ప్రేక్షకులకు దూరం అవుతున్న థియేటర్లు
పెరిగిన టిక్కెట్టు ధరలు
భారీగా పెరిగిన తినుబండారాల ధరలు
పారిశుధ్యం అధ్యన్నం
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
సినిమా థియేటర్లు క్రమంగా వీక్షకుల ఆదరణ కోల్పోతున్నాయి. పేద, మధ్యతరగతి వారికి వినోదం కలిగించే థియేటర్లు ఇప్పుడు భారంగా మారాయి. విడుదలైన పలు సినిమాలు వంద రోజులు ఆడటం ఒకప్పుడు సర్వసాధారణం. దసరా బుల్లోడు లాంటి కొన్ని సినిమాలు ఏడాది పాటు ఆడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా మారుతున్నాయి. చాలా సినిమాలు నెల కూడా ఆడటం లేదు. సగటు మనిషి గతంలో సరదాగా సినిమాలకు వెళ్లేవారు. ప్రస్తుతం సినిమాకు వెళ్లాలంటే ఆర్థికంగా భారం అవుతోంది. పెరిగిన సినిమా ధరలతో పాటు విపరీతంగా పెరిగిన తినుబండారాల ధరలు ప్రేక్షకులను థియేటర్లకు దూరం చేస్తున్నాయి. ఇంట్లోనే కూర్చొని టీవీల్లో వచ్చే వినోదాన్ని ఆస్వాదించడానికి అలవాటు పడుతున్నారు. కొత్త సినిమా విడుదల అయితే, వెంటనే చూడాలన్న కోరిక క్రమంగా తగ్గుతోంది. మూడు నెలల తర్వాత టీవీలో ఇంట్లోనే చూడవచ్చు లే అనే భావన పెరుగుతోంది. సగటు మనిషి సినిమా థియేటర్ కు వెళ్లి సినిమాను ఆస్వాదించడం ఆర్థికంగా భారం అవుతుంది.
దీనికి పలు కారణాలు ఉన్నప్పటికీ పెరిగిన టిక్కెట్ ధరలు, థియేటర్ల వద్ద జరిగే దోపిడీ ప్రధానంగా చెప్పవచ్చు. మామూలు థియేటర్లలో ఒక్కో టికెట్టు రూ. 100 నుంచి 200 వరకు ఉంది. మల్టీప్లెక్ థియేటర్ లలో 150 నుంచి మూడు వందలు ఉన్నాయి. సినిమా విడుదల అయిన సమయంలో సినిమా నిర్మాతలు ఇష్టం వచ్చినట్టు ధరలు పెంచేస్తున్నారు. కొన్ని సందర్భాలలో రూ.1000 నుంచి రూ. 3000 వేల వరకు ఉంటున్నాయి. కొన్ని సందర్భాలలో టిక్కెట్లు బ్లాక్ లో అధిక ధరలకు కొన వలసి వస్తుంది. దీనికి తోడు థియేటర్ల వద్ద ప్రతి వస్తువు అధిక ధరలకు అమ్ముతున్నారు. బయట పాతిక రూపాయలకు దొరికే పాప్ కార్న్ రూ 150 కి అమ్ముతున్నారు. కూల్ డ్రింకులు, టీ కాఫీలు బయటికంటే రెండుమూడు రెట్లు అధిక ధరలకు అమ్ముతున్నారు. ప్రభుత్వం అనుమతి లేనప్పటికీ పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో భార్య, భర్త, ఇద్దరు పిల్లలు సినిమా చూడాలంటే రూ. 1000 నుంచి 2000 అవుతోంది. దీనితో పేద, మధ్య తరగతి ప్రజలు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడటం తగ్గించి వేశారు. రెండు మూడు నెలలు ఆగితే ఓటిటి లో లేదా టీవీల్లో చూడవచ్చని పలువురు భావిస్తున్నారు. కాగా విడుదలైన రోజే పైరసీ వీడియోలు వచ్చేస్తుండటం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ఒకప్పుడు విడుదల రోజు సినిమా చూడాలన్న భావన ఉండేది. ఇప్పుడు ఖర్చులకు భయపడి ప్రజలు వెనకడుగు వేస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంల ద్వారా ప్రేక్షకులు తమ ఇంటి సౌలభ్యంలోనే సినిమాలు చూడగలుగుతున్నారు. ఈ సేవలు సులభతరం, తక్కువ ఖర్చుతో వినోదాన్ని అందిస్తున్నాయి. స్ట్రీమింగ్ సేవల పెరుగుదల వినోద పరిశ్రమలో గణనీయమైన మార్పును తీసుకువచ్చింది. ఎక్కువ మంది వినియోగదారులు కంటెంట్‌ను ఆన్‌లైన్‌లో ప్రసారం చేయడానికి ఇష్టపడటంతో, కేబుల్ టీవీ నెట్‌వర్క్‌ల వంటి సాంప్రదాయ మీడియా సంబంధితంగా ఉండటానికి అనుగుణంగా మారవలసి వచ్చింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ మొదలైన స్ట్రీమింగ్ సేవలు, తమ స్వంత సౌలభ్యం మేరకు విస్తృత శ్రేణి కంటెంట్‌ను యాక్సెస్ చేయాలనుకునే వీక్షకులకు అత్యంత అనుకూలమైనవిగా మారాయి. ఈ మార్పు సినిమాలు, టీవీ షోలను నిర్మించడం, పంపిణీ చేయడంలో గణనీయమైన మార్పులకు దారితీసింది. ఇప్పుడు సినిమా విడుదలలను దాటవేసి, సినిమాలను నేరుగా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేస్తున్నాయి. ఈ సేవల ద్వారా ప్రత్యేకంగా ప్రసారం చేయగల అసలైన ప్రోగ్రామింగ్‌ను సృష్టించడంపై ప్రాధాన్యత పెరుగుతోంది. మొత్తంమీద, స్ట్రీమింగ్ సేవల పెరుగుదల అంటే మీడియా కంటెంట్‌ను యాక్సెస్ చేసే విషయంలో వినియోగదారులకు ఇప్పుడు గతంలో కంటే ఎక్కువ ఎంపికలు ఉన్నాయి. సినిమా టికెట్ల, థియేటర్‌లో అందించే స్నాక్స్ ధరలు ఎక్కువ కావడం వల్ల, కుటుంబ సమేతంగా సినిమా చూడటం ఖర్చుతో కూడుకున్న విషయంగా మారింది. టికెట్ ధర పెంచడం వల్ల థియేటర్లు నష్టపోతున్నాయని వాటి యజమానులు, ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. ఈ ప్రభావం కచ్చితంగా ప్రేక్షకులపై భారం పడుతుంది. దీనివల్ల మళ్లీ మళ్లీ సినిమా చూసే ప్రేక్షకులు లేదా రెండు, మూడు సినిమాలు చూసే ప్రేక్షకులు తగ్గిపోతున్నారు. సగటు మధ్యతరగతి లేదా ఎగువ, దిగువ మధ్య తరగతి ప్రేక్షకుల ఆలోచన భిన్నంగా ఉంటుంది. ఈ నెల సినిమాల కోసం బడ్జెట్ రూ.1000 లేదా రూ.1,500 అనుకుంటారు. ఆ మొత్తం ఒకే సినిమాకు పెట్టడం వల్ల ఇతర సినిమాలు చూడటం ఆపేస్తున్నారు. ఒకే సినిమా చూడటంతో తర్వాత వేరొక సినిమాకు ప్రేక్షకులు రావడం తగ్గిపోతున్నారు.గతంలో ఒక వ్యక్తి సినిమాల సీజన్ వచ్చిందంటే, మూడు, నాలుగు సినిమాలు చూసేవారని, ఇప్పుడు ఒక్క సినిమాకు పరిమితంఅవుతున్నారు. దీనికి తోడు ప్రేక్షకులు తమ సొంత సమయానికి అనుగుణంగా ఇంట్లోనే సినిమాలు చూడడాన్ని ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంట్లో పెద్ద తెరలు, అధునాతన సౌండ్ సిస్టమ్స్ ద్వారా థియేటర్ అనుభవాన్ని పొందుతున్నారు. సినిమాల్లో సృజనాత్మకత తగ్గడం, పునరావృత కథలు, సీక్వెల్స్ ఎక్కువగా రావడం వల్ల ప్రేక్షకుల ఆసక్తి తగ్గింది. రెస్టారెంట్లు, లైవ్ ఈవెంట్స్, సంగీత కచేరీలు వంటి ఇతర వినోద ఎంపికలు పెరగడం వల్ల, ప్రేక్షకులు థియేటర్‌కు వెళ్లడం తగ్గించారు. దీంతో పలు థియేటర్లు మూతపడుతున్నాయి. పెళ్లి మండపాలుగా రూపాంతరం చెందుతున్నాయి. సినిమా థియేటర్లు ప్రేక్షకులను ఆకర్షించడానికి కొత్త మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉంది.
పో రై గంగ 1 సినిమా థియేటర్

