ముక్యమంత్రికి ఘన స్వాగతం
చిత్తూరు, మార్చి 1, (ఆంధ్రప్రభ బ్యూరో)
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో సామాజిక పింఛన్లను పంపిణీ చేయడానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు శనివారం ఘన స్వాగతం లభించింది.
నియోజకవర్గం లో ఒక్క రోజు పర్యటనలో భాగంగా శనివారం మధ్యాహ్నం 12.28 గంటలకు గంగాధర నెల్లూరు మండలం రామానాయుడు పల్లె వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ చేరుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు జిల్లా ఇంచార్జి మంత్రి,
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సుమిత్
కుమార్, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ల ప్రసాద్ రావు, అనంతపురం రేయింజ్ డి ఐ జి.షిమోషీ బాజ్ భాయ్, జిల్లా ఎస్పీ మణికంఠ చెందొలు, గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ వి.యం థామస్, ఎమ్మెల్యేలు పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, నగరి ఎమ్మెల్యే గారి భాను ప్రకాష్, జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరి, క డ పి డి వికాస్ మర్మత్, డి ఎఫ్ ఓ.భరణి, అసిస్టెంట్ కలెక్టర్ హిమ వంశీ ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. అలాగే పుంగనూరు టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆర్ గాంధీ, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ సిఆర్ రాజన్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సప్తగిరి ప్రసాద్, టిడిపి రాష్ట్ర నాయకులు చిట్టిబాబు, జనసేన జీడి నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జ్, రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ యుగంధర్, బిజెపి జిల్లా పార్టీ అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు, చిత్తూరు మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు కాజురు బాలాజీ, తెలుగు మహిళ నాయకురాలు వైవి రాజేశ్వరి తదితరులు ముఖ్యమంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. హెలిప్యాడ్ లో ముఖ్యమంత్రికి రోజా పూలను అందజేసి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. హెలిప్యాడ్ లో పలువురు ముఖ్యమంత్రికి వినతి పత్రాలను సమర్పించారు. వెంకటేశ్వర స్వామి ఫోటోను కూడా అందజేశారు. హెలిప్యాడ్ లో అందరినీ పలకరించుకుంటూ, అందరి సమస్యను వింటూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుకు కదిలారు. పలువురు ముఖ్యమంత్రికి పాదాభివందనం చేశారు.

