తంబళ్ళపల్లిలో తగ్గని టిడిపి అందోళనలు
తంబళ్లపల్లె నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా దాసరపల్లి జయచంద్రా రెడ్డిని ప్రకటించడం పట్ల నియోజకవర్గంలో నిరసనాలి వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గంలో తెదేపా నాయకులు, బిసి నేతలు శంకర్ యాదవ్ కు అండగా నిలపడుతున్నారు. నియోజకవర్గంలోని కులబలకోట, తంబళ్ళ పల్లి, పెద్దతిప్ప సముద్రం, పెద్దమాండ్యం, బి. కొత్తకోట, ములకల చెరువు మండలాల్లో నిత్యం అందోళనలు జరుగుతున్నాయి. తిరిగి శంకర్ ను అభ్యర్థిగా ప్రకటించాలని కోరుతున్నారు. ఒకవేళ ప్రకటించకపోతే, పార్టీకి సామూహికంగా రాజీనామాలు చేయడానికి కూడా సిద్దంగా ఉన్నారు. బీసీ నాయకుడు శంకర్ యాదవ్ కు కేటాయించాలని నియోజకవర్గంలోని ఆరు మండలాల నాయకులు డిమాండ్ చేశారు.
ఆదివారం తంబల్లపల్లిలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ.. తంబళ్లపల్లె నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గా ఇప్పుడు ప్రకటించిన వ్యక్తి అనర్హుడు అనీ,, అతను క్యాడర్ కి గానీ, నాయకులకు, కార్యకర్తలుకు గానీ అందుబాటులో లేదన్నారు. అభ్యర్థిగా ప్రకటించిన నెల రోజుల నుండి క్యాడర్ మొత్తాన్ని కలిసింది లేదని తెలిపారు. ఇలాంటి పరిస్థితి నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడూ లేదని, గత 10 సంవత్సరాల నుండి నియోజకవర్గాన్ని అభివృద్ది చేసి, ప్రతిపక్షంలో ఉన్నపుడు క్యాడర్ ని కాపాడుకుంటూ వచ్చిన శంకర్ యాదవ్ వైపే నియోజకవర్గ ప్రజలు మొగ్గు చూపుతున్నారు అని తెలియజేశారు. చంద్రబాబు దయచేసి మా తంబళ్లపల్లె నియోజకవర్గ ప్రజలు, తెలుగుదేశం క్యాడర్ అందరూ కోరుకుంటున్న శంకర్ యాదవ్ ని మళ్ళీ అభ్యర్థిగా ప్రకటించాలని, అత్యదిక మెజారిటీ తో గెలిపించుకుని తంబళ్లపల్లె స్థానాన్ని కానుకగా అందజేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పెద్ద మండ్యం మండల కన్వీనర్ జిట్టా వెంకటరమణ, బి.కొత్తకోట టౌన్ కన్వీనర్ బంగారు వెంకటరమణ, ఎక్స్ జెడ్పీటీసీ ఈశ్వరప్ప, ఎక్జిక్యూటివ్ మెంబర్ సుకుమార్, మండల ప్రధాన కార్యదర్శిలు దేవరింటి కుమార్, వెంకట స్వామి, రాజంపేట తెలుగు యువత ఉపాధ్యక్షుడు సుదర్శన రెడ్డి, నియోజకవర్గ రైతు అద్యక్షుడు గుత్తా సుధాకర్ నాయుడు, SC సెల్ రాష్ట్ర కార్యదర్శి తమక శ్రీనివాసులు, రాజంపేట ST సెల్ అధ్యక్షుడు నటరాజ్ నాయక్, యూనిట్ ఇంచార్జిలు రమణ మూర్తి, రామకృష్ణ రాజు, సుధాకర్ నాయుడు, సర్పంచ్ చిన్నప రెడ్డి, మీడియా కోఆర్డినేటర్ మైసూర్ శ్రీనివాసులు, తెలుగు యువత JCB సుధాకర్ నాయుడు, రాజా చాకాన, సీనియర్ నాయకులు నాగ మళ్ళప్ప, కుడుము రంజిత్ కుమార్, కుడుము శరత్, దేవుడు నాగరాజు, నాగరాజు, జయరాం, వెంకటస్వామి, ఆదినారాయణ, చంద్ర, శ్రీనివాసులు, కురవ ప్రకాష్, సురేంద్ర, బీరంగి ఆనంద, సోము, శ్రీరాములు, శామీర్, శ్రీనాథ్ నాయుడు, మగ్గల నాగరాజు, సుధాకర్ రెడ్డి, శంకర్ నారాయణ, వెంకట రెడ్డి, అంత్రప్ప నాయుడు, మహేష్ నాయుడు, భరత్, అంజి, శ్రీనివాసులు ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.