17, మే 2025, శనివారం

వర్షాలు, ఈదురు గాలులతో రాలిపోతున్న మామిడి రైతుల ఆశలు

 రెండు వారాలుగా జిల్లాలో అకాల వర్షం, ఈదురు గాలుల

రానున్న రెండు వారాలలో తుఫాను కారణంగా జిల్లాలో భారీ వర్షాలు ఈదురుగాలు 

ఇప్పటికే భారీగా నేల రాలిన మామిడికాయలు 

తుఫాను ప్రభావంతో ఉన్న కాయలు రాలిపోయే ప్రమాదం 

కిలో మూడు రూపాయల పలుకుతున్న రాలిన మామిడి

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ. 

మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లుగా జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి తయారయ్యింది. ఈ సంవత్సరం ఒకవైపు పంట పూర్తిగా రాలేదు. సగం మాత్రమే పంట చేతికి వచ్చే పరిస్థితి కూడా లేదు.  దీనికి తోడు జిల్లాలో పడుతున్న అకాల వర్షాలు, ఈదురు గాలుల కారణంగా మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లాలో గత రెండు వారాలుగా వర్షాలు పడుతున్నాయి. దీనికి తోడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి వారం రోజులపాటు జిల్లాలో జోరుగా వర్షాలు పడనున్నాయి. ఫలితంగా జిల్లాలో మామిడి, అరటి, బొప్పాయి రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గాలి వానల కారణంగా ఇప్పటికే మామిడికాయలు చాలావరకు రాలిపోయాయి. రాలిపోయిన మామిడిని కొనుగోలు చేయడానికి వ్యాపారస్తులు ఎవరు ముందుకు రావడం లేదు. ఫలితంగా చాలా మంది రైతులు రాలిపోయిన మామిడి తోటలోనే వదిలేస్తున్నారు. 


చిత్తూరు జిల్లాలో లక్షా50 వేల ఎకరాలలో మామిడి తోటలో ఉన్నాయి. సక్రమంగా పూర్తిస్థాయిలో కాపు వస్తే చిత్తూరు జిల్లాలో సుమారు పది లక్షల టన్నుల మామిడి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అయితే గత సంవత్సరం మామిడి పంట గణనయంగా తగ్గింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వాతావరణం అనుకూలించకపోవడంతో మామిడి పూత సుమారు రెండు నెలలు ఆలస్యంగా వచ్చింది. దీంతో జిల్లాలో సగం పంట కూడా రావడం అనుమానంగా తయారయింది. దీనికి తోడు జిల్లాలో దంచి కొడుతున్న అకాల వర్షాలు, ఈదురు గార్ల కారణంగా మామిడి రైతులు భారీగా నష్టపోతున్నారు. చిత్తూరు జిల్లాలో గత రెండు వారాలుగా వర్షాలు పడుతున్నాయి. జిల్లాలో రెండవ తారీఖున 28 మిల్లీమీటర్లు, మూడో తారీఖున 177 మిల్లీమీటర్లు, నాలుగో తారీఖున 47 మిల్లీమీటర్లు, ఐదో తారీఖున 96 మిల్లీమీటర్లు, ఆరవ తారీఖున 73, 7వ తేదీన 403 మిల్లీమీటర్లు, 8వ తేదీన 228 మిల్లీమీటర్లు, 9వ తారీఖున 242, పడవ తేదిన 300 మిల్లీమీటర్లు వవర్షపాతం నమోదయింది. 12వ తారీకున 197 మిల్లీమీటర్ల, 13వ తారీఖున 9.2, 14 వ తారీఖున 9.2, 15వ తారీఖున 248, 16వ తారీఖున 254, 17వ తారీఖున 380 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.  భారీ వర్షాలు, ఈదురు గాలుల కారణంగా జిల్లాలో భారీ ఎత్తున మామిడికాయలు నేల రాలాయి. తొలుత నేలరాలిన మామిడికి కిలోకు  వ్యాపారస్తులు ఐదు రూపాయల వరకు ధరను చెల్లించారు. గత మూడు రోజులుగా పడిన భారీ వర్షాల కారణంగా రాలిన మామిడిని తీసుకోవడానికి వ్యాపారస్తులెవరు ముందుకు రావడం లేదు. దీంతో మూడు రూపాయలు మాత్రమే పలుకుతోంది. దీంతో రైతులు మామిడి తోటలోని మామిడిని కూడా ఏరడం లేదు. కూలి కూడా గిట్టుబాటు కాకపోవడంతో నేలరాలిన మామిడిని అలాగే వదిలి వస్తున్నారు దీనికి తోడు నైరుతీ రుతుపవనాలు జోరుమీదున్నాయి. నైరుతీ రుతుపవనాలు దూసుకువచ్చేందుకు అనుకూలమైన వాతావరణం ఉందని భారత వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇప్పుడు నైరుతీ రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాతాలకు రానున్నాయి.  శ్రీలంక కింద ప్రాంతం, మాల్దీవులు, బంగాళాఖాతం దక్షిణ ప్రాంతం, అండమాన్ దీవులు, అండమాన్ సముద్రం అంతటా నైరుతీ రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. రానున్న రెండు మూడు రోజుల్లో ఇవి మధ్య బంగాళాకాతంలోకి కూడా వస్తాయని ఐఎండీ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక ఆవర్తనం ఉండటంతో మేఘాలు సముద్ర మట్టం నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తులో మొదలై 5.8 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నాయి. అలాగే మరో ఆవర్తనం మధ్య బంగాళాఖాతంలో ఏర్పడింది. ఇది కోస్తాంధ్రకు దగ్గరలోనే ఉంది. దీని వల్ల సముద్ర మట్టం నుంచి 1.5కిలోమీటర్ల ఎత్తులో మేఘాటు, గాలులు గుండ్రంగా తిరుగుతున్నాయి. ఈ ఆవర్తనం త్వరలో అల్పపీడనంగా మారి తర్వాత తుపానుగా మారుతుందని అంచనా వేస్తున్నారు. దీనికి  శక్తి అనే పేరును కూడా పెట్టారు. ఈ శక్తి తుపాన్ వచ్చే రెండు వారాలపాటూ ప్రభావం చూపిస్తుందని అంచనా వేసింది. ఇక వచ్చే వారం రోజులపాటు ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురుస్తాయి. ఉరుములు, మెరుపులు, పిడుగులు పడతాయి .పిడుగుల శబ్దం చాలా ఎక్కువగా ఉంటుంది. గాలి వేగం గంటకు 30 నుంచి 50కిలోమీటర్లు ఉంటుంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో గాలుల వేగం ఎక్కువగా ఉంటుంది. గంటకు 50 నుంచి 60కిలోమీటర్లు ఒక్కోసారి గంటకు 70 కిలోమీటర్ల వరకు ఉంటుందని ఐఎండీ తెలిపింది. రాయలసీమలో 19, 20 తేదీల్లో కూడా భయంకర ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. ఏపీలోనూ రోజంతా మేఘాలు ఉంటాయి. మధ్యాహ్నం 3 తర్వాత తిరుపతి, చిత్తూరు ప్రాంతాల్లో వాన షురూ అవుతుంది. అది అంతకంతకూ పెరుగుతుంది. రాయలసీమలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. అలా రాత్రి మొత్తం కురుస్తూనే ఉంటుంది. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల వరకు రాయలసీమలో వాన పడుతూనే ఉంటుంది. ఉత్తరాంధ్ర నేడు సాయంత్రం 4గంటలకు వర్షం మొదలై భారీ వర్షంగా మారుతుంది. రాత్రి 8గంటల వరకు కురుస్తుంది. కావున రానున్న రెండు వారలు జిల్లాలో భారీ వర్షాలు, ఎదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఇదే జరిగితే, ఈ సంవత్సరం మామిడి పంటకు ఉహించని నష్టం జరగనుంది. కాయలు పూర్తిగా నేల రాలే ప్రమాదం ఉంది.

గంగ 1 మామిడి చెట్లు 

గంగ 2 నేల రాలిన మామిడి 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *