17, మే 2025, శనివారం

మనిషిని నిశ్శబ్ధంగా దెబ్బతీసే అధిక రక్తపోటు

 నష్టం జరిగే వరకు లక్షణాలు కనిపించవు

ప్రతి ముగ్గరిలో ఒకరికి అధిక రక్తపోటు

నేడు ప్రపంచ రక్తపోటు దినోత్సవం

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ. 

ధమనుల గోడలపై రక్త పీడనం చాలా ఎక్కువగా ఉన్నప్పుడు రక్తపోటు సంభవిస్తుంది. దీనిని సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. ఎందుకంటే చాలా మందికి నష్టం జరిగే వరకు రక్తపోటు లక్షణాలు కనిపించవు. చికిత్స చేయకుండా వదిలేస్తే, రక్తపోటు స్ట్రోక్, గుండెపోటు, మూత్రపిండాల వైఫల్యం, మరిన్ని  తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందుకే మీ రక్తపోటును క్రమం తప్పకుండా కొలవడం చాలా ముఖ్యం. అధిక రక్తపోటు చాలా ప్రమాదకరంగా ఉండటానికి ప్రధాన కారణం, దీనిని గుర్తించడం చాలా కష్టం. దీనికి ప్రత్యేకమైన లక్షణాలు అంటూ ఏమీ ఉండదు. అధిక రక్తపోటు ఉన్న చాలా మంది వ్యక్తులు పూర్తిగా బాగానే ఉంటారు.  తమకు అది ఉందని కూడా తెలుచుకోవడం కష్టం. అందుకే  ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి క్రమం తప్పకుండా చెకప్‌లు, రక్తపోటు స్క్రీనింగ్‌లు చాలా ముఖ్యమైనవి.  బాగానే ఉన్నారని భావించి చెకప్‌లను విస్మరిస్తే, ఒక్కొక్క సారి తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులకు గురయ్యే ప్రమాదం ఉంది.


అందుకే అధిక రక్తపోటు లేదా రక్తపోటును సైలెంట్ కిల్లర్ అంటారు. గుండె, మూత్రపిండాలు, మెదడు లేదా రక్త నాళాలలకు గణనీయమైన నష్టం వాటిల్లే వరకు ఇది సాధారణంగా ఎటువంటి లక్షణాలను చూపించదు. అధిక రక్తపోటు కారణంగా గుండె పోటు వంటి ప్రాణాంతక వ్యాధుల వచ్చే ముప్పు పెరుగుతుంది. అందుకే హై బీపీ సమస్యను లైట్‌ తీసుకోకూడదు. అధిక రక్తపోటుకు చికిత్స లేదు.  ఇది దీర్ఘకాలిక వ్యాధి. సరైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి, తగిన మందుల సాయంతో హై బీపీ సమస్యను తగ్గించుకోవచ్చును. రక్తపోటును సైలెంట్ కిల్లర్ అంటారు. ఎందుకంటే తరచుగా దీన్ని లక్షణాలు స్పష్టంగా కనిపించవు. ఇది నెమ్మదిగా శరీరాన్ని దెబ్బతీస్తుంది. అయితే, శరీరంలో కొన్ని సంకేతాలు కనిపించిన వెంటనే అప్రమత్తం అవ్వాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం శరీరంలో బీపీ పెరిగితే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవి కనిపించిన వెంటనే జగర్తపడితే, పెద్ద ప్రమాదాల్ని నుంచి తప్పించుకోవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా, హైపర్ టెన్షన్ 1.2 బిలియన్లకు పైగా ప్రజలను ప్రభావితం చేస్తుంది. గుండె జబ్బులు, స్ట్రోక్, మూత్రపిండాల వైఫల్యం, అకాల మరణానికి ప్రధాన ప్రమాద కారకం. ఒక మన దేశంలో ప్రతి ముగ్గురు పెద్దల్లో ఒకరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. అందుకే ఈ సమస్య రాకముందే చాలా జాగ్రత్త పడాలి. అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి వస్తే, ముఖ్యంగా ఉదయం పూట అది అధిక రక్తపోటుకు సంకేతం కావచ్చు. రక్తపోటు పెరగడం వల్ల, మెదడులోని నరాలపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల తలనొప్పి వస్తుంది. అలాగే, తల తిరుగుతున్నట్లు అనిపించడం లేదా సమతుల్యత కోల్పోవడం కూడా రక్తపోటు లక్షణం కావచ్చు. శరీరంలో బీపీ పెరిగితే సాధారణం కంటే గుండె ఎక్కువగా పనిచేస్తుంది. దీనివల్ల శ్వాస ఆడకపోవడం జరుగుతుంది. ముఖ్యంగా మెట్లు ఎక్కేటప్పుడు, నడిచినా లేదా చిన్న చిన్న పనులు చేసిన వెంటనే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగితే అది రక్తపోటుకు సంకేతం కావచ్చు. రక్తపోటు పెరగడం వల్ల తగినంత ఆక్సిజన్ ఊపిరితిత్తులకు చేరదు. దీనివల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. ఎటువంటి కారణం, గాయం లేదా అనారోగ్యం లేకుండా అకస్మాత్తుగా ముక్కు నుంచి రక్తస్రావం అయితే అప్రమత్తం అవ్వాలి. అది అధిక రక్తపోటుకు సంకేతం కావచ్చు. రక్తపోటు పెరిగినప్పుడు, ముక్కులోని రక్త నాళాలు పగిలి, రక్తస్రావం అవుతుంది. అయితే, ఇది వేడి వల్ల లేదా ఏదైనా వైద్య పరిస్థితి వల్ల కూడా జరగవచ్చు. అందుకే వైద్యుణ్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం అని నిపుణులు అంటున్నారు. అధిక రక్తపోటు కారణంగా శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. ఇది కళ్ళ రక్త నాళాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. దీనివల్ల కంటి చూపు మసకబారడం లేదా కళ్ళ ముందు నల్లటి మచ్చలు ఏర్పడవచ్చు. పెరిగిన రక్తపోటు కారణంగా, గుండె ఎక్కువగా పనిచేయవలసి వస్తుంది. దీని వలన ఛాతీ నొప్పి లేదా బిగుతుగా అనిపించవచ్చు. కొన్నిసార్లు హృదయ స్పందన కూడా వేగంగా ఉండటం లేదా సక్రమంగా లేకపోవడం వంటివి జరుగుతాయి. ఈ లక్షణం అధిక రక్తపోటు మాత్రమే కాదు, గుండెకు సంబంధించిన ఏదైనా ఇతర సమస్య కూడా కావచ్చు. అందుకే ఈ లక్షణాన్ని కూడా నిర్లక్ష్యం చేయకండి. అధిక రక్తపోటు సమయంలో వికారం, వాంతులు లేదా కడుపు నొప్పి వంటి సమస్యలు కనిపిస్తాయి. ఈ లక్షణం తరచుగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మీకు ఎటువంటి అనారోగ్యం లేకుండానే వికారం లేదా వాంతులు అనిపిస్తే, దానిని తీవ్రంగా పరిగణించాలి. అంతేకాకుండా చాలా మందికి గుండెపోటుకు ముందు అజీర్ణం లేదా ఛాతీలో మంటగా అనిపించవచ్చు. అందుకే వైద్యుణ్ని సంప్రదించి తగిన వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఆహారంలో ఉప్పు తగ్గించుకోవడం, సంతృప్త కొవ్వులు తక్కువగా ఉన్న సమతుల్య ఆహారం తీసుకోవాలి. శారీరక శ్రమ, తగినంత హైడ్రేషన్, ఒత్తిడి తగ్గించుకోవడం, ధూమపానం, మద్యపానం మానేయడం వంటివి చేయాలి. ఈ మార్పులు సాధారణ రక్తపోటు ట్రాకింగ్‌తో కలిపి ప్రాణంతాక ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించగలవని వైద్యులు చెపుతున్నారు.

పో రై గంగ 1 రక్తపోటు 






అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *