10, మే 2026, ఆదివారం

రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ఎస్సీ ఎస్టీ కేసు

గన్ మెన్ లను సరెండర్ చేసిన చిత్తూరు ఎమ్మెల్యే 
రాష్ట్ర కార్యాలయం దృష్టికి చిత్తూరు కేసు విషయం 
ఎమ్మెల్యేతో మాట్లాడిన జిల్లా ఇన్చార్జి మంత్రి, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో గురువారం రాత్రి నమోదైన ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కేసు జిల్లాలో రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనతో అధికార పార్టీలో ఉన్న వర్గ విభేదాలకు తెరాతసినట్లు అయింది. చిత్తూరు నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యంగా తన అనుచరులపై కేసు నమోదు కావడాన్ని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తీవ్రంగా పరిగణించారు. ఇందుకు నిరసనగా తనకు ప్రభుత్వం కల్పించిన గన్‌మెన్లను వెనక్కి పంపడం సంచలనంగా మారింది. ప్రభుత్వ భద్రత అవసరం లేదని ఆయన స్పష్టం చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ విషయం రాష్ట్రపతి కార్యాలయం వరకు వెళ్ళింది. చిత్తూరు ఎమ్మెల్యే మండపల్లి రాంప్రసాద్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడినట్లు సమాచారం. 


చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం, ఓ దళిత రిసోర్స్ పర్సన్ (ఆర్టీ)పై దాడి జరిగిందన్న ఆరోపణలతో కేసు నమోదైంది. బాధితురాలు కవిత గత నెల 28న కార్పొరేషన్ కార్యాలయంలోని మెప్పా విభాగంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో కొందరు టీడీపీ కార్యకర్తలు హఠాత్తుగా వచ్చి ఆమె  మీద దాడికి పాల్పడటంతో పాటు బెదిరింపులకు దిగారని ఫిర్యాదులో మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా చిత్తూరు రూరల్‌కు చెందిన 12 మంది టీడీపీ కార్యకర్తలపై వన్ టౌన్ పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రేఖ, మాలి, జగన్, శ్రీనివాసులు, యమునా, రేఖ (మరో వ్యక్తి), వరలక్ష్మి, దుర్గ, రాణి, సుమతి, భవ్యలత, మాధవిలపై కేసు నమోదయింది. మీరు చిత్తూరు ఎమ్మెల్యే జగన్ హన్ నాయుడు అనుచరులుగా తెలుస్తుంది. ఈ ఘటనను తొలుత ఒక ప్రజాప్రతినిధి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అనంతరం కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు ప్రక్రియ పూర్తైంది. అయితే ఒక ప్రజాప్రతినిధి ఫిర్యాదు ఆధారంగా మరొక ప్రజాప్రతినిధి అనుచరులపై కేసు నమోదు కావడం అధికార పార్టీలో అంతర్గత విభేదాలను తీవ్రంగా బయటపెట్టింది. ఈ పరిణామాలపై ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. కేసు నమోదు విధానం, తనకు సరైన సమాచారం ఇవ్వకపోవడం పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనికి నిరసనగా గన్‌మెన్లను వెనక్కి పంపించడం ద్వారా తన వైఖరిని స్పష్టంచేశారు. ఈ చర్యతో జిల్లా రాజకీయాల్లో కలకలం రేగింది. ఈ వ్యవహారంపై జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి మండిప్రసాద్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్యేతో మాట్లాడినట్లు సమాచారం. మరోవైపు ఉమ్మడి జిల్లాకు చెందిన ఒక శాసనసభ్యుడు కూడా ఈ విషయమై ఎమ్మెల్యేతో చర్చించేందుకు ప్రయత్నించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉండగా, ఈ ఘటనకు సంబంధించిన వాస్తవాలపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు ప్రజా ప్రతినిధికి సరైన సమాచారం ఇవ్వలేదని, వక్రీకరించిన సమాచారమే వివాదానికి కారణమైందని చెబుతున్నారు. బాధితురాలు దళిత వర్గానికి చెందినది కాదని, మైనారిటీ వర్గానికి చెందినదని కొందరు వాదిస్తున్నారు. దాడి జరిగినట్లు గాయాల ఆధారాలు లేవన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద ఈ సంఘటన చిత్తూరు రాజకీయాల్లో గణనీయమైన మార్పులకు దారి తీసే సూచనలు కనిపిస్తున్నాయి. అధికార పార్టీలో వర్గ విభేదాలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అంశాన్ని రెండు వర్గాలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. పార్టీ ప్రతిష్టకు ఈ పరిణామాలు దెబ్బతీసే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *