15, మార్చి 2024, శుక్రవారం

సికే బాబుకు భద్రత పునరుద్దరించాలి



చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబుకు గన్‌మెన్‌ లను పునరుద్దరించాలని అయన సతీమణి సికే
లావణ్య డిమాండ్ చేశారు. శుక్రవారం చిత్తూరులో విలేకరులతో మాట్లాడుతూ.. సికే బాబుకు గన్ మాన్ లను తొలగించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. సీకే బాబుకు ఏదైనా జరగరానిది జరిగితే అందుకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే అంటూ డాక్టరు సీకే లావణ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాజకీయ ఆక్కసుతోనే... భద్రత సిబ్బందిని తొలగించినట్లు ఆరోపించారు. 

ఆమె మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా రాజకీయ జీవితంలో ప్రజల మధ్య ఉన్న నాయకుడు సీకే బాబు అని పేర్కోన్నారు. ప్రస్తుతం ఎన్నికలు వస్తున్న తరుణంలో ప్రజల వద్దకు వెళుతూ సమస్యలను అడిగి తెలుసుకుంటూ భరోసా ఇస్తున్నారన్నారు. ఈ సమయంలో ఆయనకు ఉన్నటువంటి భద్రతను తొలగించడం ఆయనను ప్రజలకు దూరం చేసినట్లే అవుతుందని అన్నారు. గతంలో సీకే బాబుపై 9 సార్లు హత్యాయత్నం జరిగిన సందర్భాలను గుర్తుకు తెచ్చుకుంటే భయమేస్తుందని లావణ్యబాబు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు తొలగించిన భద్రతను పునరుద్దించాలని ఎస్పీకి వినతి చేశారు. 


చిత్తూరులో టీడీపీ అభ్యర్థి గురిజాల జగన్మోహన్‌కు పూర్తి మద్దతు తెలుపుతూ సీకె బాబు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ సమయంలో భద్రత తొలగించడం హేయమైన చర్యగా అభివర్ణించారు. సీకేబాబుకు హాని తలపెట్టడానికే... వైకాపా నేతలు... పోలీసు సహకారంతో భద్రత సిబ్బందిని తొలగించినట్లు పేర్కొన్నారు. ఈ అంశంపై రాజకీయ పోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు. పోలీసు యంత్రాంగం సైతం నిజనిజాలు పరిశీలన చేయాలని సూచించారు. ప్రజలు అన్ని గమణిస్తున్నారని... సరైన సమయంలో తగిన గుణపాఠం నేర్పుతారన్నారు. సీకేబాబు చరిష్మా చూసి... ఒర్వలేక... భద్రత సిబ్బందిని తొలగించినట్లు లావణ్య ఆరోపించారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *