15, మే 2025, గురువారం

జిల్లాకు తగ్గిన వేరుశనగ విత్తనాల సరఫరా

గత సంవత్సరం 43 వేల క్వింటాళ్ల పంపిణి

ఈ సంవత్సరం 26 వేల క్వింటాళ్ళ సరఫరా  

జిల్లాలో తీవ్రం కానున్న విత్తనాల కొరత 

జిల్లాలో తగ్గనున్న వేరుశనగ విస్తీర్ణం 

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.

రానున్న ఖరీఫ్ సీజన్ కు చిత్తూరు జిల్లాలో వేరుశనగ విత్తనాల కొరత రైతులను వేధించనుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లాకు తగినంత వేరుశనగ విత్తనం సరఫరా కాలేదు. గత సంవత్సరం సరఫరా చేసిన వేరుశనగ విత్తనంలో సగం మాత్రమే ఈ సంవత్సరం జిల్లా కేంద్రానికి అందాయి. ఈ విత్తనాలు సరిపోదని మరో 26 వేల క్వ క్వింటాళ్ల వేరుశనగ విత్తనం అవసరమని జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరోసారి వేరుశనగ విత్తనం సరఫరా అనుమానంగానే కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం క్రమంగా వేరుసెనగ విత్తన పంపిణీని తగ్గిస్తూ వస్తోంది. రాయితీ మొత్తం పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వానికి వేరుశనగ విత్తనాల పంపిణీ భారంగా తయారయ్యింది.  రైతులకు అందజేసిన వేరుశనగ విత్తనాలను కూడా సక్రమంగా వినియోగించడం లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం క్రమంగా వేరుశనగ విత్తనాల పంపిణీ తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా జిల్లాలో వేరుశనగ విస్తీర్ణం గణనీయంగా తగ్గనుంది. 

గత ఖరీఫ్ సీజన్ కు చిత్తూరు జిల్లాలో 81 వేల హెక్టార్లలో పంటలుగా కావలసి ఉండగా జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా కేవలం 33,000 హెక్టర్లలో మాత్రమే పంటలు సాగయ్యాయి. ఇందులో 15 వేల హెక్టార్లలో వేరుశనగ సాగు ఉంటుందని అంచనా. వేరుశనగతో పాటు జిల్లాలో కందులు, వుద్ధులు, పెసలు, అలసందలు ధాన్యాలను కూడా పండిస్తారు.వీటిని అంతర పంటగా వేస్తారు. రైతులు ఎంతో ఉత్సాహంతో గత సంవత్సరం వేరుశనగను వేశారు. అయితే గత మూడు వారాలుగా జిల్లాల్లో వర్షాలు పడకపోవడంతో వేరుశనగ పంట పూర్తిగా ఎండిపోయింది. వేరుశనగ వేసినప్పటి నుండి సకాలంలో వర్షాలు పడలేదు. కాయలు తయారయ్యే పరిస్థితిలో వర్షం పడలేదు. మల్లి కాయలను పీకే దశలో కూడా వర్షం రాలేదు. దీంతో జిల్లాలో వేరుశనగ పంట పూర్తిగా దెబ్బతింది. ఒక ఎకరం వేరుశనగ పంట వేయడానికి  రైతుకు సుమారుగా 20 వేల రూపాయలు వ్యయమవుతుంది. వేరు శనగ వేయడానికి  రెండు పర్యాయాలు భూమిని దున్నాల్సి ఉంటుంది. ఇందుకు సుమారుగా 5వేల రూపాయలు ఖర్చు అవుతుంది. వేరుశెనగ విత్తనం కొనుగోలుకు  5వేల రూపాయలు అవుతుంది. గింజలు వేయడం, అందులో కలుపు తీయడానికి ఎకరానికి 5వేల  రూపాయలు వరకు  వ్యయం అవుతుంది. ఇక ఎరువులు, ఇతర ధాన్యాలు వేయడం పంట పనులకు మరో ఐదు వేల రూపాయలు వంతన వ్యయమవుతుంది. ఇలా ఒక ఎకరా వేరుశనగ సాగు చేయడానికి రైతుకు 20వేల రూపాయలు వ్యయమవుతుంది. చిత్తూరు జిల్లాలో 15 వేల హెక్టార్లు అంటే 35 వేల ఎకరాల్లో వేరుశనగ సాగైందని వ్యవసాయ శాఖ అధికారుల అంచనా. ఈ లెక్క న జిల్లాలోని రైతులు వేరుశనగ పంట మీద 70 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారని తెలుస్తోంది. ఆయనా, జిల్లాలో వానలు ఎనక్కి పోవడంతో ఈ పెట్టుబడి రైతులు నష్టపోయినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో గత నాలుగైదు సంవత్సరాలుగా వేరుశనగ విస్తీర్ణం తగ్గిపోతుంది. ఇందుకు కారణం సకాలంలో వర్షాలు పడకపోవడం. వేరుశనగ పంట చేతికి రాకపోవడం, ఒక సంవత్సరం భారీ వర్షాలతో వేరుశెనగ పంటను ఓడుపుకునే అవకాశం కూడా లేకుండా పంట చేలలోనే కుళ్లిపోయింది. ఇలా ప్రతి సంవత్సరం ఏదో ఒక విధంగా వేరుశనగ పంట దెబ్బతింటూనే ఉంది. అయినా ఆశతో రైతులు వేరుశనగ పంట వేస్తూనే ఉన్నారు.  పంట వేయడానికి గత సంవత్సరం రాయితీ మీద నలభై వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను వ్యయసాయ శాఖ అధికారులు రైతులకు సరఫరా చేశారు. వేరుశనగ పంట వేసిన  తర్వాత కొంతకాలం సక్రమంగానే వర్షాలు పడ్డాయి. దీంతో వేరుశనగ పంటలో కలుపును కూడా తీసి, పంటకు సిద్ధం చేశారు. తీరా వేరుశనగ ఊడల దిగి, కాయలు తయారయ్యే పరిస్థితుల్లో వరుణదేవుడు ముఖం చాటు వేశాడు. దీంతో జిల్లాలో వేరుశనగ పంట ఎండిపోయింది. జిల్లాలో క్రమంగా వేరుశనగ పంట విస్తీర్ణం కూడా తగ్గుతుంది. ఒకవైపు సకాలంలో వర్షాలు పడకపోవడం, మరోవైపు వేరు విత్తనాలు విత్తడానికి, అందులో కలుపు తీయడానికి, వేరుశనగ పీకడం, కాయలు ఒలువడం వంటి పనులకు కూడా జిల్లాలో కూలీలు దొరకడం లేదు. కూలీల రోజుకు 500 నుంచి 700 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పంట రాబడి కంటే కూలీలకు అయ్యే ఖర్చు ఎక్కువ అవుతుంది. లెక్కలు వేసుకుంటున్న పలువురు రైతులు వ్యవసాయానికి స్వస్తిపలుకుతున్నారు. ఫలితంగా భవిషత్తులో వంట నునెల ధరలు గణనీయంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు జిల్లాలో అరకొరగా రైతులకు వేరుశనగ విత్తనాలను సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న వేరుశెనగ విత్తనం ఒక ఎకరాకు  కూడా చాలడం లేదు. విత్తనం సరిపోక రైతులు తమ భూములను బీడులుగా వదిలేస్తున్నారు. గత సంవత్సరం జిల్లాలో వర్షాలు సరిగా పడకపోవడంతో  జిల్లాలో వేరుశనగ విత్తనాల కొరత చాలా తీవ్రంగా ఉంది. వేరుశనగ విత్తనాలు కొనుగోలు చేయడానికి బహిరంగ మార్కెట్లో  ఎక్కడా దొరకదు. విత్తనాల దుకాణాల్లో వేరుశెనగ విత్తన నమ్మడం లేదు. రైతులు ఇతర రైతుల నుండి మాత్రమే వేరుశనగ విత్తనాలు సేకరించుకోవాలి ఉంటుంది. ఒక్కొక్క రైతుకు ఒక బస్తా మాత్రమే సబ్సిడీపై ఇస్తోన్న వేరుశనగ విత్తనాలను  పంపిణీ చేస్తున్నారు. దీంతో, మిగిలిన విత్తనాలను బయట మార్కెట్లో అధిక ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. గతంలో గరిష్టంగా నాలుగు బస్తాలు ఇచ్చే స్థానంలో ఇప్పుడు ఒక్క బస్తాతోనే సరిపెడుతున్నారు. చాలీచాలని విత్తనాలు ఇవ్వడం కారణంగా జిల్లాలో వేరుశనగ విస్తీర్ణం తగ్గిపోతోంది.  చిత్తూరు జిల్లాలో ఏటా ఖరీఫ్‌ సీజన్ లో 3.40 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు చేస్తారు. మొత్తానికి 250 వేల  క్వింటాళ్ల వేరుశనగ విత్తనం అవసరం అవుతుంది. వ్యవసాయ శాఖ అధికారులు 50 వేల క్వింటాళ్ల విత్తనాలు కావాలని అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఇప్పటి వరకు 26 వేల క్వింటాళ్ల సరఫరా అయ్యింది. ఇప్పటికి వరకు విత్తనం సరఫరా ప్రారంభం కాలేదు. విత్తనం సరఫరా కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. 


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *