14, మే 2025, బుధవారం

అధికార పదవులకు దూరంగా అధికార ప్రతినిధులు !

గత ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతి, అక్రమాలను ఎండగట్టారు.

టీవీ డిబేట్లు, విలేకరుల సమావేశాలతో ప్రజలలో చైతన్యం తెచ్చారు 

పార్టీ వైఖరిని, పధకాలను ప్రల్లోకి తీసుకెళ్ళారు.

అయినా, నామినేటెడ్ పోస్టులలో మొండిచేయి 


చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.

తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ఆ పార్టీకి చెందిన అధికార ప్రతినిధులు పాత్ర చాలా ఉంది. వీరు గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలలో ఎండగట్టి, తమ పార్టీ సిద్ధాంతాలను, పార్టీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఎంతో శ్రమించారు.  కొందరు అధికార ప్రతినిధులకు ఇతర పార్టీల నేతల నుంచి ముప్పు ఉన్నా, లెక్కచేయకుండా పార్టీని భుజాల మీద వేసుకుని మోశారు. వైసిపి నేతల అవినీతి, అక్రమాలను ఎండకట్టి, పార్టీని పటిష్టం చేశారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. టీవీ ఛానల్లో, డిబేట్లు ద్వారా పత్రికా విలేకరుల సమావేశాల ద్వారా పార్టీ పటిష్టతకు కృషి చేశారు. పార్టీ సిద్ధాంతాలకు, పధకాలకుప్రచారం కల్పించడానికి ఎంతో కృషి చేశారు. పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ఎంతో శ్రమించారు. అటువంటి అధికార ప్రతినిధులకు  చిత్తూరు జిల్లాలో  ఒకరికి కూడా నామినేటెడ్ పదవులు దక్కలేదు. జిల్లాలో ఉన్న నలుగురు అధికార ప్రతినిధులలో  ఒకరికి కూడా అవకాశం ఇవ్వలేదు. వైసిపిలో అధికార ప్రతినిధులకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రి పదవులు ఇచ్చారు. టిడిపిలో కనీసం నామినేటెడ్ పదవికూడా దక్కలేదు. 


పెనుమూరుకు చెందిన డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి 2020 నుంచి అధికార ప్రతినిధిగా ఉన్నారు. అందరూ భయపడే రోజుల్లో నా పేరే నాటు బాంబుల సుధాకర్ రెడ్డి, నేను ఒరిజినల్ రెడ్డిని అంటూ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి సవాలు విసిరారు. అప్పటి జిల్లా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, కె నారాయణ స్వామి, ఆర్ కె రోజాపై తీవ్రస్థాయిలో విమర్శలు సంధించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవి ఆశించి భంగ పడ్డారు. ఇప్పుడు కనీసం నామినేటెడ్ పదవి కూడా దక్కక పోవడంతో బాధపడుతున్నట్టు తెలిసింది. పూతలపట్టు నియోజక వర్గానికి చెందిన డాక్టర్ సప్తగిరి ప్రసాద్ ( ఎస్సీ) విద్యార్ది దశ నుంచి టీడీపీలో ఉన్నారు. వివిధ హోదాల్లో పార్టీకి పనిచేశారు. 2020 నుంచి అధికార ప్రతినిధిగా ఉన్నారు. గతంలో పౌరసరఫరాల కార్పొరేషన్ డైరెక్టర్ గా పనిచేశారు. ప్రజల సమస్యల మీద నిత్యం జిల్లా అధికారులను కలిసి వినతి పత్రాలు సమర్పిస్తూ ఉంటారు. ఆయన కూడా వైసిపి రాష్ట్ర, జిల్లా నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో పూతలపట్టు టికెట్టు ఆశించారు. అయినా కనీసం నామినేటెడ్ పదవి కూడా దక్కక పోవడంతో నిరాశకు గురవుతున్నారని సమాచారం. కుప్పంకు చెందిన గౌనివారి శ్రీనివాసులు గత ఐదేళ్లుగా అధికార ప్రతినిధిగా ఉన్నారు. గతంలో ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు, టిటిడి బోర్డు సభ్యుడు పదవులను నిర్వహించారు. గత ప్రభుత్వం అయన మీద తప్పుడు కేసులు బనాయించడంతో జైలుకు కూడా వెళ్లివచ్చారు.  ఈ సారి కూడా మంచి పదవి వస్తుందని ఆశిస్తున్నారు. చిత్తూరులో నివాసం ఉన్న న్యాయవాది సురేంద్ర కుమార్ ( కమ్మ)ను ఎన్నికల ముందు అధికార ప్రతినిధిగా నియమించారు. అంతకు ఆయన రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. తొలి నుంచి టిడిపిలో ఉన్న ఆయనకు చంద్రబాబుతో బంధుత్వం కూడా ఉంది. ఆయన రాష్ట్ర స్థాయి పదవి ఆశిస్తున్నారు.ఇటీవల ఆయన భార్య మోహన కుమారిని  చిత్తూరు కోర్టులో ఎపీపీ గా నియమించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 101 కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చినప్పటికీ చిత్తూరు జిల్లాకు తగిన ప్రాతినిధ్యం దక్కలేదు. గత ఆదివారం కుప్పంకు చెందిన ఎస్ రాజశేఖర్ ను ఆంధ్రప్రదేశ్ విద్యా, సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి కార్పోరేషన్ చైర్మన్ గా నియమించారు. మొదటి విడతలో కుప్పంకే చెందిన మునిరత్నంకు ఆర్టీసీ వైస్ చైర్మన్ పదవి ఇచ్చారు. చిత్తూరు పార్లమెంటు అధ్యక్షునిగా ఉన్న సి ఎస్ రాజన్ వన్నె కుల క్షత్రియ కార్పోరేషన్ చైర్మన్ ఇచ్చారు. అయితే ఆయన తిరుపతి జిల్లాకు చెందిన వారు. టిటిడి బోర్డు ఛైర్మన్ పెనుమూరు మండలంలో పుట్టినప్పటికీ హైదరాబాదులో నివసిస్తున్నారు. కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ గా నియమితులు అయిన అమాస రాజశేఖర్ రెడ్డి తిరుపతి జిల్లా వడమాలపేట మండలానికి చెందిన వ్యక్తి. తిరుపతి నగరంలోనే ఆరుగురికి రాష్ట్ర స్థాయి పదవులు ఇచ్చారు. అయితే చంద్రబాబు నాయుడు స్వంత జిల్లా అయిన చిత్తూరుకు తగిన ప్రాధాన్యత దక్కక పోవడం పట్ల కార్యకర్తల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. చిత్తూరు పట్టణంలోని నాయకులకు కూడా పదవులు దక్కలేదు. ఎన్నికలలలో పార్టీ విజయం కోసం పనిచేసినా, కష్ట కాలంలో పార్టీకి అండగా నిలచిన నాయకులు ఆవేదనకు గురవుతున్నారు. ఈ నెలాఖరు లోగా నియమించే కార్పొరేట్ పదవుల్లో ఒకటి రెండు అయినా జిల్లాకు దక్కుతాయని భావిస్తున్నారు.

పో రై గంగ 1 ఎన్ బి సుధాకర్ రెడ్డి,  గంగ 2 సప్తగిరి ప్రసాద్, గంగ 3 సురేంద్ర కుమార్, గంగ 4 గౌనివారి శ్రీనివాసులు 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *