టమోటో ధరలు భారీగా పతనం
రూ. 1కి చేరిన కిలో టమోటో
పొలాల్లో వదిలేస్తున్న రైతులు
పశువుల మేతగా టమోటో
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: టమాటా పంట ఒక్కసారిగా చిత్తూరు జిల్లా రైతులకు షాక్ ఇచ్చింది. ఉన్నఫళంగా టమాటా ధరలు పాతాళాన్ని అంటాయి. కిలో టమేటా మార్కెట్లో రూపాయి కూడా పలకడం లేదు. లేదు దీంతో చాలామంది రైతులు టమేటాలను కోయకనే పంట పొలాల్లో వదిలేస్తున్నారు. మరి కొంతమంది టమాటాలను కోసి రోడ్డుమీద పారబోస్తున్నారు. మరికొందరు పశువులకు మేతగా వేస్తున్నారు. టమోటో రైతులకు పంటపొలాల్లో టమోటో కాయలను కోపిస్తే, ఆ కూలీలకు అయ్యే ఖర్చు కూడా రావడం లేదు. మార్కెట్ కు తీసుకోని వెళ్ళితే, రవాణా ఖర్చులు కూడా రావడం లేదు. మార్కెట్లో టమోటోలను అడిగే అడిగే వ్యాపారస్తులు కనిపించడం లేదు.
చిత్తూరు జిల్లాలో అత్యధికంగా టమోటా సాగు అవుతుంది. దీంతో కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం ఆ రాష్ట్రాల్లో కూడా టమేటా విస్తృతంగా దిగుబడి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పొరుగు రాష్ట్రాల నుంచి టమాటా కొనుగోలుకు వ్యాపారస్తులు రావడం లేదు. డిమాండ్ కంటే సరఫరా ఎక్కువ కావడంతో ఒక్కసారిగా చిత్తూరు జిల్లాలో టమాటో ధరలు పడిపోయాయి. శనివారము చిత్తూరు జిల్లా కలికిరిలో 100 కిలోల టమాటో 930 రూపాయలు, మదనపల్లెలో 740, పలమనేరులో 800, మొలకలచెరువులో 900, వాయల్పాడు లో 880 రూపాయలు పలికింది. అదే టమాటా ఆదివారం నాటికి కలికిరిలో 930, రూపాయలు, పుంగనూరులో 1000 రూపాయలు, మదనపల్లిలో 840 పలికింది. చిత్తూరు జిల్లాలో టమేటా ధరలు భారీగా పతనమయ్యాయి కిలో టమాటో రూపాయి కంటే తక్కువకు అమ్ముడు పోతుంది. దీంతో జిల్లాలోని రైతులకు టమాటో గిట్టుబాటు ధర లభించకుండా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో గతేడాది కూరగాయల ధరలు చుక్కలు చూపించిన టమోటో ఇప్పుడు భారీగా తగ్గింది. గత సంవత్సరం ధరలు అమాంతం పెరిగి పేద, మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచాయి. ముఖ్యంగా టమోటా ధర ఆకాశాన్ని అంటింది. చికెన్‌తో పోటీ పడింది. కిలో టమోటా ధర రూ.100కు పైగా పలికింది. మరోవైపు ఉల్లిపాయ రేట్లు సైతం అమాంతం పెరిగిపోయాయి. టమోటా, ఉల్లి నువ్వా, నేనా అన్నట్లు పోటీ పడుతూ ధరలు కొండెక్కాయి. అయితే తాజాగా టమోటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఈసారి టమోటా రైతులు అధికంగా పంటలు పడించడం, దిగుబడీ పెరగడంతో టామోటాలు మార్కెట్లకు పోటెత్తాయి. డిమాండ్, సప్లై సూత్రం ప్రకారం సప్లై అధికంగా ఉండడంతో డిమాండ్ తగ్గిపోయింది. దీంతో రేట్లు తగ్గుముఖం పట్టాయి. రెండు వారాల క్రితం కిలో టమోటా రూ.20 పలకగా పోయిన వారం అది రూ.10కి చేరింది. గత వారం కిలో ధర రూ.4కు పడినా టమోటో ప్రస్తుతం కిలో రూపాయికి పడిపోవడంతో టమోటా రైతులకు కష్టాలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం పండించిన పంట రేటు మరీ ఇంత దారుణంగా పడిపోవడం చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మార్కెట్లో ధరలు లేకపోవడంతో రైతులు పంటలు కోసేందుకు కూడా వెనకాడు తున్నారు. కాయలను తెంచడానికి కూలీలకు అయ్యే ఖర్చు కూడా తిరిగి రాదని పొలాల్లోనే పంటను వదిలేసున్నాడు. మార్కెట్లో టమోటా ధర కిలో రూ.1 మాత్రమే పలుకుతుండంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పంటను కోసే కూలీలకు రోజుకు రూ.350 ఇవ్వాల్సి వస్తుండటంతో రైతులు పంటను పొలంలోనే వదిలేస్తున్నారు. పుంగనూరులో ఒక రైతు తనకున్న రెండు ఎకరాలలో టమోటా పంట సాగుచేశారు. పంట పుష్కలంగా వచ్చింది. తెగుళ్లు సోకడంతో ఈ సారి మందుల కోసం కూడా అధికంగా ఖర్చు చేశానని రైతు తెలిపారు. ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు చేశామన్నారు. పిచికారి మందులు, రసాయనిక మందులు, కూలీలకు అధికంగా ఖర్చయ్యిందన్నారు. మంచిగా పంట పండిందని ఈ సారి లాభాలు వస్తాయనుకునే సమయంలో ఒక్కసారిగా మార్కెట్లో ధరలు తగ్గుముఖం పట్టడంతో ఈ పంటలో కూడా నష్టాలే చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కు రాని పరిస్థితి నెలకొంది. ఇతర పంటలతోపాటు టమోటా పంట కూడా ఈసారి కష్టాలను మిగిల్చిందని అందుకే పొలాల్లోనే వదిలేసినట్లు తెలిపారు. దీంతో కనీసం పెట్టుబడి కూడా చేతికి రాదని టమోటా రైతు కన్నీరు పెడుతున్నారు. చెత్తకుప్పలో పడేసిన టమోటా పశువులకు మేతగా మారుతున్నాయి.
*రంగంలోకి దిగిన ప్రభుత్వం*
టమాటా రేట్ల పతనంపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. టమాటా రేటు భారీగా పతనమైన పరిస్థితిలో రైతులకు ఊరటనిచ్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో టమాట రైతులకు కొంతమేర ఊరట కలగనుంది. టమాటా ధరల పతనంపై ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో టమాటా కొనుగోళ్లకు ఆదేశాలు జారీ చేసింది. రైతుల దగ్గర రేపటి నుంచి టమాటా కొనుగోలు చేసి రైతు బజార్లలో విక్రయించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో టమాటాను రైతుల నుంచి ప్రభుత్వమే మార్కెటింగ్ శాఖ ద్వారా కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. మంత్రి అచ్చెన్నాయుడు మార్కెటింగ్ డైరెక్టర్ విజయ సునీత, సంబంధిత జిల్లాల జాయింట్ కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో టమాటా ధరల పతనంపై ప్రభుత్వం తక్షణ చర్యలకు మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మార్కెటింగ్ శాఖ రైతుల నుంచి రేపటి నుంచి టమాట కొనుగోలు చేసి ఏపీ వ్యాప్తంగా రైతు బజార్లులో నేరుగా విక్రయించాలని, పొరుగు రాష్ట్రాలకు అవసరం మేరకు ఎగుమతి చేసేందుకు చర్యలు చేపట్టామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.
పో రై గంగ 1 టమోటో పరిస్థితి

