13, మే 2025, మంగళవారం

చిత్తూరు నడి వీధి గంగమ్మ జాతరకు 500 మందితో పటిష్ట బందోబస్త్

24/7 జాతర ప్రాంతాలలో  సి.సి.కెమెరాల ద్వార నిరంతరం పర్యవేక్షణ 

జాతర కోసం ప్రత్యేకంగా  ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు.

పిక్ పాకెటింగ్ లాంటివి జరగకుండా ప్రతి ఒక్కరి పై నిఘా ఉంచాలి.

జిల్లా ఎస్పీ  మణికంఠ చందోలు

 చిత్తూరు పట్టణంలోని బజారు వీధిలో మంగళవారం నుండి జరగనున్న నడివీధి గంగమ్మ జాతరకు సంబంధించిన ప్రాంతాలను జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆలయ ధర్మకర్త  సతీమని సి.కె.లావణ్య,అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్  ఇంచార్జ్ అడ్మిన్  ఎస్.ఆర్.రాజశేఖర రాజుతో కలిసి పరిశీలించారు. చర్చి వీధి, బజార్ వీధి, శివాలయం వీధి, డీజే నిర్వహిస్తున్న మ్యాక్స్ షోరూం, అమ్మవారిని నిమజ్జనం చేస్తున్న ప్రాంతాలన్నీ పరిశీలించారు. ఈ సందర్బముగా జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు మాట్లాడుతూ ప్రతి ఏటా చిత్తూరు పట్టణములో గంగమ్మ జాతర ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా జాతరకు తగిన పోలీస్ సిబ్బందితో పాటు, అదనపు బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ నియంత్రణలో బాగంగా జాతర నిర్వహించే ప్రదేశాలలో ట్రాఫిక్ మళ్లింపు చేసామని తెలిపారు. పిక్ పాకెటింగ్, ఆకతాయిల వెకిలి చేష్టల నివారణకు నిష్ణాతులైన క్రైమ్ సిబ్బందితో ప్రత్యేక క్రైమ్ బృందాలు ఏర్పాటు చేసి నిరంతరం నిఘా ఉంచుతామని పేర్కొన్నారు. జాతర సమయంలో ఎటువంటి చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడకుండా శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా జాతర సజావుగా జరిగేల సహకరించాలని పట్టణ ప్రజలను కోరారు. అనంతరం చిత్తూరు సాయుధ దళ పెరేడ్ గ్రౌండ్ నందు బందోబస్తు నిర్వహించే పోలీసు అధికారులు మరియు సిబ్బందికి పలు సలహాలు సూచనలు చేసారు. గంగమ్మ జాతర ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారని, ఈ జాతరకు జనసందోహం ఎక్కువగా ఉంటుందని కావున విధులు నిర్వహించే ప్రతి ఒక్కరు శ్రద్ధగా తమకు కేటాయించిన డ్యూటీ ని చెయ్యాలని ఎక్కడ అలసత్వం వహించాకుడదని అన్నారు.. ప్రజలకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ నియంత్రణలో బాగంగా ప్రజలకు సహాయపడాలని తెలిపారు. పోలింగ్ ప్రక్రియ ముగిసి కౌంటింగ్ కు దగ్గర పడుతున్న తరుణంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఏదైనా గొడవ లేదా శాంతి భద్రతలకు భంగం వస్తుందేమో అని అనుమానం ఉంటే వెంటనే పై అధికారులకు తెలియజేసి, అదనపు సిబ్బంది వచ్చే వరకు అక్కడి పరిస్థితిని అదుపులో ఉంచాలని కోరారు. జాతర సమయం కనుక రద్దీ ఎక్కువ ఉంటుందని,  కావునపిక్ పాకెటింగ్ కు అవకాశం ఉండొచ్చునని అభిప్రాయపడ్డారు. కాబట్టి తమ విధి నిర్వహిస్తూనే అలాంటి వారిని గమనిస్తూ ఉండాలని, ఎవరికైన ఏదైనా సమస్య ఉన్నా వెంటనే అధికారులకు తెలియజేయాలని చెప్పారు. అందరు తమకి కేటాయించిన డ్యూటీ ని చక్కగా నిర్వహించి జాతరను ప్రశాంత వాతావరణంలో ముగిసేల చేయాలని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్, ఇంచార్జ్ అడ్మిన్ ఎస్.ఆర్.రాజశేఖర రాజు, ఏ.ఆర్.అడిషనల్ ఎస్పీ  శివానంద కిషోర్, చిత్తూరు సబ్-డివిజన్ డిఎస్పీ  టి.సాయినాథ్, నగరి డి.ఎస్పీ  సయ్యద్ మొహమ్మద్ అజీజ్, ఏ.ఆర్. డి.ఎస్పీ లు  చిన్ని కృష్ణ,  మహబూబ్ బాష, పట్టణ ఇన్స్పెక్టర్లు, ఎస్.ఐ. లు, బందోబస్త్ సిబ్బంది, జాతర నిర్వాహకులు పాల్గొన్నారు.

పో రై గంగ 1 పొలిసు సిబ్బందికి సూచనలు ఇస్తున్న జిల్లా ఎస్పి 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *