ఈ కేవైసీకి దూరంగా లక్ష మంది వినియోగదారులు
మరో రెండు నెలలు గడువు పెంచిన ప్రభుత్వం
జూన్ నెలాఖరుతో ముగియనున్న ఈ కేవైసీ గడువు
అప్పటికీ ఈ కేవైసీ చేపించుకోకుంటే రేషన్ కట్
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
రేషన్ కార్డులలో ఇ కేవైసీకి చిత్తూరు జిల్లాలో లక్ష మంది దూరంగా ఉన్నారు. వీరికి మరో రెండు నెలల పాటు రాష్ట్ర ప్రభుత్వం గడువు పెంచింది. రేషన్ కార్డులోని సభ్యులు అందరు విధిగా జూన్ 30వ తేదీ నాటికి ఈ కేవైసీ చేపిమ్చుకోవాలి. అలా చేపిమ్చుకోకపోతే, జూలై నెల నుండి రేషన్ కట్ అవుతుంది. చిత్తూరు జిల్లాలో తెలుపు రంగు రేషన్ కార్డులలో 16,70,470 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో 15,41,494 మంది ఈ కేవైసీ చేపించుకున్నారు. ఐదు సంవత్సరాల లోపు పిల్లలు 26,099 మంది ఉన్నారు. మీరు ఈ కేవైసీ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే 80 సంవత్సరాలు పైబడిన వృద్ధులు 1,229 మంది ఉన్నారు. వీరికి వేలిముద్రలు సరిగా పడవు. కావున వీరు కూడా ఈ కేవైసీ చేపించుకోవాల్సిన అవసరం లేదు. మిగిలిన 1,01,648 మంది ఇప్పటివరకు ఈ కేవైసీ చేపించుకోలేదు.వీరు జూన్ 30 తేది లోపు ఈ కేవైసీ చేపిమ్చుకోవాలని ప్రభుత్వం నిర్దేశించింది.
చిత్తూరు జిల్లాలో 5,43,202 తెలుపు రంగు రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో 39,7266 అంత్యోదయ కార్డులు ఉన్నాయి. వీటి సరఫరాకు జిల్లాలో 1,379 రేషన్ షాపులు ఉన్నాయి. ప్రజలకు ప్రతి నెలా 93,04,540 కిలోల బియ్యం, 29,1464 కిలోల చక్కెర, 5,43202 కిలోల పప్పు ధాన్యాలు, 5,41,678 కిలోల గోధుమపిండి సరఫరా చేస్తున్నారు. ప్రతి రేషన్ కార్డులోని సభ్యులకు ఐదు కేజీలు బియ్యం, అంత్యోదయ కార్డుకు 30 కేజీల బియ్యం ఇస్తున్నారు. తెల్ల రేషన్ కార్డులకు అరకేజీ చప్పున చక్కెర ఇస్తున్నారు. ప్రతి కార్డుదారునికి కందిపప్పు ఒక కేజీ, గోధుమపిండి ఒక కేజీ సరఫరా చేస్తున్నారు. రేషన్ కార్డులలో మార్పులు చేర్పులను ప్రభుత్వం గత సంవత్సర కాలంగా నిలుపుదల చేసింది. ఫలితంగా మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు, పెళ్లి అయిన వారు తదితరుల వివరాలు రేషన్ కార్డుల నుంచి తొలగించడానికి అవకాశం లేకుండా పోయింది. దీనికి తోడు నిత్యవసరాలు సరఫరా వ్యయం కూడా పెరగడంతో రేషన్ కార్డులోని కుటుంబ సభ్యులందరూ ఈ కేవైసీ చేపించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తొలిత ఈ గడువును మార్చి 31వ తేదీ వరకు నిర్దేశించింది. అప్పటికి 80 శాతం మాత్రం ఈ కేవైసీ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం మరో నెలపాటు ఈ కేవైసీని పొడిగించింది. ఈ గడువు ఏప్రిల్ నెలలతో ముగిసింది. దీంతో ఈ కేవైసీ చేయించుకోక పోయిన కార్డుదారులకు రేషన్ కట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చిత్తూరు జిల్లాలో 1,01,648 మంది ఈ కేవైసీ చేపింకోలేదు. దీంతో రేషన్ మేనెల నుంచి కట్ చేయాలని తొలుత ప్రభుత్వం నిర్ణయించింది. అలా చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఈ కేవైసీ గడువును మరో రెండు నెలలు పొడిగించింది. అత్యధికంగా కుప్పం మండలంలో 9,595 మంది ఈ కేవైసీ చేపించుకోలేదు విజయపురం మండలంలో 1455 మందికి, నిండ్ర మండలంలో 1159, రొంపిచర్ల మండలంలో 1271, పుంగనూరులో 6367, చౌడేపల్లిలో 2631, సోమలలో 2106, సదంలో 1318, రొంపిచర్లలో 1657, వెదురుకుప్పంలో 2463, నగిరి మండలంలో 4903 మంది ఈ కేవైసీ చేపించుకోలేదు. కార్వేటి నగరం మండలంలో 1820, ఎస్ ఆర్ పురం మండలంలో 1791, పాలసముద్రం మండలంలో 1208, గంగాధర నెల్లూరు మండలంలో 2987, పెనుమూరు మండలంలో 1612, పూతలపట్టులో 1750 ఐరాల మండలంలో 1998, తవణంపల్లి మండలంలో 1863, చిత్తూరు మండలంలో 7905, గుడిపాలలో 2234, యాదమరిలో 2315 మంది ఈ కేవైసీకి దూరంగా ఉన్నారు. అలాగే బంగారుపాలెం మండల 2910, పలమనేరులో 5426, గంగవరంలో 3741, పెద్ద పంజానిలో 3246, బైరెడ్డిపల్లి లో 4246, వి కోటలో 7501, రామకుప్పంలో 4132, శాంతిపురంలో 4438, గుడిపల్లిలో 3600 మంది ఈ కేవైసీ చేపించుకోలేదు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. జూన్ 30 లోపు చేపించుకోవచ్చును. వినియోగదారులు కార్డు అడ్రస్ ఉన్న రేషన్ షాపులో మాత్రమే ఈ కేవైసీ చేపించుకోవాలని నిబంధన లేదు. వాళ్లు ఎక్కడ ఉన్న సమీపంలోని రేషన్ షాపులో ఈ కేవైసీ చేపించుకోవచ్చును. అలాగే ఇంటింటికి రేషన్ సరుకులు సరఫరా చేస్తే వాహనాల వద్ద కూడా ఈ కేవైసీ చేయించుకోవచ్చు. దూర ప్రాంతాల్లో ఉన్నవారు తమ ఊరికి రానవసరం లేదనీ, అక్కడే డీలర్ వద్ద ఈ కేవైసీ సేవించుకోవచ్చునని జిల్లా పౌరసరఫరాల అధికారి శంకర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం
కొత్తగా రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. అలాగే రేషన్ కార్డులలో మార్పులు, చేర్పులకు శ్రీకారం చుట్టింది. చిరునామా మార్పులను కూడా అనుమతించనున్నారు. సంవత్సరం తర్వాత ప్రభుత్వం రేషన్ కార్డులలో మార్పులు చేర్పులకు అవకాశం ఇవ్వడంతో ప్రజలు వార్డు, గ్రామ సచివాలయాలకు క్యూ కడుతున్నారు.
పో రై గంగ 2 రేషన్ షాప్, రేషన్ కార్డులు

