5, జూన్ 2025, గురువారం

తోతాపురి మామిడి టన్ను మద్దతు ధర రూ.12 వేలు.

 

 జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్.

  చిత్తూరు, జూన్ 03 (ఆంధ్రప్రభ బ్యూరో) : తోతాపురి మామిడి టన్నుకు మద్దతు ధర 12 వేల రూపాయలుగా  జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రకటించారు. మామిడి మద్దతు ధర నిర్ణయం మిద మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మామిడి  రైతులు, మామిడి గుజ్జు  పరిశ్రమల  యాజమాన్యం తో సమావేశం జరిగింది. ఈ సమావేశం రైతుల, మామిడి గుజ్జు  పరిశ్రమల  సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. తోతాపురి మామిడి  ధర నిర్ణయంపై జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధ్యక్షతన జరిగిన  సమావేశంలో చిత్తూరు, పూతల పట్టు ఎమ్మెల్యేలు గురజాల జగన్ మోహన్, డాక్టర్ కె. మురళి మోహన్ తో కలసి ఉమ్మడి చిత్తూరు జిల్లా లోని మామిడి రైతుల సంఘాల నాయకులు, మామిడి పరిశ్రమల యాజమానులు, మాజీ ఎం ఎల్ సి  దొరబాబు పాల్గొన్నారు. సమీక్ష సమావేశం నిర్వహించిన సమావేశానికి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్. తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  మామిడి  రైతులు, మామిడి పరిశ్రమల యాజమాన్యం ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం తోతాపురి మామిడి కి ధర రూ.12 వేలు గా నిర్ణయించడం జరిగిందని తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అత్యధికంగా తోతాపురి మామిడి పంట ఎక్కువు గా రావడంజరుగుతుందని, తోతాపూరి మామిడికి గిట్టుబాటు ధరకు సంబంధించి మామిడి రైతులు, మామిడి గుజ్జు పరిశ్రమ ల యాజమాన్యంలకు ఉన్న  సమస్యలు వారు చెప్పడం జరిగిందని తెలిపారు. మామిడిరైతులు, పరిశ్రమ యాజమాన్యం  ఇద్దరికి  ఎలాంటి ఇబ్బందులు లేకుండా  తోతపు రికి ధర రూ.12 గా నిర్ణయించడం జరిగిందని.  రైతుల గురించి మామిడి గుజ్జు  యాజమాన్యం ఆలోచించాలన్నారు. రైతుల నుంచే మామిడి కొనుగోలు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ మాట్లాడుతూ తోతాపూరి మామిడి రకానికి గిట్టుబాటు ధర కల్పించే విషయంలో రైతులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని, రైతులతో పాటు ప్రాసెసింగ్ పరిశ్రమల వారు కూడా పరిశ్రమలు నిర్వహించేందుకు అనుగుణంగా ఇద్దరికీ సామరస్యంగా  ఉంటుందని టన్ను కు రూ.12 వేలు గా జిల్లా కలెక్టర్  నిర్ణయించడం జరిగిందన్నారు. అటు యాజమాన్యం ఇటు మామిడి రైతులు ఇద్దరు బాగుండాలన్నదే ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమన్నారు. జిల్లాలో ఎక్కువ పరిశ్రమలు తీసుకురావడానికి  ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు గారు కృషి  చేస్తున్నారని తెలిపారు,తమిళనాడు ప్రభుత్వంతో కూడా మామిడి రైతులకు గిట్టుబాటు ధర గురించి చర్చించడం జరుగుతుందని తెలిపారు.  పూతలపట్టు ఎమ్మెల్యే  డాక్టర్ కె. మురళీమోహన్ మాట్లాడుతూ  జిల్లాలో మామిడి పంట సాగు అధికంగా ఉన్నదని ఇందులో ప్రధానంగా ప్రాసెసింగ్ కు అవసరమైన తోతాపురి రకం ఎక్కువగా రావడం జరుగుతుందన్నారు. జిల్లాలో మామిడి పరిశ్రమలకు ఎలాంటి ఇబ్బందులు  లేకుండా ప్రభుత్వము అండగా ఉంటుందన్నారు. రైతులకు పరిశ్రమల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా యాజమాన్యం చూడాలని, రైతులు కూడా మామిడి పరిశ్రమల యాజమాన్యానికి సహకరించాలన్నారు. ఈ సమావేశంలో  గుజ్జు పరిశ్రమల యాజమాన్యం మాట్లాడుతూ  పరిశ్రమల నిర్వహణలో ఉన్న సమస్యలు జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేల దృష్టి కి తీసుకొచ్చారు.  జిల్లాలో ప్రస్తుతం ఉన్న ప్రాసెసింగ్ కంపెనీలలో  ఇప్పటికే ఎక్కువగా గుజ్జు నిల్వ ఉందని, మామిడి గుజ్జుకు డిమాండ్ తగ్గిందని  వారు తెలిపారు. ఈ సమావేశంలో చిత్తూరు, తిరుపతి జిల్లాల కు సంబందించిన ఉద్యాన శాఖ  డి డి లు మధుసూదన్ రెడ్డి, దశరథ రామిరెడ్డి, రైతు సంఘ నాయకులు, మామిడి బుజ్జి పరిశ్రమల యజమాన్యం తదితరులు పాల్గొన్నారు.

పో రై గంగ 1 తోతపురి మామిడి  ధర నిర్ణయంపై జరిగిన సమావేశం 


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *