5, మార్చి 2024, మంగళవారం

మంత్రి రోజాకు టిక్కెట్టు ఇస్తే ఓడిస్తాం

 




సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మంత్రి రోజాపై అసమ్మతి స్వరాలు తీవ్రమవుతున్నాయి. నియోజకవర్గ పరిధిలోని మండలాలతో పాటు నగరి, పుత్తూరు నేతలు రోజా అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రోజాను వ్యతిరేకిస్తూ నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల నేతలు బహిరంగ విమర్శలు చేయడంతో పాటు తమ మండలాల పరిధిలో మంత్రి ప్రమేయం లేకుండా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ ధిక్కార స్వరాన్ని పెంచుతున్నారు. ఈసారి మంత్రి రోజాకు టికెట్‌ ఇస్తే ఓటమి తప్పదని బాహాటంగా హెచ్చరిస్తున్నారు. మంత్రి రోజాపై ఆమె అనుచరులు మండిపడుతున్నారు. ఆమెకు టికెట్‌ ఇవ్వొద్దని వైసీపీ అధిష్టానానికి మంగళవారం విజ్ఞప్తి చేశారు. నగరి నియోజకవర్గానికి చెందిన ఐదు మండలాల వ్యతిరేక వర్గం నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించి నియోజకవర్గంలో రోజాకుకాకుండా మరెవరికైనా టికెట్‌ ఇవ్వాలని కోరారు.


ఇటీవల రూ. 50 లక్షల తుడా నిధులతో రోజా అన్న రామ్​ప్రసాద్​ రెడ్డి కాలువల పనులకు భూమిపూజ చేయడం ఎంత వరకు సమంజసమని వైసీపీ జడ్పీటీసీ సభ్యుడు మురళీధర్​ రెడ్డి  ప్రశ్నించారు. తమ నియోజకవర్గంలో రోజా అన్నదమ్ములు ప్రభుత్వ కార్యక్రమాలకు భూమిపూజలు, ప్రారంభోత్సవాలు చేయవచ్చు తాము చేయకూడదా?  అని వ్యాఖ్యానించారు. తాము మంత్రి రోజాను వ్యతిరేకిస్తున్నామే తప్ప పార్టీని కాదన్నారు. మంత్రి రోజాపై నిండ్ర, నగరి, పుత్తూరు, వడమాలపేటలో అసంతృప్తి ఉందని తెలిపారు.


రెండు సార్లు పార్టీ, అభ్యర్థి రోజాను గెలిపించుకునేందుకు అహర్శిశలు, శక్తివంచన లేకుండా పనిచేశామని తెలిపారు. ఐరన్‌ లెగ్‌ పేరున్న రోజాను నియోజకవర్గ వైసీపీ నాయకులంతా గోల్డెన్ లెగ్ గా మార్చామని పేర్కొన్నారు. అయితే నియోజకవర్గంలో ఆమె సోదరులు చేస్తున్న దోపిడికి  అడ్డుగా ఉన్నామనే అక్కసుతో మమ్మల్ని దూరంగా పెట్టి వేధిస్తున్నారని వడమాలపేట జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి, పుత్తూరు నేత అమ్ములు, లక్ష్మీపతిరాజు, మండలాల వైసీపీ నాయకులు ఆరోపించారు.


వ్యతిరేకవర్గం నేతలు ఎవరైనా సరే అవినీతి పాల్పడి ఉంటే దానిపై రోజాతో చర్చకు సిద్దమని సవాల్‌ విసిరారు. వైసీపీ అధికారంలోకి రాకముందు అప్పుల్లో ఉన్న రోజా మంత్రి అయ్యాక ఎంత సంపాదించిందో అందరికీ తెలుసని విమర్శించారు. పుత్తూరు నగరిలో ఎక్కడ చూసినా భూ కబ్జాలు, దౌర్జన్యాలు, దోపిడీలు జరుగుతున్నాయని మండిపడ్డారు. మంత్రి రోజాకు మరోసారి వైఎస్‌ఆర్‌ అధిష్టానం సీటు ఇస్తే తాము పనిచేయాబోమని స్పష్టం చేశారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *