18, జూన్ 2025, బుధవారం

జిల్లాలో శర వేగంగా అభివృద్ధి కార్యక్రమాల అమలు




చిత్తూరు, జూన్ 18 (ఆంధ్రప్రభ బ్యూరో) :  రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన అనంతరం చిత్తూరు జిల్లా అభివృద్ధి విషయంలో ప్రత్యేక దృష్టిని సాధించారు. జిల్లాలోని వివిధ విభాగాలకు అవసరమైన నిధులు అభివృద్ధి కార్యక్రమాలకు మంజూరు అవుతున్నాయి. జిల్లాలోని శాసనసభ్యులు కూడా జిల్లా అభివృద్ధి పట్ల అంకితభావంతో పనిచేస్తున్నారు. తమ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు ప్రతిపాదనలను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేకున్న చిత్తూరు జిల్లాకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవసరమైన నిధులను విడుదల చేస్తున్నారు. దీంతో జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. చిత్తూరు జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు జోరుగా సాగుతోంది. 

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు చిత్తూరు జిల్లాలో 131.42 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు కార్యరూపం దాల్చాయి. ఇందులో 80.95 కోట్ల రూపాయలతో 816 పనులు పూర్తయి ప్రారంభించుకోవడం జరిగింది. అలాగే జిల్లాలో 50 కోట్ల రూపాయలతో మరో 893 పనులకు శంకుస్థాపనలు జరిగాయి. జిల్లాలో పశుసంవర్ధక శాఖకు సంబంధించిన తొమ్మిది పనులను 40 లక్షల రూపాయలతో పూర్తి చేసి ప్రారంభించారు. జిల్లా నీటిని నిర్వహణ సంస్థ సంబంధించి 265 పనులను 590 లక్షల రూపాయలతో పూర్తి చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సంబంధించి రెండు పనులను 228 లక్షల రూపాయలతో పూర్తి చేశారు. రహదారులు భవనాలకు సంబంధించిన ఒక పనిని 649 లక్షలతో పూర్తి చేశారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఆరు పనులు 13 లక్షల రూపాయలతో పూర్తయ్యాయి. జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగానికి సంబంధించి 249 పనులు 12 కోట్ల రూపాయలతో పూర్తి చేశారు. విద్యాశాఖకు సంబంధించి 11 భవనాలను 191 లక్షల రూపాయలతో పూర్తిచేసి ప్రారంభించారు. జిల్లాలో పశుసంవర్ధక శాఖ సంబంధించి పది పనులను ఐదు లక్షల రూపాయలతో శంకుస్థాపన చేశారు. జిల్లా నీట నిర్వహణ సంస్థకు సంబంధించి 267 పనులకు  5.5 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేశారు. పంచాయతీరాజ్ విభాగానికి సంబంధించి 344 పనులను 50 లక్షల రూపాయలతో శంకుస్థాపనలు జరిగింది. జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగానికి సంబంధించి 252 పనులకు 89 లక్షల రూపాయలతో శంకుస్థాపనలు జరిగింది. వీటికి తోడుగా నియోజకవర్గ స్థాయిలో విజన్ ప్రణాళికలను రూపొందించారు. ఈ విజన్ ప్రణాళిక అమలకు నియోజకవర్గస్థాయిలో సంబంధిత ఎమ్మెల్యే చైర్మన్ గా కమిటీని ఏర్పాటు చేశారు. ఈ విజన్ డాక్యుమెంట్ అమలుకు ప్రత్యేక కార్యాలయాలను కూడా ప్రారంభిస్తున్నారు. రానున్న నాలుగు సంవత్సరాలలో జిల్లా అభివృద్ధి మరింత వేగంగా పరుగులు పెట్టనుంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *