రామన్న స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలి
పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల పిలుపు
చిత్తూరు, జూన్ 9 (ఆంధ్రప్రభ బ్యూరో ) రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాల్చిందిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైయస్ షర్మిల పిలుపునిచ్చారు. సోమవారం చిత్తూరు సమీపంలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్ చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ అధ్యక్షత వహించగా, జిల్లా ఇంచార్జ్ రాంభూపాల్ రెడ్డి, నియోజకవర్గ కన్వీనర్లు, మండల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల మీద పోరాటం చేయాల్సిందిగా సూచించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం మీద ఉద్యమించాల్సిందిగా కోరారు. జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు సమిష్టిగా పనిచేసి పార్టీని పటిష్టం చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికలలో తమ సత్తా చాటాలని కోరారు. అమరావతిని ఒక మీడియా వేశ్యల రాజధానిగా వర్ణించడానికి షర్మిల తప్పుబట్టారు. ఎవరు ఏమనుకున్నా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని స్పష్టం చేశారు. గతంలో ఐదు సంవత్సరాలు రాజధాని లేకుండా పరిపాలన నడిచిందని, ప్రస్తుతం రాజధాని పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. ఈ పరిస్థితుల్లో వైసిపికి చెందిన మీడియా అమరావతిని వేశ్యల రాజధానిగా వర్ణించడం సమంజసం కాదన్నారు. ఇందువల్ల లక్షలాదిమంది మహిళల మనోభావాలు దెబ్బతిన్నాయని, ఇందుకు ఆ పార్టీ, ఆ పత్రిక క్షమాపణలు చెప్పాల్సి ఉందన్నారు. క్షమాపణలు చెప్పడానికి వైఎస్ భారతి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆతీతులు కాదన్నారు. ఎవరైనా తప్పు చేస్తే సరిదిద్దుకోవడం, సారీ చెప్పడం సహజమని, రాజకీయ పార్టీకి చెందిన సాక్షి చానల్ కూడా ఈ సాంప్రదాయాన్ని పాటించాలని సూచించారు. చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కార్యకర్తలు మాట్లాడుతూ జిల్లాలో మూతబడిన పాల డెయిరీ, చక్కెర ఫ్యాక్టరీల పునరుద్ధరణకు కృషి చేయాల్సిందిగా కోరారు. జిల్లాలో మామిడి, చెరకు రైతులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.రీ సర్వే కారణంగా జిల్లాలో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, ఆ విషయం మీద పార్టీ దృష్టిని సాధించాలన్నారు. జిల్లాలో ఉపాధి లేకుండా విద్యావంతులు ఇతర రాష్ట్రాలకు వలసబోతున్నారని, జిల్లాలో హంద్రీ -నీవా, గాలేరు- నగరి ప్రాజెక్టులు పూర్తి కాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీని గ్రామ వార్డు స్థాయి నుంచి పటిష్టం చేయాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలని సూచించారు. తాము వైసీపీ మీదనా, కూటమి ప్రభుత్వం మీదనా? ఎవరు మీద పోరాటం చేయాలో స్పష్టత ఇవ్వాల్సిందిగా కోరారు. సోషల్ మీడియాను వినియోగించడంలో కాంగ్రెస్ పార్టీ వెనుకబడి ఉందని ఈ విషయంలో మండల స్థాయి నుంచి అభివృద్ధి చెందాలన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. పార్టీ నాయకులు పరస్పరం సహకరించుకుంటూ పార్టీ పటిష్టతకు కృషి చేయాల్సిందిగా సూచించారు. జిల్లాలో మామిడి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ విషయం పైన పార్టీ ఆందోళన కార్యక్రమాలను చేపట్టాలన్నారు.
పో రై గంగ 1 జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశం పాల్గొన్న వైయస్ షర్మిల
గంగ 2 సమావేశంలో పాల్గొన్న కార్యకర్తలు
పో రై గంగ 1 జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశం పాల్గొన్న వైయస్ షర్మిల
గంగ 2 సమావేశంలో పాల్గొన్న కార్యకర్తలు

