5, మే 2025, సోమవారం

అకాల వర్షాలతో రైతులకు భారీగా నష్టం

ఈదురు గాలులకు నేల రాలుతున్న మామిడి కాయలు 

అరటి, బొప్పాయి పంటలకు కూడా భారీగా నష్టం 

ఈదురు గాలులకు నేలకూలుతున్న మామిడి చెట్లు 

నేల రాలిన మామిడి కిలో నాలుగు రూపాయలు

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.


చిత్తూరు జిల్లాలో పడుతున్న అకాల వర్షాలు రైతన్నకు భారీ నష్టాలను కలుగచేస్తున్నాయి. అకాల వర్షాల కారణంగా చిత్తూరు జిల్లాలో ఉద్యానవన పంటలకు భారీగా నష్టం వాటిల్లుతుంది. ఈదురు గాలులతో కూడిన వర్షం పడటంతో మామిడి, బొప్పాయి, అరటి పంటలకు నష్టం భారీగా జరిగింది. పలుచోట్ల మామిడి, బొప్పాయి, అరటి చెట్లు  నేలమట్టం అయ్యాయి. పక్వానికి రాకముందే మామిడి, అరటి, బొప్పాయి కాయలు నేల రాలుతున్నాయి. వీటిని కొనేవారు లేకుండా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. 

చిత్తూరు జిల్లాలో గత నాలుగు రోజులుగా అకాల వర్షాలు పడుతున్నాయి. రెండవ తేదీన జిల్లాలో సగటున 0.9 మిల్లీమీటర్లు, మూడవ తేదీన 5.7 మిల్లీమీటర్లు, నాలుగో తారీఖున 1.5 మిల్లీమీటర్లు, 5వ తేదీన 3.1 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదయింది. నాలుగు రోజులు కలిపి చిత్తూరు మండలంలో 53.8 మిల్లీమీటర్లు, సోమల మండలంలో 40.2 , కుప్పంలో 23, పులిచర్లలో 11.2, వెదురుకుప్పంలో 17.4, సోమలలో 40.2, చౌడేపల్లిలో 12.2, పుంగనూరులో 22.2, గంగవరంలో 20.2, గంగాధర నెల్లూరులో 26, పలమనేర్లు 10.4, బైరెడ్డిపల్లిలో 12, యాదమరిలో 30, గుడిపాలలో 13 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నాలుగు రోజులు కలిపి జిల్లాలో సగటున 11.2 మిల్లీమీటర్ల వర్షపాతం పడింది. ఈ అకాల వర్షాల కారణంగా జిల్లాలో రైతులకు భారీగా నష్టం జరిగింది. జిల్లాలో రెండవ తేదీ పడిన వర్షం కారణంగా 172 హెక్టార్లలో మామిడి, అరటి, బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయి, 404 మంది రైతులు ఆర్థికంగా నష్టపోయారు. పెనుమూరు, యాదమరి, చిత్తూరు, గుడిపాల, పలమనేరు, తవణంపల్లి, ఐరాల మండలాల్లో భారీగా నష్టం జరిగింది. చిత్తూరు జిల్లాలో ఒకవైపు రకాల వర్షాలు, మరోవైపు ఏనుగుల దాడులతో రైతన్నలు అల్లాడిపోతున్నారు. ఇంకొద్ది రోజుల్లో కాపుకు వస్తుందన్న పంటలు నేల పాలవుతున్నాయి. ఇందుకు సంబంధించి ఉద్యానవల్ల శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు అందజేస్తున్నారు, తప్ప నష్టపరిహారం అందడం లేదు. ఈ ఈ సంవత్సరం వాతావరణం అనుకూలంగా లేని కారణంగా చిత్తూరు జిల్లాలో మామిడి పంట చాలా ఆలస్యంగా పూతకు వచ్చింది. సుమారు రెండు నెలలు ఆలస్యంగా పూత రావడంతో వచ్చిన పూత కూడా చాలా వరకు నిలవలేదు. ఈ సంవత్సరం 50 శాతం పంట కూడా వస్తుందన్న నమ్మకం రైతన్నలకు లేదు. జిల్లాలో చాలా మామిడి తోటలో చెట్లు  పూతకు బదులు ఇగుర్లు వచ్చాయి. దీంతో జిల్లాలో ఈ సంవత్సరం కూడా రైతన్నకు ప్రకృతి పరంగా నష్టాన్ని కలుగజేసింది. గత సంవత్సరం కూడా జిల్లాలో పంట గణనీయంగా తగ్గింది. పంట తగ్గడంతో పాటు మామిడికి గిట్టుబాటు ధర  లేకపోవడంతో రైతుల తీవ్రంగా నష్టపోయారు. ఈ సంవత్సరమైనా పంట పూర్తిగా చేతికి వస్తుందని రైతులు భావించారు. ఈ సంవత్సరం కూడా పంట సగం కూడా చేతికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో రైతులు అప్పులు చేసి నాలుగైదు పర్యాయాలు మామిడి చెట్లకు మందులను పిసికారి చేశారు. అలా చేసిన కూడా మామిడి తోటలకు మంగు వ్యాపించింది. మామిడి చెట్లు నల్లగా తిరిగిపోతున్నాయి. ఆ ప్రభావం కాయల మీద కూడా పడుతుంది. దీనికి తోడు రింగు రోగం వ్యాపించడంతో కాడ వద్ద నల్లగా మారి, మామిడి నేల రాలుతోంది. ఇలా రకరకాల రోగాలతో కాపునకు వచ్చిన మామిడి కూడా దక్కుతుందని ఆశ రైతులకు లేదు. దీనికి తోడు జిల్లాలో పలుచోట్ల ఏనుగులు మామిడి తోటల మీద పడి ధ్వంసం చేస్తున్నాయి.  ఆకాల వర్షాలు రైతన్న వెన్ను విరుస్తున్నాయి. జిల్లాలో పడుతున్న అకాల వర్షాలు కారణంగా మామిడి పంట చాలావరకు నేలరాలింది. నేలరాలిన మామిడిని కొనుగోలు చేసే వారు కరువయ్యారు. కిలో నాలుగు రూపాయలకు  కొందరు వ్యాపారాలు కొనుగోలు చేస్తున్నారు. మామిడి తోటలో కాయలు ఏరిన కూలి, రవాణా ఖర్చులు కూడా రావడం లేదు. ఒకవైపు ఈదురు గాలులకు కాయలు నేల రాలుతుండగా, మరోవైపు ఎన్నో సంవత్సరాలుగా పెంచి పోషించిన మామిడి చెట్లు విరిగిపడిపోతున్నాయి. ఇలా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆకాల వర్షాలు, ఈదురు గాలుల కారణంగా కలిగిన నష్టాన్ని భర్తీ చేయాల్సిందిగా రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

గంగ 1 బంగారుపాళ్యం మండలంలో నెల కూలిన మామిడి చెట్లు 
గంగ 2 తవణం పల్లిలో నేల రాలిన మామిడి 
గంగ 3 నేల కూలిన మామిడి చెట్లను పరిశీలిస్తున్న డిడి మధుసూదన్ రెడ్డి 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *