12, జూన్ 2025, గురువారం

తల్లికి వందనం కింద 2,60,641 మందికి లబ్ధి

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు 1,56,336

ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులు 1,04,305

తల్లుల ఖాతాలోకి రూ. 13 వేలు

జిల్లా కలెక్టర్ ఖాతాలోకి రూ. 2 వేలు

సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితా ప్రదర్శన

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.

రాష్ట్రంలో కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా సూపర్ సిక్స్ అమలులో భాగంగా తల్లికి వందనం పథకం  నిధులు మంజూరుకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వం  ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో రూపంలో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు ఇచ్చారు. జిల్లా  వ్యాప్తంగా 2,60,641 మంది విద్యార్థులకు 15 వేల రూపాయలు చొప్పున జమ చేయనున్నారు. ఈ 15 వేల రూపాయలలో 2 వేల రూపాయలను జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉండే ఖాతాలకు మళ్లించి పాఠశాలల నిర్వహణ, అభివృద్ధి, పారిశుద్ధ్యం కోసం వినియోగించాలని ఆదేశాల్లో వెల్లడించారు. తల్లికి వందనం నిధులను ఆయా కార్పొరేషన్ల ద్వారా విడుదల చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 


 సూపర్‌ సిక్స్‌ హామీల్లో మరో కీలక పథకం అమలును కూటమి ప్రభుత్వం గురువారం ప్రారంభించింది. ప్రభుత్వం ఏర్పాటు అయి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం ప్రతి విద్యార్థికి రూ.15 వేలు చొప్పున నిధులు విడుదల చేయనుంది. కాగా, మరుగుదొడ్ల నిర్వహణ నిధికి రూ.1,000, పాఠశాల నిర్వహణ నిధి కోసం మరో రూ.1,000 చొప్పున మినహాయించి మిగిలిన రూ.13 వేలు ఖాతాలో జమ చేయాలని నిర్ణయించారు. ఈ పథకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సమీక్షించారు. అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయాలన్నారు. పథకానికి నిధుల ఇబ్బంది తలెత్తకుండా చూడాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ను సీఎం ఆదేశించారు. ఇప్పటికే గుర్తించిన విద్యార్థులతో పాటు ఒకటో తరగతిలో, ఇంటర్‌ ఫస్టియర్‌లో అడ్మిషన్‌ పొందిన విద్యార్థులకు కూడా పథకం అమలు చేయాలని స్పష్టం చేశారు. పథకం అమలులో ఇబ్బందులు లేకుండా సంబంధిత శాఖలు సమన్వయం చేసుకోవాలని సూచించారు. సాంకేతిక కారణాలతో ఎవరైనా విద్యార్థుల పేర్లు లేకపోతే దరఖాస్తుకు అవకాశం కల్పించి, నిధులు విడుదల చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ పథకం కింద ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 14,701 మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలలకు చెందిన 1,22,266 మున్సిపల్ పాఠశాలలకు చెందిన 6,522 రెసిడెన్షియల్ పాఠశాలలకు చెందిన 5,864 ఏపీ మైనారిటీ స్కూల్స్ కి చెందిన 3,364 ప్రైవేట్ స్కూల్స్ కు చెందిన 1,538 కస్తూరి పాఠశాలలకు చెందిన 2,081 విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 1,56,336 మంది విద్యార్థులు, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 1,04,305 మంది మొత్తం కలిపి 2,60,641 విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. అలాగే ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న 83,874 మంది, ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుతున్న 21,950 మంది, ఉన్నత పాఠశాలలో చదువుతున్న 62,231, హై స్కూల్ ప్లస్ లో చదువుతున్న 10,155, ప్రాథమిక పాఠశాల నుంచి ఉన్నత పాఠశాలలో చదువుతున్న 40288, మంది ప్రాథమిక పాఠశాల నుంచి జూనియర్ కళాశాలలో చదువుతున్న 14,815 మంది, జూనియర్ కళాశాలలో జరుగుతున్న 27,328 మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే దరఖాస్తుదారులు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారై ఉండాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూల్‌లో చదువుతుండాలి. ఒకటవ తరగతి నుంచి 12 వ తరగతి వరకు విద్యార్థులు అర్హులు. విద్యార్థులకు కనీసం 75 శాతం హాజరు కలిగి ఉండాలి. తల్లి పేరు మీద బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం ప్రభుత్వ పరిమితికి లోబడి ఉండాలి. ఇందుకు  విద్యార్థి స్టడీ సర్టిఫికెట్, తల్లి ఆధార్ కార్డు, తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ వివరాలు, పిల్లల పాఠశాల హాజరు సర్టిఫికెట్, నివాస పత్రము లేదా రేషన్ కార్డ్, కుల ధ్రువీకరణ పత్రము, అవసరమైతే ఇన్‌కమ్ సర్టిఫికెట్ జత చేయాల్సి ఉంటుంది. ఏపీ ప్రభుత్వం త్వరలో అర్హుల జాబితాను సచివాలయాలలో ప్రదర్శించి , తల్లుల ఎకౌంట్లో డబ్బులు జమ చేయనుంది. తల్లికి వందనం రూ.15,000 అకౌంట్లో పడాలంటే, విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాను ఆధార్ నెంబర్ తో పాటు ఎంతో బ్యాంకు ఖాతాను జూన్ 5 లోపు లింక్ చేసుకోవాలి. ఒకవేళ లింక్ కానీ వారు లింక్ చేసుకునేందుకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ లేదా సచివాలయాలలో సంప్రదించాలి.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *