17, మార్చి 2024, ఆదివారం

మహిళా నేతలకు చంద్రబాబు ద్రోహం !


ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ కోటమి బీసీలు అనే కాదు మహిళలను కూడా పూర్తిగా విస్మరించింది. వైసిపి జిల్లాలో ఇద్దరు బీసీలకు సీట్లు ఇవ్వగా, తెలుగుదేశం పార్టీ రిక్తహస్తం చూపింది. అలాగే వైసీపీ పార్టీలో ఇద్దరు మహిళలకు టికెట్లు కేటాయించగా, తెలుగుదేశం పార్టీ మహిళలను పూర్తిగా విస్మరించింది. రానున్న ఎన్నికలలో పోటీ చేయడానికి పలువురు మహిళలు ఆసక్తి చూపారు. అయితే మహిళా నేతలను పక్కన పెట్టిన తెలుగుదేశం పార్టీ పురుషులకు మాత్రమే టికెట్లు ఇచ్చింది. టిక్కెట్టు ఆశించి భంగపడిన మహిళా నేతలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. కొందరు మహిళలు పార్టీ మారడానికి సైతం వెనకాడడం లేదు. ఈ క్రమంలో క్రమంగా మహిళా నేతలు తెలుగుదేశం పార్టీకి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.



గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున తిరుపతి నియోజకవర్గం నుంచి సుగుణమ్మ పోటీ చేసి 706 ఓట్లు తేడాతో ఓడిపోయారు. ఆమె నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతూ పార్టీ కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేశారు. తిరుపతి మహానగరంలో ఇక్కడ ఏం జరిగినా ముందుండి పార్టీ కోసం అంకితభావంతో నిలబడ్డారు. సభలు, సమావేశాలకు భారీ ఎత్తున జన సమీకరణ చేశారు. అధిష్టానం ఆదేశాలను శిరసావహిస్తూ అన్ని కార్యక్రమాలను అమలు చేశారు. యువగళం, బదుడే బాదుడు, ఇదేం కర్మ వంటి కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి జైలులో ఉన్న 52 రోజులపాటు నిరవధికంగా కార్యక్రమాలు నిర్వహించారు. నిరసనలు, ధర్నాలు రాస్తారోకోలతో తిరుపతి పట్టణాన్ని హోరెత్తించారు. అయినా, చివరి నిమిషంలో తిరుపతి టికెట్లను జనసేన కేటాయించడంతో సుగుణమ్మ తీవ్ర అసంతృప్తి గురయ్యారు. ఆమె ఒక దశలోలో పార్టీ మారడాన్ని కూడా సిద్ధమైనట్లు సమాచారం. అయితే అప్పటికే పరిస్థితుల చేజారటంతో తెలుగుదేశం పార్టీలోనే ఉంటున్నారు.



గత ఎన్నికల్లో పుంగనూరు నియోజకవర్గ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన నూతనకాల్వ అనీషారెడ్డి ఆయనకు గట్టిని ఇచ్చారు. ఎన్నికల వ్యూహాన్ని పకడ్బందిగా అమలు చేసి, వైసిపి గాలిలో కూడా పెద్దిరేద్దికి రెదురొడ్డి నిలబడ్డారు. అయితే ఎన్నికలు కాగానే అవమానకరంగా ఆమెను పక్కకు తప్పించి, చల్లా బాబుకు ఇన్చార్జి ఇవ్వడం జరిగింది. దీని వెనుక కిషోర్ కుమార్ రెడ్డి హస్తం ఉందని భావిస్తున్నారు. ఇన్చార్జి పోస్ట్ నుంచి తప్పించడంతో అనీషారెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇటీవల నారా భువనేశ్వరి జిల్లా పర్యటన సందర్భంగా తెర మీదికి వచ్చారు. ఆమెతోపాటు జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. రెండు మూడు దఫాలు నారా చంద్రబాబు నాయుడును కలిశారు. రామచంద్రారెడ్డి మీద బలమైన అభ్యర్థిని నిలుపాలి అనుకుంటే తనకు తప్పకుండా అవకాశం వస్తుందని భావించారు. చివరి నిమిషం వరకు వేచిచూచినా, నిరాశ మిగిలింది. దీనితో రాజకీయ వైరాగ్యంతో ఆమె ఉన్నారు.



చిత్తూరు అసెంబ్లీ టిక్కెట్టును ను చిత్తూరు పట్టణ పార్టు అధ్యక్షురాలు, మాజీ మేయర్ కటారి హేమలత ఆశించారు. ఒంటరి మహిళ అయినా కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. పార్టీ ఇచ్చిన అన్ని కార్యక్రమాలను ముందుంది నడిపారు. ఆమె మామ కటారి మోహన్, అత్త కటారి అనురాధలను చింటూ మున్సిపల్ కార్యాలయంలోనే కాల్చి చంపిన విషయం తెలిసిందే. హేమలత భర్త ప్రవీణ్ ను కూడా కరోనా మహమ్మారిని పొట్టన పెట్టుకుంది. అయినా ధైర్యం విడువకుండా, రాజకీయాల్లో పోరాటపటమను చూపారు. అధికార పార్టీ తప్పుడు కేసులకు వ్యతిరేకంగా పోరాడారు. ఆమె పురుషులతో ధీటుగా చిత్తూరు పట్టణంలో పార్టీ కార్యక్రమాలను నిర్వహించారు. అయితే ఆమెను పక్కనపెట్టి కొంతకాలం కిందట పార్టీలో క్రియాశీలకమైన గురజాల జగన్మోహన్ నాయుడుకు టికెట్ ను కేటాయించారు.



సత్యవేడు నియోజకవర్గం నుంచి టికెట్ కోసం ముగ్గురు మహిళలు పోటీపడ్డారు. నియోజకవర్గ ఇన్చార్జిగా హెలన్ పార్టీ కార్యక్రమాలను దగ్గరుండి నడిపించారు. ఆమె ఇన్చార్జి పోస్టును కూడా ముడుపులు చెల్లించి అందుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అయినా చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో ఆందోళన కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్నారు. అలాగే గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన జెడి రాజశేఖర్, ఆయన కుమార్తె మౌనిక కూడా రాజకీయాలలో చురుగ్గా పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో జరిగిన ఆందోళన కార్యక్రమాలలో హెలెన్ తో కలవకుండా ప్రత్యేకంగా ఆందోళన కార్యక్రమాలను నిర్వహించి, అధిష్టానం దృష్టిని ఆకర్షించారు. జెడి రాజశేఖర్ 50 లక్షల వ్యయంతో సొంతంగా ఒక గ్రామానికి రహదారినీ కూడా నిర్మించారు. అలాగే తిరుపతిలో డెంటల్ డాక్టర్ గా పనిచేస్తున్న చందనా స్రవంతి పేరు కూడా తెర మీదికి వచ్చింది. పలుమార్లు  ఐ వి ఆర్ ఎస్ లో కూడా అభిప్రాయ సేకరణ  జరిగింది. అయితే వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం తెలుగుదేశం పార్టీలో చేరడంతో, వీరందరిని పక్కనపెట్టి ఆదిమూలంకు  టిక్కెట్లు కేటాయించడం జరిగింది. దీంతో కష్టకాలంలో పార్టీ అండగా నిలిచిన మహిళలకు తీవ్ర నిరాశ మిగిలింది.


బి కొత్తకోట కు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి పర్వెన్ తాజ్ ఈ పర్యాయం తంబళ్లపల్లె టిక్కెట్టు నాశించారు. ఆమె పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్నారు. పార్టీ ఇచ్చిన అన్ని కార్యక్రమాలను నియోజకవర్గంలో అమలు చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో భారీగా మహిళలను సమీకరించి తెలుగుదేశం పార్టీ సత్తాను చాటారు. ముస్లిం మైనారిటీ, మహిళ కోటా కింద తనకు టికెట్టు కేటాయించాల్సిందిగా పర్వీన్ తాజ్ అధిష్టానాన్ని కోరారు. అధిష్టానం గతంలో ఎమ్మెల్యేగా ఉండిన శంకర్ తో పాటు పర్వీన్ తాజ్ కూడా పక్కన పెట్టింది. డబ్బులు ఉందన్న ఏకైక కారణంతో ఇటీవల పార్టీలో చేరిన జయచంద్ర రెడ్డికి టికెట్ ని కేటాయించింది. దీంతో ఆనాటి నుంచి ఈనాటి వరకు తంబళ్లపల్లె నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాలను చేస్తున్నారు. తంబర్లపల్లి టిక్కెట్టు తిరిగి శంకర్ యాదవ్ కి కేటాయించాలని కోరుతూ అన్ని మండలాల్లో నిరసనలు జరుగుతున్నాయి. ఇలా తెలుగుదేశం పార్టీ బీసీ అభ్యర్థులతో పాటు, మహిళలను కూడా విస్మరించడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *