25, జూన్ 2025, బుధవారం

జిల్లా పరిషత్ కు రూ. 1283 కోట్లతో మిగులు బడ్జెట్

గత సంవత్సరం మిగులు నిధులు రూ.1176 కోట్లు

ఈ సంవత్సరం రాబడులు రూ.3996 కోట్లు

మొత్తం జిల్లా పరిషత్ నిధులు రూ.5173 కోట్లు

ఈ సంవత్సరం వ్యయం రూ.3889 కోట్లు


చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.

చిత్తూరు జిల్లా ఉమ్మడి జిల్లా పరిషత్ కు ఈ ఆర్థిక సంవత్సరానికి 1283.24 కోట్ల రూపాయల మిగులుతో వార్షిక బడ్జెట్ ను రూపొందించారు. ఈ మేరకు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం అంచనా బడ్జెట్ ను ఆమోదించింది. గత ఆర్థిక సంవత్సరానికి ప్రారంభ నిల్వ 514.10 కోట్ల రూపాయలు ఉంది. గత సంవత్సరం వివిధ పద్ధతుల కింద జిల్లా పరిషత్ కు 3296.80 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. ఇందులో 2634.97 కోట్ల రూపాయలను గత సంవత్సరం జిల్లా పరిషత్ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కింద వ్యయం చేసింది. గత సంవత్సరం ఖర్చుల కంటే ఆదాయం ఎక్కువ ఉండడంతో ఈ ఆర్థిక సంవత్సరానికి 1175.93 కోట్ల రూపాయల ప్రారంభంలో ఉంది. దీనికి తోడు
ఈ ఆర్థిక సంవత్సరంలో 3996.05 కోట్ల రూపాయలు వివిధ మార్గాల ద్వారా జిల్లా పరిషత్ కు ఆదాయం వస్తుందని జిల్లా పరిషత్ అధికారులు అంచనా వేశారు. గత సంవత్సర నిల్వతో ఈ సంవత్సరం రాబడులు కలుపుకుంటే 5171.98 కోట్ల రూపాయలు జిల్లా పరిషత్ నిధులు అవుతాయి. ఇందులో ఈ ఆర్థిక సంవత్సరంలో 3888.75 కోట్ల రూపాయలను జిల్లా అభివృద్ధికి వ్యయం చేయడానికి ప్రణాళికను రూపొందించారు. జిల్లా పరిషత్ కు వచ్చే ఆదాయ వనరుల కంటే వ్యయం తక్కువగా ఉండటంతో ఈ ఆర్థిక సంవత్సరం అంతానికి 1283.24 కోట్ల రూపాయలు బడ్జెట్ లో మిగులుతుందని అంచనా వేశారు. 

చిత్తూరు జిల్లా పరిషత్ కు ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లా పరిషత్ సాధారణ నిధుల నుంచి 110.21 కోట్ల రూపాయలు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం నుంచి 825.35 కోట్లు, పి ఐ యు ఇంజనీరింగ్ విభాగం నుంచి 298.23 కోట్లు, పాఠశాల విద్యాశాఖ నుంచి 62.64 కోట్లు, వైద్య ప్రజారోగ్యం శాఖ నుంచి 3.02 కోట్లు, మహిళా,  శిశు సంక్షేమ సేకరించి 11.47 కోట్ల రూపాయలు, సామాజిక భద్రత సంక్షేమం డిఆర్డిఏ నుంచి 1425.12 కోట్ల రూపాయలు, వ్యవసాయ అభివృద్ధికి 39.7.2 కోట్ల రూపాయలు, పశుసంవర్ధక శాఖకు 9.78 కోట్ల రూపాయలు, మత్స్య శాఖకు 50 లక్షలు, షెడ్యూలు కులాలు వెనుకబడిన తరగతుల సంక్షేమానికి 31.70 కోట్లు, సాంఘిక సంక్షేమ శాఖకు ప్రజలు ఫీజు కింద 25 లక్షలు,  జిల్లా నీటి నిర్వహణ అభివృద్ధి సంస్థ ద్వారా ప్రత్యేక గ్రామీణ అభివృద్ధికి  1041.76 కోట్ల రూపాయలు, విడుదలవుతుందని అంచనా వేశారు. ఈ మొత్తాన్ని 3996.05 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. ఇక జిల్లా పరిషత్ కింద వివిధ పద్ధతుల కింద వ్యయం అంటే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు 3888.75 కోట్ల రూపాయలను వ్యయం చేయనున్నారు. జిల్లా పరిషత్ సాధారణ నిధుల నుంచి 70.60 కోట్ల రూపాయలు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం నుంచి 793.83 కోట్లు, పి ఐ యు ఇంజనీరింగ్ విభాగము ద్వారా 294.67 కోట్ల రూపాయలు, నీటి సరఫరా, పారిశుధ్యం ఇంజనీరింగ్ విభాగాలకు 135.80 కోట్ల రూపాయలను, పాఠశాల విద్యాశాఖకు నాడు నేడు కింద 59.54 కోట్ల రూపాయలను వ్యయం చేయనున్నారు. వైద్యము, ప్రజారోగ్యము శాఖ ద్వారా 1.86 కోట్ల రూపాయలు, మహిళా, శిశు సంక్షేమ శాఖ ద్వారా 11.47 కోట్ల రూపాయలు, సామాజిక భద్రత, సంక్షేమం డిఆర్డిఏ ద్వారా 1417.99 కోట్ల రూపాయలు, వ్యవసాయ అభివృద్ధికి 19 కోట్ల రూపాయలు వ్యయం చేస్తారు. మత్స్య శాఖకు 50 లక్షలు, షెడ్యూలు తెగలు, వెనుకబడిన కులాల అభివృద్ధికి 31.70 కోట్ల రూపాయలు, సాంఘిక సంక్షేమం ట్యూషన్ ఫీజు కింద 25 లక్షలు, జిల్లా నీటి నిర్వహణ సంస్థ కింద ప్రత్యేక గ్రామీణ అభివృద్ధి పథకాలకు1041.76 కోట్ల రూపాయలను వ్యయం చేస్తారు. గత ఆర్థిక సంవత్సరంలో ప్రారంభపు నిల్వ 514.10 కోట్ల రూపాయలు ఉండగా వివిధ పద్ధతుల కింద జిల్లా పరిషత్ కు 3296.80 కోట్ల రూపాయల రాబడున వచ్చాయి. ప్రారంభపు నిల్వ రాబడులు కలిపి 3810.90 కోట్ల రూపాయల జిల్లా పరిషత్ నిధి అయింది. ఇందులో గత సంవత్సరం 2634.97 కోట్ల రూపాయలను వివిధ అభివృద్ధి పథకాల కింద వ్యయం చేశారు. గత సంవత్సరం మిగిలిన 1175.93 కోట్ల రూపాయలను ఈ సంవత్సరం వచ్చే రాబడులతో కలిపి ఉమ్మడి జిల్లా అభివృద్ధికి వివిధ ప్రభుత్వ పథకాల కింద వ్యయం చేయనున్నారు. 

పో రై గంగ 1 జిల్లా పరిషత్ 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *