17, జూన్ 2025, మంగళవారం

మామిడి కాయలు కొనుగోలు చేయాలని అన్నదాతల ఆందోళనలు

పర్మిట్లు మంజూరు చేయాలని ధర్నాలు 

రైతుల గోడు పట్టని జిల్లా యంత్రాంగం 

ఫ్యాక్టరీల వద్ద బారులు తీరుతున్న ట్రాక్టర్లు 

రెండు రోజులు సెలవు ప్రకటించిన జైన్ ఫ్యాక్టరీ 


చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి ధమనీయంగా ఉంది.  రైతులు పండించిన మామిడికి గిట్టుబాటు ధర లభించడం లేదు. గిట్టుబాటు ధర ఇవ్వకపోయినా, పక్వానికి వచ్చిన మామిడికాయలను తీసుకోవడానికి మామిడి గుజ్జు పరిశ్రమలు ముందుకు రావడం లేదు. దీంతో జిల్లాలోని రైతులు చేయునదిలేక ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. వెంటనే తమ పండించిన మామిడికాయలను తీసుకోవాలని మామిడి గుజ్జు ఫ్యాక్టరీల వద్ద నిరసన తెలియజేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మామిడి రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. సోమవారం గుడిపాల మండలం ఆర్ ఆర్ ఎం ఫ్యాక్టరీ వద్ద రైతుల భారీ ఎత్తున ధర్నా చేశారు. వెంటనే తమ పండించిన మామిడిని తీసుకోవాలని డిమాండ్ చేశారు .అయితే పార్టీ యజమాన్యం ఈ నెల 30 వరకు మామిడి రైతులకు పర్మిట్లు జారీ చేశమని, కొత్తగా పర్మిట్లు ఇవ్వడంకుదరదని తెగేసి చెప్పారు. దీంతో ఫ్యాక్టరీ జారీ చేసిన పర్మిట వివరాలను నోటీసు బోర్డులో ప్రకటించాలని మామిడి రైతులు ధర్నా చేశారు. అలాగే బంగారుపాళ్య మండలం నలగాంపల్లి వద్దనున్న సన్ బోల్డ్ ఫ్యాక్టరీ వద్ద కూడా సోమవారం రైతులు భారీ ఎత్తున ఆందోళనకు దిగారు. తమ పండించిన మామిడి కాయలను వెంటనే తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు పారదర్శకంగా పరిమిట్ల మంజూరు చేయాలని కోరారు. గంగాధర నెల్లూరు మండలం జైన్ ఫ్యాక్టరీ వద్ద కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఫ్యాక్టరీ వద్ద మామిడి రైతుల ట్రాక్టర్లు కిలోమీటర్ల పొడవున్న బారులు తీరాయి. ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్లిన ట్రాక్టర్ అన్లోడ్ చేసి తిరిగి రావడానికి రెండు, మూడు రోజులు పడుతుంది. దీంతో రెండు రోజులపాట తమ ఫ్యాక్టరీకి మామిడికాయలు తీసుకొని రావద్దని ఫ్యాక్టరీ యజమాని నోటీసు బోర్డులో రైతులను కోరింది. ఇప్పటికే సామర్థ్యానికి మించి మామిడి ఫ్యాక్టరీ చేరుతుందని మొత్తం కాయలు తీసుకునే వరకు కొత్తగా తీసుకోవడం జరిగిందని స్పష్టం చేసింది. ఇలా తోతాపురి రకం అమ్ముడుపోక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆదుకోవాలంటూ రైతులు రోడెక్కి పలుచోట్ల ఆందోళనలు చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో 56 వేల హెక్టార్లల్లో మామిడి సాగవుతోంది. ఇందులో తోతాపురి 39,895 హెక్టార్లు, నీలం 5,818, అల్పోన్సో 3,127, బేనీషా 3,895, మల్లిక 1,740 హెక్టార్లు, ఇతర రకాలు 1,526 హెక్టార్లలో సాగవుతోంది. పండిన పమిదిని ప్రాసెస్ చేయడానికి జిల్లాలో 34 గుజ్జు పరిశ్రమలు ఉన్నాయి. మామిడి గుజ్జు పరిశ్రమలకు రైతులు మామిడికాయలు సరఫరా చేయడం పెద్ద సమస్యగా మారింది. మామిడి గుజ్జు ఫ్యాక్టరీలు ముందుగా రైతులకు టోకన్లను జారీ చేస్తున్నాయి. రోజుకు 60 నుంచి 90 వరకు టోకెన్లను జారీ చేసి, వారి వద్ద మాత్రమే మామిడిని తీసుకుంటున్నాయి. అయితే ఇందులో మామిడి గుజ్జు ఫ్యాక్టరీలు బంధుమిత్రులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సామాన్య రైతులను పట్టించుకోవడం లేదు. ఏదో మొక్కబడిగా సామాన్య రైతులకు అరాకొరగా టోకెన్లను జారీ చేస్తున్నారు. దీంతో రైతులు మామిడి గుజ్జు ఫ్యాక్టరీల వద్ద టోకన్ల కోసం  పడికాపులు కాస్తున్నారు. రైతులు అధిక సంఖ్యలో గుమికూడి ఆందోళనకు దిగుతున్నారు. ఇప్పటికే మామిడి కోతలు పూర్తి చేసిన రైతులు పంట అమ్ముకునేందుకు చిత్తూరు, పలమనేరు, దామలచెరువు, బంగారుపాళ్యం ఇతరాత్ర మార్కెట్లకు తరలివస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా తోతాపురి రకం సాగవుతోంది. ఈ కాయలు 90శాతం దాకా పక్వానికి వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా 39,895 హెక్టార్లకు గాను 4,99,274 మెట్రిక్ టన్నుల దాకా  దిగుబడి వచ్చే అవకాశం ఉంది. టేబుల్ రకాలను మాత్రం రైతులు కోతకోసి మార్కెట్, ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారు. తోతాపురి పంటను ఫ్యాక్టరీలు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపడం లేదు. జిల్లా వ్యాప్తంగా మామిడి రైతులు దీనిపై ఆందోళనలు చేస్తూ రోడ్డెక్కుతున్నారు. అధికారుల పోరు పడకలేక కొన్ని ఫ్యాక్టరీలు కాయల కొనుగోలు చేస్తామంటూ టోకన్ల సిస్టమ్‌ను తీసుకొచ్చాయి. ఫ్యాక్టరీలు జారీ చేసే టోకన్ల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. అయితే ఫ్యాక్టరీలు మాత్రం అరకొర టొకెన్లు మాత్రమే జారీ చేసి చేతులు దులుపుకుంటున్నాయి. మిత్రులకు, బందువులకు  జారీ చేస్తున్నాయి. మరోవైపు తమిళనాడులోని క్రిష్ణగిరి, ఇతరాత్ర ప్రాంతాల నుంచి వచ్చే కాయలకు జిల్లాలోని ఫ్యాక్టరీలు తక్కువ రేటుకు కొంటున్నాయి. తోతాపురి కిలో రూ.4, రూ.5కు కొనుగోలు చేస్తున్నాయి. పక్కరాష్ట్రాల వ్యాపారులు రూ.5కే ఫ్యాక్టరీకి డెలివరీ ఇస్తున్నారని జిల్లాలోని ఫ్యాక్టరీ నిర్వాహకులు చెబుతున్నారు. పప్రభుత్వం ప్రకటించినట్లు  ఫ్యాక్టరీలు రూ. 8 ఇవ్వడం లేదు. ఫ్యాక్టరీ యాజమాన్యాలు 5 నుంచి  6 రూపాయలు మాత్రమే ఇస్తున్నాయి. గతం లో ఫ్యాక్టరీలు ఒక వారం లోపల పంపిన కాయలకు డబ్బులు చెల్లించే వారు. ఇప్పుడు 3 నెలలు కు పైన చెల్లిస్తాం, ఇష్టం ఉంటె తోలండి లేకుంటే లేదు అని రైతులకు తెగేసి చెప్పుతున్నారు. పల్ప్ ఫ్యాక్టరీలు ఇలా ఉంటె, ఇక ర్యాంపులు, మండి యాజమాన్యాల నిలువు దోపిడీ చెప్పనలవి కాదు. కేజీ తోతపురికి రూ. 4 ఇస్తున్నారు. 3 సంవత్సరాలనుండి తెగుళ్ళు, పురుగులు ఉధృతి కారణంగా అయిదారు సార్లు పురుగు మందులు పిచికారీ చేయవలసిన పరిస్థితి. గతంతో పోలిస్తే పురుగు మందుల ధరలు 200 శాతం పెరిగాయి. కూలీలకు రోజుకు 600 రూపాయలు భోజనం తొ పాటు ఇవ్వాలి. ట్రాక్టర్ తొ దుక్కులు చేయటానికి గంటకు రూ.800, పురుగు మందులు పిచికారీ చేయుటకు 500 లీ. డ్రమ్ముకు రూ .350, కొమ్మలు కత్తిరింపు, ఎరువులు, కోతకూలీలు తడిసి మోపెడవుతున్నాయి. సరాసరి  ఎకరా మామిడి పంట సాగుకు రూ. 45,000 అవుతున్నది. ఇప్పుడు శరాఘాతంలా మచ్చ తెగులు రైతును నట్టేట ముంచుతున్నాయి. పల్ప్ ఫ్యాక్టరీ యాజమాన్యం చిన్న మచ్చ ఉన్నా తీసి పడేస్తున్నారు. గతంలో తోతపురి రకం కోత సమయంలో పండు మాగిన కాయలు తక్కువ ధరకు కొని పల్ప్ ఆడించేవారు. ఇప్పుడు చిన్న మచ్చ ఉన్న కాయలు గ్రేడింగ్ లో పారవేస్తున్నారు.  ఫ్యాక్టరీ యాజమాన్యం ఈ సంవత్సరం ఆర్డర్లు ఉన్నా, కొనటానికి ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు. మొత్తంగా మామిడి కొనుగోలు విషయంలో రైతుల గోడును ఉద్యానవన శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో విధిలేకుండా రైతులు రోడెక్కి ఆందోళనలకు దిగుతున్నారు.

పో రై గంగ 1 అర అర ఎం ఫ్యాక్టరీ వద్ద రైతుల ఆందోళన 

గంగ 2 బంగారుపాలెంలో రైతుల ధర్నా 

గంగ 3 జైన్ ఫ్యాక్టరీ వద్ద బారులు తీరిన ట్రాక్టర్లు 

గంగ 4 రెండు రోజులు మామిడి తీసుకురావద్దని నితిసు బోర్డు 


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *