20, మే 2025, మంగళవారం

భారీ వర్షాలకు నేల రాలుతున్న మామిడి

అక్కరకు రాని మామిడి భీమా పథకం 

నష్టపరిహారం కోసం రైతన్నల వినతి 


చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం కొత్తగా తీసుకున వచ్చిన మామిడి బీమా పథకం మామిడి రైతులను ఆదుకోవడం లేదు. బీమా పథకంలో ఉన్న నిబంధనల కారణంగా భారీ వర్షాలు కారణంగా నష్టపోయిన రైతులకు బీమా అందే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో బీమా కట్టిన తమకు నష్టపరిహారం అందకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. నిబంధనల ప్రకారం వాతావరణంలో మార్పుల ఆధారంగా మామిడి బీమా పథకాన్ని రూపొందించారు. ఇందులో భారీ వర్షాల కారణంగా మామిడి నేల రాలితే బీమా వర్తించదు. అలాగే అక్కడక్కడ మామిడి చెట్లు విరిగి కిందపడినా, బీమా సౌకర్యం వర్తించే అవకాశం లేదు. ఒక ఎకరాలో కనీసం 24 మామిడి చెట్లు విరిగి కింద పడిపోతే, అప్పుడు రైతులకు బీమా వర్తిస్తుందని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో భీమా చెల్లించినా తమకు నష్టపరిహారం అందే అవకాశము లేకపోవడంతో జిల్లాలోని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.  సాధారణంగా మే నెలలో జిల్లాలో 140 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్చిఉంది. అయితే, అకాల వర్షాలు, తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే 3876 మిల్లీమీటర్ల వర్షం పడింది. మళ్ళి జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి.


దీంతో జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యింది. ఈ సంవత్సరం ఒకవైపు పంట పూర్తిగా రాలేదు. సగం మాత్రమే పంట చేతికి వచ్చే పరిస్థితి.  దీనికి తోడు జిల్లాలో పడుతున్న అకాల వర్షాలు, ఈదురు గాలుల కారణంగా మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లాలో గత మూడు వారాలుగా వర్షాలు పడుతున్నాయి. దీనికి తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన  అల్పపీడనం కారణంగా మళ్ళి వర్షాలు ప్రారంభం అయ్యాయి. వారం రోజులపాటు జిల్లాలో జోరుగా వర్షాలు పడనున్నాయి. ఫలితంగా జిల్లాలో మామిడి, అరటి, బొప్పాయి రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గాలి, వానల కారణంగా ఇప్పటికే మామిడికాయలు చాలావరకు రాలిపోయాయి. రాలిపోయిన మామిడిని కొనుగోలు చేయడానికి వ్యాపారస్తులు ఎవరు ముందుకు రావడం లేదు. ఫలితంగా చాలా మంది రైతులు రాలిపోయిన మామిడి తోటలోనే వదిలేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో లక్షా50 వేల ఎకరాలలో మామిడి తోటలో ఉన్నాయి. సక్రమంగా పూర్తిస్థాయిలో కాపు వస్తే చిత్తూరు జిల్లాలో సుమారు పది లక్షల టన్నుల మామిడి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అయితే గత సంవత్సరం మామిడి పంట గణనయంగా తగ్గింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వాతావరణం అనుకూలించకపోవడంతో మామిడి పూత సుమారు రెండు నెలలు ఆలస్యంగా వచ్చింది. దీంతో జిల్లాలో సగం పంట కూడా రావడం అనుమానంగా తయారయింది. దీనికి తోడు జిల్లాలో దంచి కొడుతున్న అకాల వర్షాలు, ఈదురు గార్ల కారణంగా మామిడి రైతులు భారీగా నష్టపోతున్నారు. చిత్తూరు జిల్లాలో గత రెండు వారాలుగా వర్షాలు పడుతున్నాయి. జిల్లాలో రెండవ తారీఖున 28 మిల్లీమీటర్లు, మూడో తారీఖున 177 మిల్లీమీటర్లు, నాలుగో తారీఖున 47 మిల్లీమీటర్లు, ఐదో తారీఖున 96 మిల్లీమీటర్లు, ఆరవ తారీఖున 73, 7వ తేదీన 403 మిల్లీమీటర్లు, 8వ తేదీన 228 మిల్లీమీటర్లు, 9వ తారీఖున 242, పడవ తేదిన 300 మిల్లీమీటర్లు వవర్షపాతం నమోదయింది. 12వ తారీకున 197 మిల్లీమీటర్ల, 13వ తారీఖున 9.2, 14 వ తారీఖున 9.2, 15వ తారీఖున 248, 16వ తారీఖున 254, 17వ తారీఖున 380, 18న 436, 19న 472, 20వ తారీఖున 175  మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.  భారీ వర్షాలు, ఈదురు గాలుల కారణంగా జిల్లాలో భారీ ఎత్తున మామిడికాయలు నేల రాలాయి. తొలుత నేలరాలిన మామిడికి కిలోకు వ్యాపారస్తులు ఐదు రూపాయల వరకు ధరను చెల్లించారు. గత మూడు రోజులుగా పడిన భారీ వర్షాల కారణంగా రాలిన మామిడిని తీసుకోవడానికి వ్యాపారస్తులెవరు ముందుకు రావడం లేదు. దీంతో మూడు రూపాయలు మాత్రమే పలుకుతోంది. దీంతో రైతులు మామిడి తోటలోని మామిడిని కూడా ఏరడం లేదు. కూలి కూడా గిట్టుబాటు కాకపోవడంతో నేలరాలిన మామిడిని అలాగే వదిలి వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మామిడి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. 

పో రై గంగ 1 భారీ వర్షాలకు నేలరాలిన మామిడి 

గంగ 2 విరిగిపడిన మామిడి చెట్లు 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *