22, మార్చి 2024, శుక్రవారం

శ్రీకాళహస్తి కూటమి నేతల తిరుగుబాటు - సుధీర్ ను మార్చాలని డిమాండ్


శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి  బొజ్జల సుధీర్ రెడ్డికి వ్యతిరేకంగా కూటమిలో ఇతర నేతలు అందరూ ఏకమవుతున్నారు. బొజ్జల సుధీర్ రెడ్డికి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు. ఆయన అభ్యర్థి అయితే ఎన్నికలలో పనిచేసేది లేదని అధిష్టానానికి తగేసి చెప్పేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీకాళహస్తి నియోజకవర్గం అభ్యర్థిని మార్పు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. శ్రీకాళహస్తి సీటును బొజ్జల సుధీర్ కు కాకుండా ఎవరికి ఇచ్చిన తాము గెలిపించుకుంటామని భరోసా ఇస్తున్నారు. బొజ్జల సుధీర్ రెడ్డి గెలుపునకు ఎట్టి పరిస్థితిలోనూ  పనిచేసేది లేదని స్పష్టం చేశారు. సుధీర్ రెడ్డిని మార్పు చేయాల్సిందేనని కూటమి నేతలు తమ అధిష్ఠానంలకు గట్టిగా సందేశం పంపారు.




శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్. సి.వి. నాయుడు తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుంచి శ్రీకాళహస్తి రాజకీయాల్లో మలుపు తిరుగుతున్నాయి. ఆయన కేంద్రంగా రాజకీయాలు నడుస్తున్నాయి. ఎస్.సి.వి నాయుడు టీడీపీలో చేరికను బొజ్జల సుధీర్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన పార్టీలో చేరడానికి ముహూర్తం నిర్ణయించగా, తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరు నాయుడు పాటు వెళ్ళకూడదు వీడియో సందేశాలు పంపించారు. అయినా అవాంతరాలను అధిగమించి ఎస్ సి వి నాయుడు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ రోజు నుంచి ఇద్దరు నేతలు ఎడ ముఖం పెడముఖంగా ఉన్నారు. శ్రీకాళహస్తి టికెట్ రేసులో తను కూడా ఉన్నట్లు ఎస్వీ నాయుడు ప్రకటించారు. తనకు సత్యవేడు, సూళ్లూరుపేట నియోజకవర్గాలలో కూడా గట్టిపట్టు ఉన్నందున తనకు టిక్కెట్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. మూడు నియోజకవర్గాల్లో తన ప్రభావంతో గెలుపు సాధ్యమవుతుందని అధిష్టానంకు వివరించారు.




మొదటి జాబితాలో శ్రీకాళహస్తి అభ్యర్థి పేరు లేకున్నా, రెండవ జాబితాలో బొజ్జల సుధీర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. ఆనాటి నుంచి శ్రీకాళహస్తిలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఎస్సివి నాయుడు, జనసేన నియోజకవర్గ ఇంఛార్జి కోటా వినుత, బిజెపి నేత కోలా ఆనంద్ ఒక కూటమిగా వ్యవహరిస్తున్నారు. కోటమి అభ్యర్థి సుధీర్ రెడ్డి ఏకాకయ్యారు. ముగ్గురు జడ్పిటిసి లను విజయవాడ తీసుకెళ్లి పార్టీలో చేర్పించి అధిష్టానం మెప్పు పొంది సుధీర్ పార్టీ టిక్కెట్లు దక్కించుకున్నారు. అయితే సుధీర్ అభ్యర్థిత్వాన్ని నియోజకవర్గంలోని కూటమి నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం ఎస్సివి నాయుడు ఆధ్వర్యంలో బిజెపి, జనసేన నాయకులు రహస్య సమావేశం నిర్వహించారు. 

అనంతరం ఎస్ సి వి నాయుడు మీడియాతో మాట్లాడుతూ సుధీర్ రెడ్డిని కూటమి అభ్యర్థిగా ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. రాజకీయంగా అనుభవము ఉన్న తనకు టిక్కెట్టు ఇవ్వాలని నాయుడు విజ్ఞప్తి చేశారు. తనకు కాకున్నా, జనసేన నాయకురాలు కోటా వినుత, బిజెపి నేత కోలా ఆనంద్ కు టికెట్ ఇచ్చినా, తాను వారి గెలుపు కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జనసేన నాయకురాలు కోటా వినుత మాట్లాడుతూ బొజ్జల సుధీర్ కు టికెట్ వచ్చిన సందర్భంగా తన ఇంటి ముందే టపాకాయలు కాల్చి తనను రెచ్చకొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కార్యాలయం వద్ద మహిళలు అని కూడా చూడకుండా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బొజ్జల సుధీర్ రెడ్డి అభ్యర్థిన్ని  అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. ఎస్ సి వి నాయుడు కానీ, తమలో ఒకరికి కానీ, టికెట్ ఇస్తే గెలిపించుకుంటామని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సత్రవాడ మునిరామయ్యా, బిజెపి నేత రామచంద్ర రెడ్డి కూడా పాల్గొన్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *