8, మే 2025, గురువారం

ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన కుమార్తె మృతి



తిరుపతి రుయా ఆస్పత్రిలో జరిగిన విచారణ కమిటీ ముందు మృతురాలి తండ్రి షణ్ముగం ఆవేదన


చిత్తూరు, మే 8 (ఆంధ్రప్రభ బ్యూరో) : చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్య కారణంగానే తన కుమార్తె దుర్గ మృతి చెందిందని చిత్తూర్ టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ షణ్ముగం తెలిపారు. చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ మహిళా కార్యదర్శి  దుర్గ మరణంపై గురువారం తిరుపతి రుయా హాస్పిటల్స్ సూపరింటెండెంట్ రవి ప్రభు అధ్యక్షతన విచారణ జరిగింది. ఈ విచారణకు తగు ఆధారాలతో విచారణ కమిటీ ముందు దుర్గ తండ్రి మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ పి. షణ్ముగం హాజరయ్యారు. విచారణలో నలుగురు ఎక్స్పర్ట్స్ కమిటీ దాదాపు 1.40 నిమిషాలు సుదీర్ఘముగా కమిటీ అడిగిన ప్రశ్నలకు ఆధారాలతో సహా వివరించారు. తన కుమార్తె 21వ తారీఖున ద్విచక్ర వాహనం మీద వెళ్తూ ప్రమాదానికి గురైందన్నారు. వెంటనే చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వెళ్ళగా, తలకు తగిలిన బలమైన గాయం గురించి పట్టించుకోలేదన్నారు. నామమాత్రంగా చికిత్స చేసి ఇంటికి పంపారని వివరించారు. 22వ తారీఖున రాత్రి తన కుమార్తె అపస్మార్క స్థితికి వెళ్లిపోయిందని వెంటనే మళ్ళీ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వచ్చామన్నారు. ఆమె మరణించినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పోస్టుమార్టం రిపోర్టులో తలకు బలమైన గాయం తగలడం వల్ల దుర్గ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించిన విషయాన్ని కమిటీ దృష్టికి తీసుకుని వచ్చారు. అపోలో హాస్పిటల్ ఇంచార్జ్ నరేష్ కుమార్ రెడ్డి, డాక్టర్లు డాక్టర్లు తనతో ఫోన్లో మాట్లాడిన సంభాషణలు కూడా పెన్ డ్రైవ్ లో వేసి కమిటీకి వినిపించారు. అపోలో ఆసుపత్రి ఇన్చార్జి నరేష్ కుమార్ రెడ్డి దుర్గ చకిత్సకు సంబంధించిన రికార్డులను కమిటీ ముందు ఉంచారు.  చిత్తూరు మాజీ కార్పొరేటర్ కందా, జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహిళా ప్రధాన కార్యదర్శి సుగుణవతి యాదవ్, బీసీ సంఘర్షణ సమితి అధ్యక్షులు అక్కినపల్లి లక్ష్మయ్య, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు, జోష్ ప్రాపర్టీస్ అధినేత ఈశ్వర ప్రకాష్, బీసీ నాయకులు అశోక్, సుధా, గంధం బాబు, రాజయ్య, తదితరులు విచారణ కమిటీ ముందు హాజరయ్యారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న చికిత్స తీరుతనులను కమిటీకి వివరించారు. కమిటీ కోరిక మేరకు హాజరైన వారు తమ అభిప్రాయాలను లిఖితపూర్వకంగా కమిటీ చైర్మన్  రుయా హాస్పిటల్ సూపరెండెంట్, కమిటీ సభ్యులకు అందజేశారు. విచారణ అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ దుర్గ మృతిపై ఆధారాలు పూర్తిగా రికార్డు చేశామని, నిష్పక్షపాతముగా నివేదికను జిల్లా కలెక్టర్ కు పంపుతామని తెలిపారు.

పో రై గంగ 1 టిడిపి మహిళా నాయకురాలు దుర్గ మృతిపై తిరుపతి రూరల్ లో జరిగిన విచారణ కాదరైన తండ్రి, ఇతర నాయకులు





అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *