర రాజు గా భావిస్తారు. ట్యూనా చేప మాంసములో విటమిన్ సి, బి టు బి త్రీ బి 6 బి 9, డి అలాగే జింక్, మాంగనీస్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని హానికరమైన పదార్థాలను తొలగించి, వ్యాధుల నుండి రక్షణ ఇస్తాయి. కాబట్టి పోషకాహార నిపుణులు ట్యూనా చేప మాంసాన్ని సూపర్ ఫుడ్ గా వర్ణిస్తారు.
పో రై గంగ 1 ట్యూనా చేపలు

