టమాటా రైతులను భయపెడుతున్న ఈజీగా వైరస్
టమాటా పంటను నాశనం చేస్తున్న ఈజీ ఈగలు
పాడైపోతున్న పక్వనికి వచ్చిన కాయలు
మార్కెట్ లేకపోవడంతో రోడ్లమీద పారబోస్తున్న రైతులు
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : అసలే ధరలు లేకుండా ఇబ్బంది పడుతున్న చిత్తూరు జిల్లా టమేటా రైతు మీద ఈజీగా అనే వైరస్ దాడి చేస్తుంది. ఈజీ ఈగ వైరస్ టమేటా పంటకు తీవ్రంగా నష్టం కలగచేస్తుంది. ఈజీ ఈగ కారణంగా కోతకు వచ్చిన టమాటా పంట దెబ్బతింటుంది. ఈగ వాడడంతో టమాటా కాయలు మొత్తం రంద్రాలు పడుతున్నాయి. ఈజీ ఈగలు పచ్చి, దోర, పండు టమాటాలపై వాలి, పండు మీద రంద్రాలు చేస్తున్నాయి. దీంతో మెత్తబడి రంద్రాల గుండా నీరుకారి కాయ నాణ్యత తగ్గిపోతుంది. చిత్తూరు జిల్లాలో రైతులు విస్తారంగా టమేటాను సాగు చేశారు. ఈ సంవత్సరం మంచి దిగుబడి వచ్చింది అయితే కిలో టమేటా రూపాయి కూడా పలకడం లేదు. ఈ పరిస్థితి నుంచి రైతులు కోలుకోక ముందే రైతులను ఈజీ ఈగ వైరస్ ఇబ్బంది పెడుతుంది. ఈజీ ఈగ వైరస్ వచ్చిన కాయలు అమ్మకానికి పనికి రావడం లేదు. వీటిని కోసి రైతులు రోడ్డు పక్కన పడేస్తున్నారు. పశువులకు ఆహారంగా ఉపయోగపడుతుంది. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలంలో ఈ వైరస్ ఎక్కువగా కనిపిస్తోంది. ఇది క్రమంగా జిల్లా అంతట వ్యాపిస్తోంది. దీంతో రైతులు చేయినదిలేక టమాటాను కోసి రోడ్ల మీదనే ప్రారంబోస్తున్నారు. టొమాటో పంటకు నష్టం కలిగించే వైరస్ లలో ఊజీ ఈగ ద్వారా వచ్చే వైరస్ ఒకటి. దీనినే "ఊజీ వైరస్" అని కూడా అంటారు. ఇది టమాటా పంటను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఊజీ ఈగ ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. ఇది టమాటా పంటలో రంధ్రాలు చేసి, కాయలను తినేస్తుంది. ఈ వైరస్ సోకిన టమాటా కాయలపై రంధ్రాలు ఏర్పడతాయి, ఇవి లోపలికి పాకుతాయి. దీనివల్ల పంట నష్టం జరుగుతుంది. ఊజీ వైరస్ నివారణకు, రైతులు సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించాలి. ఇందులో తెగులు సోకిన మొక్కలను తొలగించడం, పురుగు మందులు వాడడం వలన కొంత ఉపయోగం ఉంటుంది. ఊజీ వైరస్ సోకిన టమాటా కాయలపై చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. ఇవి లోపలికి పాకి, కాయ మొత్తం దెబ్బతింటుంది. చిత్తూరు జిల్లాలో టమాట పంట బాగానే ఉంది, కానీ ధరలు తగ్గుముఖం పట్టాయి. రైతులు ఊజీ ఈగ తెగులు, ధరల తగ్గుదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిత్తూరు జిల్లాలో టమాట సాగు విస్తృతంగా ఉంది. ఊజీ ఈగ తెగులు సోకి టమేటా పంటను తీవ్రంగా నష్టపరుస్తోంది. టమాటాలకు గిట్టుబాటు ధర రాక రైతులు నష్టపోతున్నారు. నాణ్యత లేని టమాటాలను కొనేందుకు వ్యాపారులు నిరాకరిస్తున్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి పంట పండించినా, సరైన ధర రాక రైతులు నష్టపోతున్నారు. అప్పులు చేసి టమాట పంటను పండించిన రైతులు, ఇప్పుడు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. మంచి ఆదాయం వస్తుందనే ఆశతో, ఉత్సాహంగా పండించిన టమాటా పంట రైతులకు ఊహించని నష్టాలను తెచ్చిపెట్టింది. పుంగనూరు, పలమనేరు, కుప్పం ప్రాంతాల్లో టమాటా సాగు చేసిన రైతులకు 'ఊజీ వైరస్' కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తోంది. ఈ సీజన్ ప్రారంభం నుంచి ధరలు లేవు. ఈ పది రోజుల్లో స్వల్పంగా ధర కొద్దిగా పెరిగినప్పటికీ, 'ఊజీ ఈగ వైరస్' ప్రభావంతో పంట నాణ్యత దెబ్బతింది. దీనివల్ల సగం పండ్లను పారవేయాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుత ధరలతో పోలిస్తే, ఎకరానికి రూ.4.5 లక్షల నుంచి రూ.5 లక్షలు వరకు రావాలి. అయితే, పంట నాణ్యత లేకపోవడంతో, సగం కాయలను రోడ్ల పక్కన పశువులకు మేతగా వేస్తున్నారు. కొందరు పొలాల్లో పార వేస్తున్నారు. పెట్టుబడులు వచ్చే అవకాశం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో ప్రస్తుతం 5 వేల ఎకరాల్లో టమాటా తోటలు ఉన్నాయి. 15 వందల ఎకరాల తోటలకు 'ఊజీ ఈగ' వైరస్ వ్యాపించింది. ఎకరాకు రూ.2 లక్షలు నుంచి రూ.2.50 లక్షల వరకు వెచ్చించి పండించిన టమాటా పంట కోతకు వచ్చింది. ఈ దశలో ఇలా దెబ్బతింటుండటంతో రైతులు దిగులు చెందుతున్నారు. అమ్ముకునే దశలో ఇలా పారబోయాల్సి వస్తుంది, నట్టేట మునిగిపోతున్నాం అని రైతులు కన్నీరుమున్నీరై విలపిస్తున్నారు. ఊజీ ఈగతో దెబ్బతిన్న పంటకు ధరలు లేవు. రంధ్రాలు ఉన్న కాయలను వేరు చేస్తేనే కొనుగోలు చేస్తామని వ్యాపారులు సైతం అంటున్నారు. సాధారణంగా 15 కిలోల టమాటా పెట్టె ధర రూ.220 పలుకుతుంది. పంటను గ్రేడింగ్ చేస్తేనే కొనుగోలు చేస్తున్నారు. దీంతో పంటను కోసేందుకు కూలీలు కాకుండా గ్రేడింగ్ కు అదనంగా కూలీలను పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాయలను గాయపరచి వాటి లోపల గుడ్లు పెడుతున్నాయి. గుడ్ల నుంచి బయటకు వచ్చిన లార్వా కాయలను తింటున్నాయి. ఈ కొత్త రోగానికి సరైన మందులు లేకపోవడంతో ఈజీగా వైరస్ జిల్లాలో శరవేగంగా విస్తరిస్తుంది పంట భారీగా దెబ్బతిని వినియోగానికి ఉపయోగపడడం లేదు ఈ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించి ఎందుకు అవసరమైన పురుగుమందులను రైతులకు సబ్సిడీ మీద సరఫరా చేయాల్సిన అవసరం ఉంది. ఈ వైరస్ కు భయపడి భవిష్యత్తులో టమాట పంట వేయకపోతే ధరలను అదుపు చేయడం సాధ్యం కాకపోవచ్చు.

