జిల్లా అభివృద్ధి పట్టని ప్రజాప్రతినిధులు
సమీక్ష సమావేశానికి మెజారిటీ సభ్యులు డుమ్మా
మొక్కుబడిగా సమీక్ష సమావేశాలు
ముఖం చాటేస్తున్న వైసీపీ ప్రజాప్రతినిధులు
చిత్తూరు బ్యూరో ఆంధ్రప్రభ
జిల్లా కేంద్రంలో జరుగుతున్న జిల్లా అభివృద్ధికి సంబంధించిన సమీక్ష సమావేశాలు మొక్కుబడిగా జరుగుతున్నాయి. జిల్లాకు సంబంధించిన పలువులు ప్రజాప్రతినిధులు ఈ సమావేశాలకు డుమ్మా కొడుతున్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి సమావేశంలో పాల్గొంటున్నా, జిల్లాకు సంబంధించిన పలువురు ప్రజాప్రతినిధులు హాజరు కావడం లేదు. ఇందుకు తోడు ప్రతిపక్ష పాత్రను పోషించి, అధికార పక్షాన్ని నిలదీయాల్సిన వైసిపి ప్రజాప్రతినిధులు ఈ సమావేశాలకు ముఖం చాటు వేస్తున్నారు. దీంతో ఏదో నామమాత్రంగా సమీక్ష సమావేశాలు జరుగుతున్నాయి .
జిల్లా కేంద్రంలో వారం రోజుల వ్యవధిలో రెండు ముఖ్యమైన సమీక్ష సమావేశాలు జరిగాయి. ఏప్రిల్ 29వ తేదీన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. అలాగే మంగళవారం జిల్లా సమీక్ష కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశాలు హాజరు కావాల్సిన మెజారిటీ శాసనసభ్యులు హాజరు కావడం లేదు. జిల్లా పరిషత్ సమావేశం ఉమ్మడి జిల్లాకు సంబంధించినది. జిల్లా పరిషత్ లో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన 14 మంది శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు సభ్యులుగా ఉంటారు. అయితే గత నెల 29వ తేదీన జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి న్ని మెజారిటీ ప్రజాప్రతినిధులు ముఖం చాటువేశారు వేశారు. చిత్తూరు శాసనసభ్యులు జగన్మోహన్ నాయుడు, శాసనసభ్యులు మురళీమోహన్, గంగాధర నెల్లూరు శాసనసభ్యులు థామస్ మాత్రం ఈ సమావేశాలకు హాజరయ్యారు. జిల్లాకు చెందిన మిగిలిన 10 మంది శాసనసభ్యులు ఈ సమావేశానికి గైరాయిజరయ్యారు. అలాగే జిల్లాకు చెందిన ముగ్గురు శాసన మండలి సభ్యులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున శ్రీకాంత్, వైసీపీ తరఫున భరత్, సిపాయి సుబ్రహ్మణ్యం సభ్యులుగా కొనసాగుతున్నారు. వీరు కూడా సమావేశానికి హాజరు కాలేదు. అలాగే చిత్తూరు, తిరుపతి, రాజంపేట పార్లమెంటు సభ్యులు సమావేశాలు హాజరు కావాల్సింది. ముగ్గురు మొఖం చాటు వేశారు. అలాగే మంగళవారం జరిగిన జిల్లా సమీక్ష కమిటీ సమావేశానికి కూడా ఇదే పరిస్థితి పునరావృతం అయింది. ఈ సమావేశంలో చిత్తూరు, పూతలపట్టు శాసనసభ్యులు మాత్రమే పాల్గొన్నారు. అలాగే చిత్తూరు పార్లమెంటు సభ్యుడు ప్రసాదరావు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గం వర్గాల్లో ఉండగా, కుప్పం నుంచి ఎన్నికైన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. కావున ఆయన జిల్లా స్థాయి సమావేశాలకు హాజరు కావడం సాధ్యం కాదు. జిల్లాకు సంబంధించిన మిగిలిన శాసనసభ్యులు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే ఈ జిల్లా అభివృద్ధి విషయమై జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులకు ఎవరికీ పట్టడం లేదు. జిల్లా స్థాయి సమావేశాలకు హాజరు కావడం లేదు. శాసనసభ్యు లు వారి నియోజకవర్గాలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. దీంతో జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి మీద సమగ్రమైన సమీక్ష జరగడం లేదు. జిల్లా సమీక్ష మండలి సమావేశంలో ప్రతిపక్షానికి చెందిన శాసనసభ్యులు కీలకపాత్రను పోషించాల్సి ఉంటుంది. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు జరుగుతున్న లోటుపాట్లు ఎత్తిచూపి, అధికార పక్ష్యాన్ని నిలదీయాల్సి ఉంటుంది. అయితే ఈ పాత్రను వైసిపి ప్రజాప్రతినిధులు పూర్తిగా పక్కన పెట్టారు. జిల్లాకు సంబంధించి శాసన మండల సభ్యులు కానీ, పుంగనూరు శాసనసభ్యు లు రామచంద్రారెడ్డి గాని ఈ సమావేశాలు హాజరు కావడం లేదు. ఇలా జిల్లాల్లో జరుగుతున్న సమీక్ష సమావేశాలు మొక్కుబడిగా, ఒక తంతులాగా జరుగుతున్నాయి.

