జనసేనలో చేరిన జంగాలపల్లి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన చిత్తూరు శాసనసభ్యుడు జంగాలపల్లి శ్రీనివాసులు గురువారం జనసేన పార్టీలో చేరారు. జనసేనాని పవన్ కళ్యాణ్ జంగాలపల్లి శ్రీనివాసులను, అనుచరులను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ కండువా కప్పి పార్టీ సభ్యత్వం ఇచ్చారు. జంగాలపల్లి శ్రీనివాసులతోపాటు ఆయన కుమారులు జగన్, మోహన్, చిత్తూరు నగరపాలక సంస్థ వైసిపి కార్పొరేటర్లు శ్రీకాంత్, పూర్ణ, అలాగే కార్పొరేటర్ల భర్తలు ఏకే రవి, రఘు జనసేన తీర్థం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు హరి ప్రసాద్, అధికార ప్రతినిధి కిరణ్ రాయల్, చిత్తూరు నుండి నాయకులు దయారాం, చందూ కుమార్, యశ్వంత్, రిటైర్డ్ ఎస్ ఐ మురళి తదితరులు పాల్గొన్నారు.
జనసేనలో చేరిన అనంతరం జంగాలపల్లి శ్రివాసులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు సంధించారు. అయన మాట్లాడుతూ.. ఈ వైకాపా ప్రభుత్వం జనసేన కార్యకర్తల పై ఎన్నో కేసులు పెట్టీ ఇబ్బందికి గురిచేశారు. వారిని మాత్రమే కాదు మమల్ని సైతం ఇబ్బంది పెట్టీ అవమానించారు. ఈ వైకాపా ప్రభుత్వ అవమానాలు భరించలేక బయటకి రావడం జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచన విధానం, విధివిధానాలు, పార్టీ సిద్ధాంతాలు నచ్చి జనసేన లోకి రావడం జరిగింది. నాలుగు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారిని కలిసి సుదీర్ఘంగా చర్చించిన విషయం తెలిసిందే, చర్చించినంత సేపు కూడ పవన్ కళ్యాణ్ ప్రజలపై ఎంత నమ్మకం పెట్టుకున్నారు అనేది తెలిసింది. ప్రజల కోసం ఎంతలా తపిస్తున్నారు అనేది తెలిసింది. ప్రజా నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమేనని జనసేనానిని పోగర్తలతో ముంచెచేత్తారు.
పవన్ కళ్యాణ్ గురించి ఇంకా మాట్లాడుతూ.. ఆయనతో మాట్లాడుతున్నంత సేపు ఆయన మాట్లాడిన ఒక్కొక్క మాట కూడ ఒక్కొక్క తూటలా నా గుండల్లో గుచ్చుకుందన్నారు. ప్రజల కోసం ఆయన పరితపిస్తున్న తీరు నా హృదయాన్ని కలిచివేసింది. పవన్ కల్యాణ్ నాయకత్వంలో రాయలసీమ బలోపేతానికి కృషి చేస్తానని తెలియచేస్తున్నాను. ఈ రోజు నుండి చిత్తూరు జిల్లాలో కానీ, గ్రెటర్ రాయలసీమలోని 6 జిల్లాల్లో జనసేన కార్యకర్తలకు కానీ, వీర మహిళలకు కానీ ఏ ఇబ్బంది ఎదురైనా మేము ఉంటాం అని హామీ ఇచ్చారు. వైకాపా ప్రభుత్వం అందర్ని నమ్మించి మోసగించింది. అందులో నేను కూడా బాధితుదినే. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న ఆరచకాలు, అన్యాయాలు అరికట్టేందుకు పవన్ కల్యాణ్ ముందుకి వచ్చారు. వారికి మనం కొండంత బలమై ముందుకి నడిపించి గెలిపించుకోవాలని కోరారు. నేను ఈ రోజు విజయవాడకి వస్తే మన పార్టీ వారికి బీ.సీ, ఎస్.సీ వారికి సైతం ఇచ్చిన ఇండ్లను స్లాబ్ లెవెల్ వరకు వచ్చిన వాటిని కూలుస్తున్నారు. ఇలాంటి అరాచకాలు ముందు జరగకుండా చూస్తామని ఆరణీ శ్రీనివాసులు హామీ ఇచ్చారు.