19, మే 2025, సోమవారం

తవణంపల్లి మండల వైసిపిలో భగ్గుమన్న విభేదాలు

ఉపాధ్యక్ష ఎన్నికకు ఆరుగురు వైసిపి ఎంపీటీసీ సభ్యులు డుమ్మా
నాయకుల తీరుకు నిరసనగా తవణంపల్లి ఎంపీటీసీ గాండ్ల బాబు రాజీనామా 
మండల పరిషత్ ఉపాధ్యక్షురాలుగా ఏకగ్రీవంగా అనసూయమ్మ ఎన్నిక 


చిత్తూరు బ్యూరో ఆంధ్రప్రభ


తవణంపల్లి మండల పరిషత్ ఉపాధ్యక్ష ఎన్నిక సందర్భంగా మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. మండల పార్టీ రెండుగా చిలిపోయింది. ఒక వర్గం ఉపాధ్యక్ష ఎన్నికను బహిష్కరించింది. ఒక ఎంపీటీసీ తన పదవికి రాజీనామా చేశారు. అయినా క్వారం ఉండడంతో చెర్లోపల్లి ఎంపీటీసీ సభ్యురాలు అనసూయమ్మ మండల పరిషత్ ఉపాధ్యక్షురాలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

తవణంపల్లి మండల పరిషత్ లో 15 ప్రాదేశిక నియోజకవర్గం ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో 14 ఎంపీటీసీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవస చేసుకోగా, ఒక స్థానంలో మాత్రమే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపొందారు. నెల రోజుల కిందట తవణంపల్లి మండలం పరిషత్ అధ్యక్ష పదవికి ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా ఉన్న పట్నం ప్రతాప్ రెడ్డి మండల పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీంతో ఉపాధ్యక్ష పదవి ఖాళీ అయింది. ఆ పదవికి సోమవారం ఉప ఎన్నిక జరిగింది. ఎన్నికల అధికారిగా జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్ నియమితులయ్యారు. ఎంపీడీవో రాఘవేంద్ర రాజుఆధ్వర్యంలో ఉప ఎన్నిక జరిగింది. మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవికి ముగ్గురు అభ్యర్థులు పోటీపడ్డారు. పుణ్య సముద్రం ఎంపీటీసీ సభ్యుడు డేవిడ్, తవణంపల్లి ఎంపీటీసీ సభ్యుడు గాండ్ల బాబు, చెర్లోపల్లి ఎంపీటీసీ సభ్యురాలు అనసూయమ్మ పోటీపడ్డారు. ఇందులో అనసూయమ్మ అభ్యర్థిత్వాన్ని స్థానిక నాయకులు ఖరారు చేశారు. దీంతో తవణంపల్లి, ఎగువ తవణంపల్లి, దిగువమాఘం, అరగొండ, పట్నం, ఎగువ తడకర  ఎంపీటీసీ సభ్యులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. వీరు మరొక అభ్యర్థిని ప్రతిపాదించారు. వీరి ప్రతిపాదనను నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్, మండల వైసీపీ అధ్యక్షుడు సిద్దంపల్లి హరి రెడ్డి, మండల పరిషత్ అధ్యక్షుడు పట్నం ప్రతాప్ రెడ్డిలు పరిగణలోకి తీసుకోలేదు. దీంతో ఎన్నికలకు వైసీపీకి చెందిన ఆరు మంది ఎంపీటీసీ సభ్యులు గైరాజరయ్యారు. వీరితోపాటు తెలుగుదేశం పార్టీకి చెందిన నల్లిశెట్టిపల్లి ఎంపీటీసీ  సభ్యుడు కూడా సమావేశానికి హాజరు కాలేదు. మొత్తం 15 మంది సభ్యులలో ఏడు మంది గైరాజరయ్యారు. ఎనిమిది మంది సభ్యులు హాజరయ్యారు. ఎన్నికలకు కోరం ఉండడంతో ఎన్నికల అధికారి సుధాకర్ ఎన్నిక ప్రక్రియను ప్రారంభించారు. దీంతో చెర్లపల్లి ఎంపీటీసీ సభ్యురాలు అనసూయమ్మను ఆ పార్టీ ఎంపీటీసీ సభ్యులు ప్రతిపాదించారు. ఆమె నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. పోటీ ఎవరూ లేకపోవడంతో అనసూయమ్మనుమండల పరిషత్ ఉపాధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారుల ప్రకటించారు. మండల పరిషత్ ఉపాధ్యక్షుడుగా అనసూయమ్మ ఎన్నికను వ్యతిరేకిస్తూ తవణంపల్లి ఎంపీటీసీ సభ్యుడు గాండ్ల బాబు తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని ఎంపీడీవో అందజేశారు. మండల పరిషత్ ఉపాధ్యక్షురాలిగా  ఏకగ్రీవంగా ఎన్నికైన అనసూయమ్మను పూతలపట్టు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, ప్రస్తుత పార్టీ ఇంచార్జ్ డాక్టర్ సునీల్ కుమార్  దుశ్సాలువాతొ సత్కరించారు. ఈ ఎన్నికను జయప్రదం చెసిన ప్రతి నాయకుడు కార్యకర్తకు దన్యవాదాలు తెలిపారు. అలాగే పార్టీ సీనియర్ నాయకులు గాంధీ బాబు, మండల ఎం.పి.పి.ప్రతాప్ సుందర్ రాయల్ రెడ్డి, మండల పార్టీ  కన్వీనర్ హరి రెడ్డి, మాజీ ఎంపీపీ హరికృష్ణ రెడ్డి, జెడ్పిటిసి భారతి మధు కుమార్, మండల విప్ ధనుంజయ రెడ్డి, పార్టీ నాయకులు  రవి రెడ్డి, రమణారెడ్డి రాజశేఖర్ రెడ్డి,మధు రెడ్డి, బాబు రెడ్డి, సుఖేష్ రెడ్డి, నియోజకవర్గ డాక్టర్ల విభాగ అధ్యక్షులు మణిరాజ్, మండల ఆర్టిఐ అధ్యక్షులు సబరీష్, బంగారుపాళ్యం మండల యస్.సి.సెల్ , సోషల్ మిడియా అధ్యక్షులు నాగరాజ్,సైలెష్ బాబు, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి అనుబంధ విభాగాల నాయకులు  అనసూయమ్మను అభినందించారు. 

పో రై గంగ1  తవణంపల్లి మండల ఉపాధ్యక్ష పదవికి ఎన్నికల ప్రక్రియను వ్నిర్వహిస్తున్న డిపిఓ సుధాకర్ 
     గంగ 2  మండల ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన అనసూయమ్మను అభినందిస్తున్న మాజీ ఎంఎల్ఎ సునిల్ 
గంగ 3 తన పదవికి రాజీనామా చేస్తున్న తవణంపల్లి ఎంపీటీసీ సభ్యుడు గాండ్ల బాబు

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *