చంద్రబాబును కలిసిన శ్రీజ, మదర్ డెయిరీ ప్రతినిధులు
కుప్పంలో శ్రీజ ఆధ్యర్యంలో మినీ డెయిరీ, పశుగ్రాస ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు
మదర్ డెయిరీఆధ్యర్యంలో పండ్ల గుజ్జు ప్రాసెసింగ్ యూనిట్
కుప్పంలో నూతన గృహ ప్రవేశానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నైడును సోమవారం శ్రీజ మిల్క్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, మదర్ డెయిరీ ప్రతినిధులు కలిశారు. స్వర్ణ ఆంధ్ర సాధన కోసం జీరో పేదరికాన్ని సాధించడానికి పెట్టుబడి ప్రణాళికల గురించి చర్చించారు. కుప్పంలో పారిశ్రామిక యూనిట్లను స్థాపించడానికి కంపెనీలకు భూమి కేటాయించాలని కోరారు. శ్రీజ మిల్క్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఒక మినీ పాల డెయిరీని, పశుగ్రాస ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు తెలిపారు. మదర్ డెయిరీ 8,000 ఉద్యోగాలను సృష్టించే పండ్ల గుజ్జు ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. దీంతో స్థానిక రైతుల నుండి పాడి, ఉద్యానవన ఉత్పత్తులను నేరుగా సేకరించడం ద్వారా, రైతుల ఆదాయాలను పెరుతున్దన్నారు. తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. గతంలో కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఈ పెట్టుబడులు ఈ ప్రాంతంలో పెడుతున్నట్లు వివరించారు. ఇది కుప్పం సమగ్ర అభివృద్ధికి దోహదం చేస్తునని అభిప్రాయపడ్డారు. రెండు కంపెనీలు తమ ప్రాజెక్టులను 15–18 నెలల్లోపు పూర్తి చేయాలని, ఇందుకు అవసరమైన భూమిని కేటాయించడం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోరారు. పో రై గంగ 5 చంద్రబాబును కలిసిన శ్రీజ, మదర్ డెయిరీ ప్రతినిధులు

