జిల్లాలో 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు షోకాజ్ నోటీసులు
చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఇంటర్ రెండవ సంవత్సరం ఫలితాల్లో పలసముద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాల 97.18 శాతం ఉత్తీర్ణతతో అగ్రస్థానంలో నిలిచింది. నందవనం ప్రభుత్వ జూనియర్ కళాశాల 89.74 శాతం, శాంతిపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల 83.92 శాతం, బొమ్మసముద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాల 82.69 శాతం, పెనుమూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల 80.00 శాతం, సోడం ప్రభుత్వ జూనియర్ కళాశాల 78.95 శాతం, సోమల ఎస్‌కేవీఎన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల 75.34 శాతం ఉత్తీర్ణత సాధించాయి. పూతలపట్టు ప్రభుత్వ జూనియర్ కళాశాల 70.59 శాతం, పుంగనూరు బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల 69.74 శాతం, నాగరి సీఎన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల 67.43 శాతం, కుప్పం వొకేషనల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల 66.44 శాతం, రామకుప్పం ప్రభుత్వ జూనియర్ కళాశాల 65.63 శాతం, నాగరి బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల 65.52 శాతం, నరసింగరాయునిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల 64.15 శాతం, కార్వేటినగరం ప్రభుత్వ జూనియర్ కళాశాల 61.48 శాతం ఫలితాలు నమోదు చేశాయి. చిత్తూరు వొకేషనల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల 55.63 శాతం, చవటగుంట ప్రభుత్వ జూనియర్ కళాశాల 55.56 శాతం, కృష్ణవేణి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల చిత్తూరు 50.95 శాతం, రాళ్లబుడుగూరు శాంతిపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల 50.00 శాతం ఉత్తీర్ణత సాధించాయి. గుడిపల్లె ప్రభుత్వ జూనియర్ కళాశాల 49.44 శాతంసాధించారు.
50శాతం కట్టే తక్కువ పలితాలు
చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో శాంతిపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల 92.59 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలిచింది. నందవనం ప్రభుత్వ జూనియర్ కళాశాల 91.67 శాతం, సోడం ప్రభుత్వ జూనియర్ కళాశాల 89.80 శాతం, పలసముద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాల 87.95 శాతం, పెనుమూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల 87.72 శాతం, సోమల ఎస్‌కేవీఎన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల 86.49 శాతం, చవటగుంట ప్రభుత్వ జూనియర్ కళాశాల 86.07 శాతం, రామకుప్పం ప్రభుత్వ జూనియర్ కళాశాల 83.87 శాతం, పూతలపట్టు ప్రభుత్వ జూనియర్ కళాశాల 83.33 శాతం ఉత్తీర్ణత సాధించాయి. బొమ్మసముద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాల 79.22 శాతం, నరసింగరాయునిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల 76.47 శాతం, నాగరి సీఎన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల 75.48 శాతం, నాగరి బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల 69.03 శాతం, కార్వేటినగరం ప్రభుత్వ జూనియర్ కళాశాల 68.93 శాతం, కుప్పం వొకేషనల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల 68.36 శాతం, పలమనేరు టీకేసీ ప్రభుత్వ జూనియర్ కళాశాల 63.67 శాతం, పుంగనూరు బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల 62.00 శాతం, కృష్ణవేణి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల చిత్తూరు 58.94 శాతం, చిత్తూరు వొకేషనల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల 58.79 శాతం, చౌడేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల 56.25 శాతం, వి.కోట ప్రభుత్వ జూనియర్ కళాశాల 53.97 శాతం, గుడిపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాల 53.70 శాతం, రాళ్లబుడుగూరు శాంతిపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల 52.78 శాతం, పలమనేరు బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల 51.85 శాతం, కుప్పం ఎంఎఫ్‌సీ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల 50.35 శాతం ఉత్తీర్ణత నమోదు చేశాయి.
ఫలితాలు తగ్గిన కళాశాలలు
అలాగే పుంగనూరు బీఆర్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల 47.82 శాతం, బంగారుపాళెం ప్రభుత్వ జూనియర్ కళాశాల 43.95 శాతం, ఐరాల ప్రభుత్వ జూనియర్ కళాశాల 34.57 శాతం, మల్లానూరు కుప్పం ప్రభుత్వ జూనియర్ కళాశాల 33.33 శాతం, చిత్తూరు బీఎస్‌కే ప్రభుత్వ జూనియర్ కళాశాల 30.91 శాతం, పీసీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల చిత్తూరు 30.88 శాతం ఉత్తీర్ణత మాత్రమే నమోదు చేసి తక్కువ ఫలితాలు సాధించిన కళాశాలలుగా నిలిచాయి.

