12, మే 2025, సోమవారం

సేవలకు మారుపేరు నర్సులు

నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
 అనారోగ్యంతో ఉన్న, బలహీనంగా ఉన్న లేదా గాయపడిన వ్యక్తులకు చికిత్సచేసే ఆరోగ్య సంరక్షణ నిపుణులు నర్సులు. నర్సులు వైద్యులు, ఆరోగ్య సంరక్షణ నిపుణుల బృందంలో పని చేస్తారు, రోగులకు వైద్య సహాయం అందిస్తారు, వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తారు మరియు వారిని మానసికంగా మద్దతు ఇస్తారు. నర్సులు రోగుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తారు, వారికి మందులు ఇస్తారు, వారి గాయాలకు చికిత్స చేస్తారు, వారి ఆరోగ్యం మెరుగుపడేలా చూస్తారు. నర్సులు వైద్యులకు రోగుల సంరక్షణలో సహాయం చేస్తారు, వైద్యులు ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తారు మరియు రోగుల గురించి వైద్యులకు సమాచారం అందిస్తారు. నర్సులు ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించేలా అవగాహన కల్పిస్తారు, అనారోగ్యాల నుండి ఎలా రక్షించబడాలనే దానిపై సమాచారం అందిస్తారు. నర్సులు అనారోగ్యంతో ఉన్నవారికి మాత్రమే కాదు, సమాజానికి కూడా సహాయం చేస్తారు. వారు కమ్యూనిటీ హెల్త్ ప్రోగ్రామ్స్‌లో పాల్గొంటారు, ప్రజల ఆరోగ్యం మెరుగుపరచడానికి కృషి చేస్తారు. 

కరోనా కాలంలో నర్సులు ఎంత కష్టపడ్డారో అందిరికీ తెలిసిందే. వారి ప్రాణాలను కూడా పణంగా పెట్టి కోవిడ్‌ బారిన పడ్డవారిని మృత్యువు నుంచి తప్పించి కరోనా వారియర్‌లుగా నిలిచారు. ఆ సమయంలో వైద్యులతో పాటు నర్సులు రాత్రి, పగలు తేడా లేకుండా ప్రజలకు సేవలందించారు. రోగులకు వ్యాధి నుంచి ఉపశమనం కలిగించేందుకు డాక్టర్స్‌ ఎంత కృషి చేస్తున్నారో నర్సులు కూడా అంతే కృషి చేస్తారు. నర్సులు రోగుల పట్ల చేసే సేవలు వర్ణణాతీతం.. కాబట్టి ప్రతి సంవత్సరం వారి గుర్తించుకుంటూ నర్సుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం మే 12న నర్సుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ దినోత్సవానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. నర్సింగ్​లో ఫ్లోరెన్స్ నైటింగేల్ చేసిన సేవలను గుర్తిస్తూ.. ఈ నర్సుల వారోత్సవాలను నిర్వహిస్తారు. ఆమె బర్త్​డే రోజున అంటే మే 12వ తేదీన నర్సుల వారోత్సవాలు ముగుస్తాయి. ప్రముఖ ఆంగ్లేయురాలైన ఫ్లోరెన్స్ నైటింగేల్ కేవలం సంఘసంస్కర్త మాత్రమే కాదు.. ఆధునిక నర్సింగ్ స్థాపకురాలు కూడా. క్రిమియన్ యుద్ధంలో గాయపడిన సైనికుల సంరక్షణలో ఆమె అందించిన సేవలకు గుర్తుగా నర్సుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అందుకే ఆమెకు ది లేడి విత్ ది ల్యాంప్ అనే పేరు కూడా పెట్టారు. ఎందుకంటే ఆమె యుద్ధంలో గాయపడిన సైనికులను రాత్రుళ్లు సేవలు చేసేదని చెప్తారు. నర్సుల వారోత్సవాల్లో భాగంగా ప్రతిచోటా నర్సుల బాధ్యతలను గుర్తించేలా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటాయి. వైద్యుడి దగ్గరికి చికిత్సకు వెళ్లినప్పుడు, శస్త్రచికిత్స చేయించుకునే సమయంలో నర్సులే పేషెంట్లకు, డాక్టర్లకు మధ్య వారధులు అవుతారు. కానీ డాక్టర్లకు వచ్చినంత పేరు.. నర్సులకు ఇవ్వలేరు. ఈ విషయంపై అవగాహన కల్పిస్తూ.. పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. మరికొందరు సోషల్ మీడియాలో నర్సుల గురించి పోస్టులు వేస్తూ అవగాహన కల్పిస్తారు. 1953లో నర్సుల దినోత్సవాన్ని తెరపైకి తీసుకువచ్చారు. యూఎస్​లో దానికి ఆమోదం లభించకపోవడంతో తర్వాత సంవత్సరంలో మొదటిసారిగా నర్సుల దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించారు.1974వరకు ఇదే కొనసాగగా అదే సంవత్సరంలో జాతీయ నర్సుల వారోత్సవాలను ప్రకటించారు. ప్రతి సంవత్సరం ఈ వారోత్సవాలను ఓ కొత్త థీమ్​తో ప్రజల ముందుకి తీసుకువెళ్తారు. అయితే ఈ నర్సింగ్ వృత్తికి 1896 నుంచి కూడా అమెరికన్ నర్సుల సంఘం మద్ధతునందించింది. అనంతరం అది రాష్ట్ర స్థాయిలో వివిధ దేశాలలో గుర్తింపును సంతరించుకుంది. అప్పటి నుంచి నర్సులు చేసే సేవలను గుర్తిస్తూ నర్సుల దినోత్సవం నిర్వహిస్తున్నారు.1965 నుంచి ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సులు అంతర్జాతీయ నర్స్ డేని నిర్వహిస్తున్నారు. మే 6వ తేదీతో మొదలయ్యే జాతీయ నర్సుల వారోత్సవాలు మే 12వ తేదీతో అంతర్జాతీయ నర్సుల దినోత్సవంతో ముగుస్తాయి. 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *