ఉత్తమ విద్యార్థులకు 'షైనింగ్ స్టార్స్' పేరుతో అవార్డులు
విద్యార్థులను ప్రోత్సహించేందుకు సర్కార్ కీలక నిర్ణయం
2024-25 ఉత్తమ విద్యార్థులకు షైనింగ్ స్టార్ అవార్డులు
టెన్త్, ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించిన వారికి అవార్డులు
విద్యార్థులకు సర్టిఫికెట్, మెడల్, 20 వేల రూపాయల నగదు
మార్గదర్శకావిను విడుదల చేసిన ఏపీ పాఠశాల విద్యాశాఖ
చిత్తూరు,జూన్ 6 ( ఆంధ్రప్రభ బ్యూరో): విద్యార్థులలో ప్రతిభను మరింత ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 2024-25 విద్యా సంవత్సరానికి ఉత్తమ విద్యార్థులకు ట్రైనింగ్ స్టార్ అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది టెన్త్ ఇంటర్లలో ఉత్తమ మార్కుల సాధించిన విద్యార్థులకు ఈషైనింగ్ స్టార్ పేరుతో అవార్డులు అందించనున్నారు. షైనింగ్ స్టార్ అవార్డులను అందజేయడానికి ఏపీ విద్యాశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యాశాఖ డైరెక్టర్ల సిఫార్సులు మేరకు 2024-25 ఏడాదికి జిల్లా స్థాయిలో అవార్డులను ప్రధానం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈనెల తొమ్మిదవ తారీఖున అన్ని జిల్లా కేంద్రాలలో ఈ అవార్డులను ప్రధానం చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ అవార్డుల ప్రదానంతో 10వ తరగతి, ఇంటర్మీడియట్ ప్రభుత్వ, ప్రైవేట్ విద్యార్థులకు సర్టిఫికెట్, మెడల్, నగదు ప్రోత్సాహాన్ని అందించనున్నారు. విద్యాశాఖ పదవ తరగతిలో 500 మార్కులు లేదా 83.33 శాతం, ఆపై మార్కుల సాధించిన ఓసి, బిసి, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ విద్యార్థులకు మండలాల వారీగా అవార్డులను ఎంపిక చేసి ఆ అవార్డులను అందించనున్నారు. ఇంటర్మీడియట్ లో 830 ఆపై మార్కుల సాధించిన ఓసి బిసి, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ విద్యార్థులను జిల్లాల వారీగా ఎంపిక చేసి అవార్డులను అందజేయనున్నారు. ప్రతి మండలంలో మొత్తం ఆరుగురు ఉత్తమ విద్యార్థులకు ఈ అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి మండలములో ఇద్దరు ఓసి, ఇద్దరు బిసి, ఒక ఎస్సి, ఒక ఎస్టి విద్యార్థులకు అవార్డులను అందజేస్తారు. ఇంటర్మీడియట్ విద్యార్థులలో ప్రతి జిల్లాకు 36 అవార్డులు చొప్పున అంది ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అవార్డుకి ఎంపికైన టెన్త్, ఇంటర్ విద్యార్థులకు సర్టిఫికెట్, మెడల్ తో పాటు 20 వేల రూపాయల నగదును అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మంచి మార్కులు సాధించిన విద్యార్థులతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమావేశం నిర్వహించారు. విద్యార్థులను అభినందించి, వారిని సన్మానించారు. వారికి మెడల్స్ కూడా అందజేశారు. స్కూళ్ళు, కళాశాలల్లో ఉన్న సమస్యలపై ఈ సందర్భంగా ఆరా తీశారు. ఉన్నత చదువుల కోసం మీకు మేము అండగా ఉంటామని మంత్రి వారికి భరోసా ఇచ్చారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివి రాష్ట్రస్థాయిలో టాపర్లు గా నిలచిన 52 మంది విద్యార్థులను విద్యాశాఖ మంత్రి నారాల్లో అభినందించి, సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉండవల్లిలోని మంత్రి నివాసంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి విద్యార్థులకు బంగారు పధకం, ల్యాప్‌టాప్ లను అందజేశారు.

