4, జూన్ 2025, బుధవారం

పులిగుండు యోగాకు ప్రధాని ప్రశంస


చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం పులిగుండు వద్ద జరిగిన యోగా కార్యక్రమం దేశ ప్రధాని నరేంద్ర మోడీ దృష్టిలో పడింది. ఆయన పులిగుండు వద్ద యోగా చేస్తున్న ఫోటోను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర విషయంలో చేస్తున్న కృషిని ప్రధానమంత్రి కొనియాడారు. యోగాంధ్రలో భాగంగా చిత్తూరు సమీపంలోని పులిగుండు ట్విన్ హిల్స్‌లో దాదాపు రెండు వేల మందికి పైగా ఔత్సాహికులు పాల్గొన్నారు. వీరు యోగాసనాలు వేస్తున్న ఫోటోలను దేశ ప్రధాని నరేంద్రమోడి సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో షేర్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో యోగాంధ్ర  దినోత్సవం పట్ల ప్రజల్లో ఉత్సాహాన్ని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. యోగాంద్ర 2025 పేరిట యోగాకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రధాని కొనియాడారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు. జూన్ 21న ఏపీలో యోగా దినోత్సవం జరుపుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. అందరు యోగా దినోత్సవంలో పాల్గొనాలని, యోగాను నిత్యజీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. యోగాంధ్రలో  భాగంగా చిత్తూరు సమీపంలోని పులిగుండు వద్ద దాదాపు 2000 మందికి పైగా  యోగాసనాలు వేస్తున్న ఫోటోలను కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ ఎక్స్ లో షేర్ చేయగా,  ఆ పోస్టును ప్రధాని రీ పోస్టు చేశారు. జీవనశైలిలో భాగమయ్యేలా యోగాను ప్రోత్సహించాలన్నారు.  ఏపీ ప్రభుత్వం యోగేంద్ర 2025 కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది. మే 21 నుంచి జూన్ 21 వరకు కూటమి ప్రభుత్వం గ్రామ, మండల, నియోజకవర్గస్థాయిలో యోగా పై అవగాహన కల్పిస్తోంది. కనీసం రెండు కోట్ల మందికి తక్కువ కాకుండా పాల్గొనాలని  సంకల్పంగా పెట్టుకున్నారు. పది లక్షల మందికి పైగా యోగా సర్టిఫికెట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జూన్ 21న విశాఖలో ఐదు లక్షల మందితో ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. విశాఖలో జరిగే యోగా ఈవెంట్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని ఉన్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఎక్స్‌ వేదికగా ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని మోదీ సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న విషయం విదితమే. రాష్ట్రవ్యాప్తంగా యోగా కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. యోగాంధ్రలో భాగంగా నిత్యం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు భాగస్వామ్యం అవుతున్నారు.

పో రై గంగ 1 పులిగుండు వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం 



 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *